అధికారులకు సీఎం కె.సి.ఆర్. ఆదేశాలు
హైదరాబాద్, జులై 22 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి లో వరదల పరిస్థితిచ, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితి పై సిఎం కేసీఆర్ ఆరా తీసారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి సిఎం ఆరా తీసారు.
కాగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే వున్నాయని, భద్రాచలం వద్ద వరదను అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుంటూ సహాయక చర్యల కోసం సిద్దంగా వున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎం కేసీఆర్ గారికి వివరించారు.
రేపటెల్లుండి కూడా భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని సిఎం ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండండి
Date: