చంద్రబాబు, కరువు కవలపిల్లలు…

Date:

రైతు బాగుంటునే దేశం బాగుంటుంది
ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ్యాఖ్య‌
ఏపీలో రైతుకు వైయ‌స్ఆర్ భ‌రోసా
వరుసగా నాలుగో ఏడాది, రెండో విడత
అన్న‌దాత‌ల ఖాతాల్లో జ‌మ‌చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
ఆళ్ల‌గ‌డ్డ‌, అక్టోబ‌ర్ 17:
ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయాన్ని అందిస్తోంది. నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీప్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇప్పటికే అందజేసింది. రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ.4,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు.


ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభిస్తున్నాం. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలను పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతిసోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవ్వా, తాతలకు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని…
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని… మనసా, వాచా, కర్మనా త్రికరణశుద్ధిగా నమ్మి, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేసే దిశగానే మూడేళ్ల పరిపాలనలో అడుగులు వేస్తూ వచ్చాం.
ఈ రోజు మన రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో మిగిలిన 27 రాష్ట్రాలలో జరగని విధంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశచరిత్రలో ఎక్కడా లేదు. రైతు బిడ్డగా, మీ బిడ్డగా ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాను.


ప్రతి పథకం క్యాలెండర్‌ ప్రకారం…
ప్రతిపథకానికి క్యాలెండర్‌ ఇచ్చి, ఆ నెల వచ్చిన వెంటనే ఆ పథకాన్ని అమలు చేస్తూ… క్రమం తప్పకుండా ప్రతి కుటుంబానికి అండగా ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో అడుగులు వేశాం.
అందులో భాగంగానే నేడు వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ నుంచి అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది.


రైతులు పరిస్థితి ఎలా ఉందంటే…
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేస్తే.. కేవలం అర హెక్టార్‌ అంటే 1.25 ఎకరాలలోపు ఉన్న రైతులు మన రాష్ట్రంలో దాదాపు 68 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాల వరకు ఉన్న రైతులను ఎంత అన్నది తీసుకుంటే… 82 శాతం మంది ఈ కోవలోకే వస్తారు. ఇలాంటి రైతులకు సంవత్సరానికి రూ.13,500 మనమిచ్చే పెట్టుబడి సొమ్మ వాళ్లకు ఎంతగా ఉపయోగపడుతుందంటే… 1.25 ఎకరాల లోపు ఉన్న 68 శాతం రైతులకు దాదాపు 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సరిపోతుంది.


ప్రతి రైతు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, పంట వేసే టైంకు తనకు పెట్టుబడి సొమ్ము చేతికందాలి, అలా అందితే ఆ రైతు అప్పులపాలు కాకుండా తన పొలంలో పంట వేసుకుని, తన కాళ్లమీద తను నిలబడగలుగుతాడనే గొప్ప ఉద్దేశ్యంతో వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ప్రతి ఏటా రూ.13,500 రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
నేరుగా మీ బిడ్డ ఇక్కడ బటన్‌ నొక్కితే మీ అకౌంట్లలో జమ అవుతుంది. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు, ప్రతి రైతు కుటుంబానికి నేరుగా ఈ సొమ్మ వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.


మూడు విడతల్లో రైతు భరోసా..
ఈ రూ.13,500 సొమ్ము మూడు విడతల్లో ఇస్తున్నాం. ఖరీప్‌ సీజన్‌ మొదలయ్యే లోపు అంటే పంటలు మొదలయ్యే.. మే నెల ముగిసే లోపే రూ.7,500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాం. ఆ తర్వాత పంట కొతకొచ్చేసరికి అంటే అక్టోబరు ముగిసే లోగా మరో రూ.4,000 పంట కోతల ఖర్చుల కోసం రైతుల చేతిలో పెడుతున్నాం. ఆ తర్వాత జనవరి మాసంలో సంక్రాంతి పండగ వచ్చేసరికి మరో రూ.2వేలు ఇస్తున్నాం.
వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌లో భాగంగా ఈ ఏడాదికి సంబధించి మే నెలలో రూ.7,500 ఇచ్చాం. ఈ రోజు రెండవ విడతకు సంబంధించి మరో రూ.4వేల చొప్పున, 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2096 కోట్లు బటన్‌ నొక్కి జమ చేస్తున్నాం.


రైతు భరోసా –మూడేళ్లలో రూ.25,971 కోట్లు జమ.
ఈ మూడున్నర సంవత్సరాల్లో ఇప్పటివరకు.. ఒక్క వైయస్సార్‌ రైతుభరోసా పథకం కిందనే దాదాపు 50 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.25,971 కోట్లు ఇవ్వగలిగాం. అంటే ప్రతి ఏడాది రూ.7,000 కోట్ల రూపాయలు వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.
మూడేళ్లలో కుటుంబానికి రూ.51 వేలు…
మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ప్రతి రైతన్నకు మూడు సంవత్సరాలు వరుసగా రూ.13,500 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. నాలుగో ఏడాదికి సంబంధించి మొన్న మే మాసంలో మరో రూ.7,500 వారి ఖాతాల్లో పడింది. ఇవాళ మరో రూ.4,000 ప్రతి రైతన్న ఖాతాల్లో పడుతుంది.
అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.51,000 వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయగలిగాం.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల కోసం రూ.1.33 లక్షల కోట్లు సాయం…
పట్టాలు ఉన్న రైతులకే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులకు, దేవాదాయశాఖ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల ద్వారా భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా వైయస్సార్‌ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రూ.13,500 ఇచ్చి వాళ్లకూ మంచి చేస్తున్నాం.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి సాయంగా, రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా మన ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కాలంలోనే రైతుల కోసం చేసిన వ్యయం…. రూ.1.33 లక్షల కోట్లు.


ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి.
మన పాలనలో ఒక్క కరువు మండలమూ లేదు.
దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడి దయతో రాలేదు.
అదే గత ప్రభుత్వం, చంద్రబాబునాయుడు గారి హయాంలో గమనిస్తే.. 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీప్‌లో 347, 2018లో రబీలో మరో 257 కరువు మండలాలుగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం చంద్రబాబునాయుడు గారు హాయంలో.. చంద్రబాబునాయుడు, కరువు ఈ రెండూ కూడా కవలపిల్లలే అన్నట్టుగా ఆయన పరిపాలన సాగింది.


ఈ రోజు దేవుడి దయతో మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీర్వాదంతో పుష్కలంగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబరు 12 వరకు చూసుకుంటే.. సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదు చేసుకుని సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదు చేసుకుని రాష్ట్రం అంతా కళకళలాడుతుంది.
ఇప్పటికే 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటే, 5 జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే కూడా అధికంగా నమోదు అయింది. దేవుడి దయ ఎంత గొప్పది అంటే.. మీటింగ్‌ జరుగుతుంటే.. బయట చల్లని వాతావరణం ఉంది. నిజంగా దేవుడిదయతో ఈ రోజు రాష్ట్రంలో మంచి పరిపాలన కూడా సాగుతుంది.
గతంలో ఉన్న 13 జిల్లాలు తీసుకున్నా, ఇప్పుడున్న 26 జిల్లాలు తీసుకున్నా ఈ మూడున్నర సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం రాకుండా దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి.


మంచి వర్షాలు– పెరిగిన సాగు విస్తీర్ణం…
మంచి వర్షాలు కురవడమే కాదు.. పంటల విస్తీర్ణం కూడా చూస్తే… గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనాకాలంతో పోల్చితే… అప్పట్లో ఆహారధాన్యాలు 154 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే, ఈ రోజు దేవుడి దయతో మన మూడు సంవత్సరాల నాలుగు నెలల పరిపాల కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167.24 లక్షల టన్నులు.
అంటే సగటున ప్రతి ఏటా 13.29 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఈ దిగుబడి ఏం చెబుతుందంటే.. ప్రతి గ్రామంలో రైతున్నలు సంతోషంగాఉన్నారు. రైతన్నలకు మంచి దిగుబడి రావడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుకూలీలకు మంచి జరిగింది.


రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు…
ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతి రిజర్వాయరులోనూ సకాలంలో నీళ్లు పుష్కలంగా నిండి ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి వంటి జిల్లాలతో సహా అన్ని చోట్లా కూడా భూగర్భ జలాలు రికార్డు స్దాయిలో పెరిగాయి.
రాష్ట్ర ప్రజలు అంతకముందు ఐదేళ్లు చంద్రబాబునాయుడు హాయంలో ఆయన పాలన చూశారు. ఇప్పుడు మూడున్నర సంవత్సరాల మన పాలన చూస్తున్నారు. ఒక్కసారి తేడా గమనించండి.


బాబు గారు హయాలంలో రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం వల్ల రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితుల్లోకి వచ్చారు. మన ప్రభుత్వంలో రైతులు కోలుకుని, వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా, బ్యాంకుల నుంచి మళ్లీ రుణాలు తీసుకునే పరిస్థితుల్లోకి వచ్చారు.
వడ్డీలేని పంట రుణాలకు సంబంధించి గమనిస్తే… చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆయన ఐదేళ్లలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.685 కోట్లు మాత్రమే. అక్టోబరు 2016 నుంచి పూర్తిగా ఆ పథకాన్నే రద్దు చేస్తే… మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నావడ్డీ పథకాన్ని మళ్లీ తీసుకునిరావడమే కాకుండా, పారదర్శకంగా ప్రతి రైతన్నకు అందేట్టు చేస్తూ.. మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో సున్నా వడ్డీ కింద రూ.1282 కోట్లు చెల్లించాం.


వ్యవసాయ రుణాలు…
చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో వ్యవసాయ రుణాలు రూ.3,64,624 కోట్లు మాత్రమే ఇస్తే.. ఈరోజు మనందరి ప్రభుత్వంలో ఈ మూడున్నరేళ్లలో రైతన్నలకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఏకంగా రూ.5,48,518 కోట్లు.
అదే చంద్రబాబు హయాంలో పంటలబీమా సొమ్ములో రైతుల వాటా, రైతులే కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఈ రెండూ సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులకు ఆ రోజుల్లో ఇన్సూరెన్స్‌ పరంగా నష్టం జరిగింది. ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో ఐదేళ్లకు కలిపి 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3411 కోట్లు పంటబీమా పరిహారంగా దక్కితే .. ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో 44.28 లక్షల మంది రైతులకు రూ.6684 కోట్లు బీమా సొమ్ము నేరుగా జమ చేశాం. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించండి. రైతన్నల నుంచి ఒక్క రూపాయి కూడా బీమా సొమ్మ తీసుకోలేదు. బీమా సొమ్మ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది.


రైతులకు తోడుగా…
ప్రతిగ్రామంలోనూ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాప్‌ చేయిస్తున్నాం. దీని ద్వారా ప్రతి రైతన్ననూ ఇన్సూరెన్స్‌ పథకంలోకి తీసుకొస్తున్నాం. ఏ రైతూ నష్టపోకుండా వారికి తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం జరుగుతుంది.
చంద్రబాబు హయాలంలో విత్తనాలు కల్తీ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ కల్తీ. ఈ కల్తీలు వేసుకుని రైతులు నష్టపోతున్న పరిస్ధితులు కనిపిస్తుండేవి. చంద్రబాబు గారు హయాంలో రాష్ట్రం మొత్తం మీద ఈ కల్తీని అరికట్టేందుకు కేవలం 12 ల్యాబులు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 147 ల్యాబులు కనిపిస్తునాయి. ఇందులో 70 ల్యాబులు ఇప్పటికే పూర్తై రైతన్నలకు సేవలందిస్తున్నాయి. మరో 77 నియోజకవర్గస్ధాయికి సంబంధించి ల్యాబుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
జిల్లాస్థాయిలో 2 ల్యాబులు, ప్రాంతీయ స్థాయిలో 4 ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లు ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.


నేడు పక్కాగా ఇన్‌పుట్‌ సబ్సిడీ….
ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే అప్పట్లో పంటను పట్టించుకునేవారు లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అని పేరుకు మా ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చివరకు చంద్రబాబునాయుడు గారి హయాలంలో 2017–18 , 2018–19 కాలానికి సంబంధించి రూ.2558 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం.
మన ప్రభుత్వం కాలంలో అక్షరాల 20.85 లక్షలమంది రైతులకు ఇప్పటికే రూ.1800 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇచ్చాం.
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌ ముగిసే లోగానే రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ వారి పేర్లు, ఇ–క్రాప్‌ డేటాతో సహా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి వారికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది.
ఇన్సూరెన్స్‌కాని, ఇన్‌పుట్‌ సబ్సిడీలను రైతులకు క్రమం తప్పకుండా సకాలంలో అందిస్తున్నాం.


ఆర్బీకే – విత్తనం నుంచి అమ్మకం వరకూ…
ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు ప్రతి గ్రామంలోనూ రైతన్నకు తోడుగా అండగా ఉంటూ పనిచేస్తున్నాయి. ఇ–క్రాపింగ్‌ అన్నది ప్రతి గ్రామంలోనూ నమోదు అవుతున్నది. ఈ డేటా అధారంగా ప్రతి పథకం ఎటువంటి వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా రైతన్నకు నేరుగా అందించే కార్యక్రమం జరుగుతుంది.
దురదృష్టవశాత్తూ రైతు ఆత్మహత్యలు చేసుకుంటే.. గతంలో ఆత్మహత్య చేసుకున్నాడన్న సానుభుతి ఉండేది కాదు. అసలు ఆ మనిషి రైతే కాదు అనే మాటలు వినిపించేది. దాన్ని ఆత్మహత్యగా అంగీకరించేవారు కాదు.
కాని ఇవాళ పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తే వెంటనే ఆర్బీకే కేంద్రాలు స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. ఇవాళ పట్టదారు పాస్‌పుస్తకం ఉంది పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు ఒక్కరంటే.. ఒక్కరు కూడా లేరు. సీసీఆర్సీ, కౌలు రైతు కార్డులున్న ప్రతి రైతన్నను కూడా ఇదే రీతిలో ఆదుకుంటున్నాం.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం.
ఆర్బీకేలు యూనిట్‌గా తీసుకుని ఎక్కడా ఎవరూ మిగిలిపోకుండా మంచి చేస్తున్నాం.


రైతుల కోసం విప్లవాత్మక మార్పులు…
పగటిపూట 9 గంటల విద్యుత్‌ ఉచితంగా ఇవ్వడంతో పాటు కనీస మద్ధతు ధర ఇచ్చి పంటలకు కోనుగోలు చేయడంతో, ఆక్వా రైతులను ఆదుకుంటున్నాం. దీంతో పాటు రైతులను భాగస్వామ్యులను చేస్తూ.. ఆర్బీకే స్ధాయిలో సలహా మండళ్లు ఏర్పాటు చేయడం, అక్కడే పనిముట్లన్నీ రైతులకు అందుబాటులో ఉండేట్టుగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా అమూల్‌ సంస్ధను తీసుకురావడం వంటì విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. ఈ మూడేళ్ల నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో తీసుకువచ్చాం.
మన ఖర్మ ఏంటంటే..
ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో వస్తే.. పండ్లు పండే చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా.. మన రాష్ట్రంలో జరుగుతున్నాయి.
ఇంతమంచి జరుగుతున్న విషయాలు ఎల్లో మీడియాలో రావు.
ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఒక చంద్రబాబునాయుడు వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు.
వీరి చేతిలోనే మీడియా ఉంది.
వీళ్లు రాసిందే రాతలు. వీళ్లు ఏది చూపిస్తే అదే జరుగుతుందని భ్రమ కల్పించవచ్చనే గర్వం వీరిలో విపరీతంగా పెరిగిపోయింది. మీడియా అన్నది న్యాయంగా, ధర్మంగా లేదు.
కేవలం వాళ్లకు సంబంధించిన వ్యక్తి సీఎంగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకురావడానికి కుతంత్రాలు పన్నుతున్నారు.
అప్పటికీ, ఇప్పటికీ తేడాను గమనించాలని కోరుతున్నాను.
ఆరోజుకన్నా.. ఇవాళ బ్రతుకులు బాగున్నాయా? లేవా?.
ఈనాడు చెప్తేనో, ఆంధ్రజ్యోతి చెప్తేనో, టీవీ–5 చెప్తేనో, దత్తపుత్రడు చెప్తేనో నమ్మొద్దు. మీ జీవితాలు బాగున్నాయా లేదా ఆరోజుకి ఈ రోజుకి తేడా ఉందా లేదా అన్నది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
గతంలో పరిపాలన ఎలా ఉందో మీరు చూసారు.
కేవలం రైతుల కోసం…
కేవలం రైతులకోసం ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో రూ.1.33లక్షల కోట్లు నేరుగా ఖర్చు చేశాం.
మీ ప్రభుత్వంలో మీ బిడ్డ నేరుగా బటన్‌ నొక్కి.. ఇప్పటిదాకా రూ.1,74,931 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేశాడు.
ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. బటన్‌ నొక్కగానే.. డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి పోతున్నాయి.
అప్పటికీ ఇప్పటికీ తేడా…
అప్పటిలో కూడా ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌.
అప్పుల గ్రోత్‌ రేట్‌ అప్పటికన్నా.. ఇప్పుడు ఇంకా తక్కువే.
కాని మీబిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? అప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అన్నది ఆలోచన చేయండి.
అప్పట్లో నలుగురే… ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ అనే పథకం ఆరోజు అమలయ్యేది.
మీ బిడ్డ హయాంలో డీబీటీ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌. బటన్‌ నొక్కిన వెంటనే మీ అకౌంట్లలోకి డబ్బు వస్తుంది. అప్పట్లో ఆ నలుగురు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో అనే వ్యవస్ధ నడిపిస్తే… అప్పట్లో దోపిడీని టీవీల్లో ఎవరూ చూపించరు, రాయరు. కారణం వీళ్లంతా గజ దొంగల ముఠా.
ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఇక్కడ నేరుగా బటన్‌ నొక్కగానే మీ అకౌంట్లలోకి డబ్బులు వస్తున్న మార్పును గమనించమని కోరుతున్నాను.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు, మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలి.
దేవుడి దయతో మీ అందరికీ మంచి చేసే పరిస్థితులు రావాలని. ఇలాంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మనస్తత్వమున్న మీడియా మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని, దేవుడి దయతో మంచి నిలబడాలని ప్రజలందరికీ, అన్ని ప్రాంతాలకీ మంచి జరిగే పరిస్థితులు, రోజులు రావాలని కోరుకుంటూ.. రైతు భరోసా డబ్బులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. కాసేటపటి క్రితం ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌ రెడ్డి( నాని) మాట్లాడుతూ…
ఆళ్లగడ్డకు సంబంధించి కొన్ని పనులను ప్రస్తావించారు. 50 పడకల ఆసుపత్రి పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. అవి మెరుగ్గా జరగడానికి రూ.8 కోట్లు కావాలన్నారు. అవి మంజూరు చేస్తున్నాం.
ఆళ్లగడ్డ మున్సిపాల్టీలో విలీన గ్రామాల్లో పనుల కోసం నిధులు కావాలన్నారు. సీసీరోడ్లు, డ్రైన్లు, పుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌ లైటింగ్స్‌ కోసం రూ.56 కోట్లు కావాలన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. 220 కేవీ సబ్‌స్టేషన్‌ కావాలన్నారు, అది కూడా మంజూరు చేస్తున్నాం. దీంతో పాటు సిరివెల్ల నుంచి రుద్రవరం రోడ్డుకు రూ.8 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి, రుద్రవరం నుంచి ఎర్రగుడిదిన్న వరకు రూ.8కోట్లతో మరో హైలెవల్‌ బ్రిడ్జిని కూడా మంజూరు చేస్తున్నాం. స్టేడియం నిర్మాణం మధ్యలో నిల్చిపోయింది.. దాన్ని పూర్తి చేయాడనికి రూ.2 కోట్లు కావాలన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. డిగ్రీ కాలేజీకి కూడా మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ అభివృద్ది పనులన్నింటికీ దాదాపు రూ.95 కోట్లు ఆళ్లగడ్డకు మంజూరు చేస్తూ సీఎం వైయస్‌.జగన్‌ ప్రసంగం ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...