అండగా నిలవండి
సుడాన్ బాధితులపై సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్ 26 : సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ఎపి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్వస్థలాలు చేరేంతవరకూ వారికి అండగా నిలవాలని కోరారు. అంతర్యుద్ధం కారణంగా సుడాన్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయంగా వ్యవహరించి సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే… వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని అక్కడనుంచి స్వస్థలాలకు చేరుకునే వరకూ కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.
వారిని స్వస్థలాలకు చేర్చండి: జగన్
Date: