బరాటం హత్య ఘటనపై ఏపీ సీఎం ఆదేశం
శ్రీకాకుళం, డిసెంబర్ 7: శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆరాతీశారు. దివంగత గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలని వైయస్సార్సీపీ సీనియర్ నేత, రెెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆయన ఆదేశించారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని ఆయన ధర్మానను కోరారు. సీఎం ఆదేశాలతో రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.
ఆ కుటుంబానికి అండగా నిలవండి
Date: