ఫార్మాసురుడి చేతిలో మెడికల్ సైన్స్ బందీ

Date:

ప్రజలపై మెడికల్ మార్కెటింగ్ వల
ఒకటి తరవాత ఒక్కొక్కటిగా పరీక్షలు
రోగ నివారణపై ప్రచారం నిల్
(అమర్నాథ్ వాసిరెడ్డి)

హార్ట్ ఎటాక్ , కార్డియాక్ అరెస్ట్ , సీవోపీడీ , కాన్సర్ , డయాబెటిస్ , అల్జిమర్ వ్యాధి , కిడ్నీ వ్యాధి , లివర్ వ్యాధి , బిపి … ఇంకా ఇంకా ..

ఈ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు .
ఈ వ్యాధి వస్తే ఇక అంతే ..

భయపడ్డారా ?

మీకు ఈ గతి పట్టకుండా ఉండాలంటే ఇదిగో ఈ టెస్ట్ లు చేసుకోండి .

ఉదాహరణకు గుండె వ్యాధి .
మీ గుండె పదిలంగా ఉందా? లేదా? అని ఇప్పుడు భయపడుతున్నారు కదా ? భయపడకుండా ఎలా వుంటారు లెండి ? ఇన్ని చావు లెక్కలు ఇచ్చాక భయపడకుండా ఉండడానికి మీది గుండా? రాయా?
వెంటనే డయాగ్నస్టిక్ సెంటర్ కు పరుగెత్తి ఈసీజీ , స్ట్రెస్ టెస్ట్ , కార్డియాక్ క్యాథెరిజషన్ టెస్ట్ , కంప్లీట్ బ్లడ్ పిక్చర్ , బిపి టెస్ట్ , చక్కర టెస్ట్ , కార్డియాక్ ఎంఆర్ ఐ , కరోనరీ కాల్షియమ్ స్కాన్ కరోనరీ ఆంజియోగ్రామ్ , న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్ .. ఇలా పాతికో యాబయ్యో టెస్ట్ లు చేయించుకోండి .

అయ్యిందా ?
ఆగండాగండి .
గుండె టెస్ట్ లు చేసుకొన్నారు సరే . మరి ఊపిరి తిత్తులు సంగతి ? ఊపిరి తిత్తులు కీలకం . ఊపిరి తిత్తుల వ్యాధి వల్ల ఇదిగో ఇంతమంది ఫట్ . కాబట్టి మీ ఊపిరి తిత్తులు పదిలంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చెస్ట్ x రే , సిటీ స్కాన్ బ్రోన్కోస్కోపీ ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్ , స్పుటుం కల్చర్ , బ్రోన్కోస్కోపీ లూంగ్ బయాప్సీ , లంగ్ వెంటిలేషన్ స్కాన్ .. ఇలా ఒక ముప్పయి నలభయ్యో టెస్ట్ లు చేసుకోవాలి .

సోమవారం గుండె .. మంగళవారం ఊపిరి తిత్తులు .. బుధ వారం .. కిడ్నీ .. ఇలా వారం మొత్తం .
తిరిగి నెక్స్ట్ వీక్ రిపీట్ .
ఏమో వారం లో ఏదైనా జరగొచ్చు .

ఇదండీ. నేడు జరుగుతున్న మెడికల్ మార్కెటింగ్ .
దీనికి వారు పెట్టిన ముద్దు పేరు ఆరోగ్యం పట్ల అవగాహన .

అవగాహన పేరిట ప్రతి రోజు కొన్ని లక్షల మందిని భయపెట్టడం .. ఆసుపత్రులకు టెస్టింగ్ సెంటర్స్ కు పరుగులెత్తించడం.

ఈ టెస్ట్స్ లో ఏదైనా సమస్య కనిపిస్తే మందులు . అవసరం అయినవి కానివి కూడా
అనేక మందులకు సైడ్ రియాక్షన్స్ .
సైడ్ రియాక్షన్ లేకుండా మందులొస్తాయా ? అని దబాయింపులు.

మన దేశం లో లభించే అనేక మందులు అంతర్జాతీయ స్థాయి లో అమ్ముకొనే వీలు లేదు .. కారణం నాణ్యత లోపం అని రిపోర్ట్స్ .

రోగానికి నివారణ అంటూ ఒకటి చస్తుంది .
దాని పై పెద్దగా ప్రచారం ఉండదు .
రోగం ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని నివారించడం సులభం .

క్యాన్సరా ?
అబ్బే కారణం ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేము .
ADHD . ఆటిజం , ఎలర్జీ .. ఇంకా ఇంకా అనేక రోగాలు .. వీటికి ఫలానా కారణం అని చెప్పలేము. రీసెర్చ్ జరుగుతోంది అని ప్రచారం .

“కాన్సర్ కు వైఫై ఒక కారణం కావొచ్చేమో కదా ?”
” అబ్బే వైఫై ఆరోగ్యానికి మంచిదండీ బాబోయ్. అలాగే జంక్ ఫుడ్ .. జన్యు మార్పిడి పంటలు… ఇవన్నీ ఫలానా వ్యాధికి కారణం అని చెప్పలేము . రీసెర్చ్ జరుగుతోంది “.

ఇది నేటి స్థితి .

ఆహారమే దివ్య ఔషధం అని నమ్మిన గడ్డ ఇది .
ఇప్పుడు ఆహారమే విష తుల్యం .
దీనిపై ఫోకస్ ఉండదు .
ఉన్నా ఏదో కంటితుడుపుగా .

“ అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కుని తినానివ్వదు “ అని సామెత !
ఇలాంటి స్థితి లో ఎవరైనా “ఇదిగో ఇలాంటి ఆరోగ్య కరమయిన అలవాట్లు చేసుకోండి!” అని చెబితే ఎక్కడ తమ మార్కెట్ దెబ్బ తింటుందేమో అని వారి పై దాడి .

వాళ్లేమయినా డాక్టర్ లా? అని ప్రశ్నలు .
డాక్టర్ రోగాలకు చికిత్స అందిస్తాడు .
ఆహారం గురించి అధ్యనం చేసేది న్యూట్రిషనల్ సైన్స్ .

” నేడు మెడికల్ విద్య సిలబస్ లో ఆహారం గురించి , వ్యాధి నివారణ గురించి ఫోకస్ బాగా తగ్గిపోతోంది .. కేవలం టెస్ట్ లు ఎలా చేయించాలి? మందులు ఎలా ఇవ్వాలి? అనే దానిపైనే ఫోకస్” అని ఎంతో మంది సీనియర్ డాక్టర్ లు వ్యాసాలు రాస్తున్నారు .

అన్నం పెట్టేది అమ్మ .
అలవాట్లు నేర్పేది అమ్మ నాన్న ఇంటి పెద్దలు .
ఇది గతం .

ఇప్పుడు ఆహారానికి మార్కెటింగ్ . పిల్లాడి బ్రెయిన్ వాష్ చేసేలా కోక్ పెప్సీ పొటాటో చిప్స్ .. మార్కెటింగ్ . ఒక చేతిలో సెల్ ఫోన్ .. ఇంట్లో టీవీ ..కక్ష కట్టినట్లు అన్ని రకాల దురలవాట్లకు నేర్పిస్తున్న నూతన టెక్నాలజీ సాధనాలు .

దీని తోడు రోగాల మార్కెటింగ్ .

బతికే హక్కు ను హరిస్తున్నారు . అడిగేవాడు లేడు . ఎవరైనా అడిగితే వాడి క్యారెక్టర్ ను మటాష్ చేసే ప్రయత్నాలు .

అల్లోపతి అద్భుతమయిన సైన్స్ .
మానవ సంచిత విజ్ఞానం .

కాకపోతే ఇప్పుడు ఆ సైన్స్ ఫార్మసురుడి చేతిలో బందీ. వాడు చెప్పమనిందే చెబుతుంది . వద్దు అంది చెప్పదు.

చెయ్యాల్సింది ఫార్మసురుడి చేతినుంచి ఈ సైన్స్ ను విడిపించడం .

ప్రజలకోసం విజ్ఞానం .
మనుషుల కోసం మందులు .
అంతే కానీ మందుల కోసం ఆసుపత్రుల కోసం మనుషులు కాదు .

ఈ తేడా తెలియని వారు చాలా మంది .

డాక్టర్ ఆంటే దేవుడు . ప్రాణం పొసే వ్యక్తి

సమాజం మొత్తం బ్రష్టు పట్టి అవినీతి లో జలకాలాడుతుంటే కేవలం డాక్టర్ లు మాత్రం పవిత్రం గా ఉండాలంటే ఎలా ?

అన్ని వ్యవస్థల్లో వున్నట్టే ఇక్కడా విలన్ లున్నారు . వారి సంఖ్య పెరుగుతోంది .
ఇప్పటికీ ప్రజల కోసం వైద్యం అని నమ్మి సేవ చేస్తున్న ప్రజా డాక్టర్ లున్నారు . వారికి వందనం .
రెండో మూడో కోట్లు పెట్టి మెడికల్ విద్య నభ్యసించిన వ్యక్తి డాక్టర్ అయ్యాక కార్పొరేట్ ఆసుపత్రి మార్కెటింగ్ టీం లో భాగం కాకుండా ఎలా ఉంటాడు ?

ఎవరయినా ఒక డాక్టర్ నిజాయతీగా వ్యవహరిస్తే ఈ నాటి కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవస్థలో అతన్ని బతకనిస్తారా ?

హైదరాబాద్ లో ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో అయన గుండె శస్త్ర చికిస్థ నిపుణుడు . తన సమీప బంధువు కు గుండె ఆపరేషన్ . తన కోటా లో తనకు ఉచితం గా వచ్చిన స్టెంట్ వేసాడు . ఆసుపత్రి అడ్మిన్ కు “నా ఫీజు అలాగే స్టెంట్ ఫీజు మినహాయించామని ” చెప్పాడు.
బంధువులు ఫీజు కట్టి వెళ్ళిపోయి ఉంటే మోసం బయటపడేది కాదు . బిల్ ను డాక్టర్ కిచ్చారు . దాన్ని చూసి ఆయన షాక్ అయ్యాడు . స్టెంట్ డబ్బులు కూడా బిల్ లో కలిపేశారు . “ఇదేదో క్లరికల్ తప్పిదం కాదు . మోసం” అని నిర్ధారణకు వచ్చాడు .
అదండీ సంగతి .
తన ఆసుపత్రిలో పని చేస్తున్న సీనియర్ డాక్టరు నే మోసం చేసే విషపు వ్యవస్థలు .

“నేడు జరిగే స్టెంట్ ఆపరేషన్స్ లో సగం బోగస్” అని ఒక డాక్టర్ బహిరంగంగా వీడియో పెట్టాడు . అదీ నేటి పరిస్థితి .

“పాపం .. అమ్మాయిలు. పసి పిలల్లు .. ఈ వాక్ సీన్ వేసుకొని ఎనెన్ని సమస్యలకు గురవుతారో అని మధన పడి, లోతుగా అధ్యనం చేసి ఈ వాక్ సీన్ అక్కరలేదు అని సమాచారం అందిస్తే .. ఆ సమాచారం తప్పైతే ఆ మాట చెప్పాలి .. ఆలా కాకుండా అతని మాటలకు వక్ర భాష్యాలు తీసి మహిళా ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నాలు.

ఇది నేటి లోకం

ఫార్మాసురులకు వారి ఏజెంట్స్ కు హెచ్చరిక

ఇప్పటి దాక నేను జనాల్ని ఎడ్యుకేట్ చేయడం పైనే దృష్టి సారించాను . ఇది నా వృత్తి కాదు .
నేను ఆత్మ తృప్తి కోసం చేస్తున్న అనేక పనుల్లో ఇది ఒకటి .

