బాలమిత్ర క్లాసుల గురించి మీకు తెలుసా..
తెలియదంటే ఇది చదవండి…
(అమర్నాథ్ వాసిరెడ్డి)
1760 నాటికి ప్రపంచ మానవ జనాభా… 100 కోట్లు మాత్రమే .
నలభై లక్షల సంవత్సరాల్లో వంద కోట్లయితే , కేవలం 250 సంవత్సరాల్లో టెక్నాలజీ పుణ్యమా అంటూ అది… పెరిగి… పెరిగి 820 కోట్లయ్యింది .
ఇన్నాళ్లు.. మనిషి టెక్నాలజీ ని వాడాడు .
ఇప్పుడు టెక్నాలజీ చాలామంది మనుషుల్ని వాడేస్తోంది.
అదే సమస్య !
కృతిమ మేధ యుగం వచ్చేసింది .
ఉద్యోగాలను… రోబో బూచాడు ఎత్తుకెళ్ళి పోతున్నాడు .

భవిషత్యులో రెండు రకాల వ్యక్తులకే ఉద్యోగాలు .
1 . రోబోల చేత పని చేయించేవారు .
2 . రోబో లు చేయలేని పని చేసేవారు .
నూటికి నలబై మందికే ఉద్యోగాలు .. వారే రోబో యుగ సుఖాలను అనుభవిస్తారు .
మిగతా వారు .. యూబీఐ బిచ్చగాళ్లుగా బతకాల్సిందే .
టెక్నాలజీ గొప్ప పనోడు .
టెక్నాలజీ ని మనం వాడాలి.
టెక్నాలజీ కి బానిసయితే అది నిన్ను వాడేస్తుంది .
టెక్నాలజీ కి బానిస అయినవాడు పనికిమాలినోడు.
టెక్నాలజీ బానిస విలుప్త జీవుల లిస్ట్ లోకి చేరబోతున్నాడు
నేడు మొబైల్ , యూట్యూబ్ , సోషల్ మీడియా , ఓటిటి, జంక్ ఫుడ్ బానిసలు కోట్లలో ….

హింస , బూతు , నీలి చిత్రాలు , మద్యం , గంజాయి , గుట్కా, లివ్ ఇన్ , బ్రేకప్ , అండర్ ఏజ్ ప్రేమలు, బట్టీ చదువుల మార్కులు , బిల్డ్ అప్ లు .. బడాయి , బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ , బుల్లియింగ్ , కోపం , అసహనం , ద్వేషం , అసహనం , మానసిక కుంగుబాటు , వ్యాకులత , ఒంటరి తనం , బిపి , షుగర్ , స్థూల కాయం , కాన్సర్ , ఆటో ఇమ్యూన్ డిసార్డర్ , గుండెపోట్లు , మెదడు పోట్లు, అనవసర వాక్ సీన్ లు , ఆటిజం, ఎడిహెచ్హడి , హైపర్ ఆక్టివిటీ , కృత్రిమ గర్భ ధారణలు…
కృతిమ మేధ యుగానికి తగ్గట్టు ప్రపంచ జనాభా తగ్గించే కార్యక్రమం లో వాలెంటీర్లుగా కోట్లాది మంది వినాశనం వైపు దూసుకెళుతున్నారు .
వీరు తాము సమస్యల సుడిగుండం లో చిక్కుకున్నాము అని కూడా గ్రహించలేరు .
అందరూ ఇదే దారిలో వున్నారు కదా అనుకొంటారు .
దీపపు పురుగులు కూడా ఇంతే .. మంట కనిపించగానే తమ తోటి పురుగులు వెళుతున్నాయి అని ఎగురుకొంటూ వెళ్లి మంటల్లో కాలిపోతాయి .
మరో ముప్పై ఏళ్లకు .. నేటి తరం టెక్నాలజి బానిసలు , ఇన్ఫోబెసిటీ గొర్రెలు ఉండరు .. వీరి వారసులు కూడా మిగలరు .
ఇది టెక్నాలజీ బానిసలు అంతరించి పోయే యుగం .
టెక్నాలజీ మంచి పనోడు .
దాన్ని ఉపయోగించుకోవడం తెలిసిన వారిదే భవిషత్తు .
టెక్నాలజీ నిన్ను వాడుకొంటోందా ?
అయితే నీ దారి.. నీ కుటుంబం దారి .. విలుప్తం వైపు .
కృత్రిమ మేధ యుగం ప్రారంభలోనే ఇలాంటి వారు అంతరించిపోతారు .
టెక్నాలజీని నీ పనోడుగా చేసుకొని కృత్రిమ మేధ యుగ ఛాంపియన్ గా నీ బిడ్డను నిలబెట్టాలా?
పిల్లలకు పట్టిన సెల్ ఫోన్ పిచ్చి… జంక్ ఫుడ్ వ్యసనాన్ని ఎలా తొలగించాలి ? బట్టీ చదువులు… కాలం చెల్లిన ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లు కాకుండా నవ “సి” { క్యూరియాసిటీ , కంటిన్యూయస్ లెర్నింగ్ , క్రియేటివిటీ , కంప్రెహెన్షన్, క్రిటికల్ థింకింగ్ , కొల్లబోరేషన్ స్కిల్స్ , కమ్యూనికేషన్ స్కిల్స్ , కంప్యూటేషనల్ థింకింగ్ , కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ} లక్షణాలు పిల్లల్లో ఎలా పాదుకొల్పాలి ?

వినాశనం వైపు ఎందరో ..
వికాసం వైపు ముందు చూపు ఉన్నవారే!
మీ దారేది ?
మానవ జాతి చరిత్రలో సంధి కాలం . నాలుగు రోడ్ల కూడలి .
సరైన దిశా నిర్దేశనం చేస్తే వికాసం వైపు వెళ్లి విజేతలుగా నిలిచే అవకాశం .
ఇంతటి అవకాశాన్ని ఉపయోగించుకొని నవ తరానికి మార్గదర్శకుడిగా చరిత్ర లోకి ఎక్కాలి అనే సమాజ హిత స్వార్థం తో వాసిరెడ్డి అమర్నాథ్ బాలమిత్ర అనే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు .
ఆరేళ్ళ పిలల్ల నుంచి .. తల్లితండ్రులు , టీచర్స్ , లెక్చరర్స్, ప్రొఫసర్స్ , ప్రొఫషనల్స్ కోసం బాలమిత్ర పేరిట ఉచిత అవగహన సదస్సులు నిర్వహిస్తున్నాడు .
ఇప్పటికి 27 పట్టణాల్లో ఈ యజ్ఞం విజయవంతం అయ్యింది .
12 వేల కుటుంబాలు లబ్ది పొంది , సరైన దారిలో పయనం మొదలెట్టాయి .
ఇప్పుడు కాళహస్తి , చంద్రగిరి , రాయచోటి , కడప, నాయుడు పేట నెల్లూరు లలో బాలమిత్ర క్లాసులు .
త్వరలో మరిన్ని చోట్ల .
ఇందులో మీరు కూడా భాగస్వామి కావాలి అనుకొంటున్నారా ?
అయితే మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ షేర్ చెయ్యండి .
కాల్ చేసి చెప్పండి .
మీ బంధువులు మిత్రులు బాలమిత్ర క్లాసులకు హాజరయ్యేలా చూడండి .
వాట్సాప్ లో.. యుట్యూబ్ లో చెత్త … చూసి చూసి జనాల్లో ఒక రకమయిన నిర్లిప్తత .. ప్రాధాన్యతలు గుర్తించలేని ఇన్ఫోబెసిటీ .
ఇలాంటి వారు .. బాలమిత్ర క్లాసు అంటే … ఏముందిలే అనుకోవడం సహజం.
మూడేళ్ళ క్రితం వాసిరెడ్డి అమర్నాథ్ కోవిషీల్డ్ వాక్సీన్ గురించి హెచ్చరిస్తే పట్టించుకొని వారు ఎందరో . కొంతమంది అప్పుడే స్వర్గస్తులు అయ్యారు . మిగతా వారు బతికి ఉన్నందుకు ఆసుపత్రులకు కప్పం చెల్లిస్తూ మందులు మింగుతూ ..
ఇది అంత కంటే లక్ష రెట్లు ముఖ్యం .
ఉచితంగా వచ్చిందని పట్టించుకోకపోతే నష్టం ఎవరికి? .
రేపటి రోబో యుగంలో తమ బిడ్డలను గ్లోబల్ ఛాంపియన్స్ గా చూడాలి అనుకొనే వారందరికీ ఆహ్వానం !
బాలమిత్ర క్లాసుల వివరాల కోసం
+91 7729-839777
+91 7729-840777
+91 7729-834777
+91 91774 44182.

(వ్యాస రచయిత స్లేట్ స్కూల్స్ అధినేత)