ఈబీసీ నేస్తానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
నూతన పథకం 25న ప్రారంభం
ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర
రిటైర్‌మెంట్ వయస్సు పెంపునకు ఓకే
11వ పీఆర్సీకి క్యాబినెట్ ఆమోదం
అమరావతి, జనవరి 21: ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. అందులో ప్రధానమైనది ఈబీసీ నేస్తం పథకం. ఈ నెల 25న ప్రారంభమయ్యే పథకంలో ఏడాదికి 15వేల రూపాయల చొప్పున మూడేళ్ళు చెల్లిస్తారు. ఈబీసీలో 45-60 ఏళ్ళ మధ్య ఉన్న అర్హులైన మహిళలను గుర్తించి ఈ పథకం కింద నగదును చెల్లిస్తారు. మొత్తం 3లక్షల 92వేల 674మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిపొందుతారు. ఈ పథకానికి 589.01 కోట్ల రూపాయలను కేటాయించారు. సంక్షేమ పథకాల్లో ఇది మరొక కీలకమైన పథకంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రివర్గంలో చర్చించారు. కోవిడ్ నివారణా చర్యలను మంత్రివర్గానికి అధికారులు వివరించారు.
16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులను కేబినెట్ మంజూరుచేసింది. రూ.3820 కోట్లతో పాత మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు పరిపానలపరమైన అనుమతులను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
11వ పీఆర్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇతర నిర్ణయాలు: కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం. వారికి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వనుంది. జూన్ 30 లోగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది.
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో 10శాతం స్థలాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిజర్వ్ చేసింది.
పింఛనర్లకు 5 శాతం స్ధలాలు రిజర్వ్ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లకు ఆమోదం. ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాల ధరలో
20శాతం రిబేటు ఇవ్వాలని నిర్ణయించింది.
- ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల మంజూరుకు ఆమోదం
- ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు
కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటైనెన్స్ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు మంత్రిమండలి ఆమోదం.
25 యేళ్ల పాటు ఓ అండ్ ఏం (ఆపరేషనల్ అండ్ మెయింటైనెన్స్) కు ఇవ్వాలని నిర్ణయం
అందులో పనిచేసే జెన్‌కో ఉద్యోగులను తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు.
వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్ ప్లాంట్.
కిలోవాట్ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14
దాని పక్కనే ఉన్న మరో పవర్ ప్లాంట్‌లో కి లోవాట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34
ఈ నేపధ్యంలో ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్ ఎం కోసం బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని నిర్ణయం
జనవరి 1, 2022 నుంచి పెన్షన్‌ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
ఏపీఐఐసీ నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
ధాన్యం కొనుగోళ్లు కోసం… ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్ అనుమతి
రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకు నిర్ణయం. ఈ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం.
ఇప్పటివరకు 21.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, 21 రోజుల్లో రైతులకు రూ.2150 కోట్ల చెల్లింపులు.
విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహ కల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీలకోసం వాడుకునేందుకు కేబినెట్ ఆమోదం.
తిరుపతిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు 5 ఎకరాల స్థలం
అకాడమీ పెట్టేందుకు స్థలం ఇస్తూ కేబినెట్ నిర్ణయం
ఆచార్య ఎన్టీరంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ( రార్స్)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్(రార్స్)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
ఎండో మెంట్ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం
దీనిద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం.