సమస్యలకు సత్వర పరిష్కారం
రిపబ్లిక్ దినోత్సవంలో చైర్మన్ పాండురంగారెడ్డి హామీ
అమీన్ పూర్, జనవరి 26 : శిల్ప కాలనీ సమస్యలను సత్వరం పరిష్కరిస్తానని అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి 25 లక్షల రూపాయలను కేటాయిస్తామని, ఇంటర్నల్ డ్రైనేజీ, మిషన్ భగీరథ పనులను నెల రోజుల వ్యవధిలో ప్రారంభిస్తామని తెలిపారు.
75 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శిల్ప కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేశారు. శిల్ప కాలనీ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అన్నింటిని అతి త్వరలో పరిష్కరిస్తానని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. పార్కు అభివృద్ధికి 25 లక్షలను బడ్జెట్లో చేర్చాలని ఆయన కమిషనర్ జ్యోతి రెడ్డిని ఆదేశించారు.
మునిసిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఇతర అధికారులు, వాణి నగర్ కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, మరో ఇద్దరు కౌన్సిలర్లు బి. కృష్ణ, కొల్లూరి యాదగిరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి చైర్మన్ చేతుల మీదుగా బహుమతులను అందించారు. కాలనీవాసులు చైర్మన్ పాండురంగారెడ్డి, కమిషనర్ జ్యోతిరెడ్డిలను సత్కరించారు.