మీరు నా పై దాడి .. క్యారెక్టర్ అసాసినేషన్ ప్రయతనాలు చేస్తే .. నేను నా స్కూల్ ని వదిలి దీన్నే ఫుల్ టైం పనిగా చేసుకొంటా .. రోగుల సంఘాన్ని స్థాపిస్తా . జరుగుతున్న మోసాలను ఒక్క్కొక్క దాన్ని వెలికి తీసి బహిరంగం చేస్తా . { కరోనా టైం లో కొన్ని ఆసుపత్రులు చేసిన మోసాలు .. రుజువులతో సహా వున్నాయి . అయినా ఎవరినీ… ఏ సంస్థను టార్గెట్ చెయ్యలేదు } .. న్యాయ పోరాటం చేస్తా . అంటే మీకు ఏకు మేకై కూర్చొంటా!

నన్ను అలా వదిలెయ్యండి.
సముద్రం లో నీటి బొట్టు నేను .
మీ మార్కెటింగ్ కు పడే పోయే వారిలో నా రాతల ద్వారా తగ్గిపొయ్యే వారి సంఖ్య ఎంత ? జస్ట్ ఇగ్నోర్ వాసిరెడ్డి అమర్నాథ్ .

మేధావులకు విజ్ఞప్తి . ప్రశ్నించే వారు ఉంటే సమాజానికి మంచా? చెడా? ఆలోచించండి . మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా? లేక ప్రపంచ ఫార్మసుర నియంతృత్వం లోనా ?

ఇక ఫేస్బుక్ పై నా పై పడి ఏడ్చే వారికి..
మీకు కూడా టైం లైన్ వుంది . మీరు రాసుకోండి . పావురాలు ఇంట్లో పదుల సంఖ్య లో వున్నా ఆరోగ్యానికి ఏమీ కాదు. నిజానికి వాటి వల్ల ఊపిరి తిత్తులు బలపడతాయి అని రాసుకోండి . మెట్ఫార్మిన్ వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అని రాసుకోండి. కరోనా వాక్ సీన్ వేసుకొంటే గుండె పదిలం అని … జిం చేస్తే చస్తారు అని .. మీ ఇష్టం .. మీ టైం లైన్ .

ఫేస్బుక్ మిత్రులకు ..
నేను పెట్టిన పోస్ట్స్ లో లోపాలుంటే ఆ విషయాన్ని కామెంట్స్ కాలమ్ లో పోస్ట్ చేయవచ్చు . అది న్యాయం .
కానీ వాడే భాష ముఖ్యం .

మీకు అందించే ప్రతి సమాచారం .. ఎంతో లోతయిన అధ్యయనం తరువాతే ..
నేను పెట్టిన పోస్ట్స్ లో లోపం ఉంటే సవరించుకొంటా . నో ఇగో .

బట్ట కాల్చి నెత్తిన వేస్తే .. జనాలు ఊరుకోరు ..

ఈ పోస్ట్ లో చివరి మాట . ఫేస్బుక్ పై మీకు కనిపించే అమర్నాథ్ పై నమ్మకం .. అభిమానం .. వాస్తవ జీవితం లో ఉన్నదానితో పోలిస్తే ఒక చిన్న భాగం మాత్రమే .

నా దగ్గర కోచింగ్ తీసుకొన్న విద్యార్థులు మొదలు .. సంస్థ ఉద్యోగులు .. స్కూల్ లో చదువు పూర్తి చేసుకొని వెళ్లిన విద్యార్థులు .. వారి తల్లితండ్రులు .. ఇప్పుడు చదువుతున్న వేలాది మంది పిల్లలు వారి తల్లితండ్రులు .. ఒక పెద్ద ప్రపంచం .

ఒక జీవిత కాల నిజాయతీ తో సాధించింది .
వెన్నెల్లో పడుకొని చంద్రుడి పైకి ఉమ్మే పిచ్చి ప్రయత్నాలు వద్దు.


(వ్యాసరచయిత ప్రముఖ విద్యావేత్త)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...