లేబర్ పార్టీకి పట్టం
బ్రిటన్లో ఎన్నికల్లో ప్రజా తీర్పు
(వాడవల్లి శ్రీధర్)
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. గతంతో పోలిస్తే.. ఈ సారి బ్రిటన్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై భారతీయులు కూడా అమితాసక్తి కనబరిచారు. అందుకు కారణం. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానిగా ఉన్న ఋషి సౌనక్ భారత మూలాలున్న వ్యక్తి. ఈ ఎన్నికల్లో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో.. యూకే ప్రజలు.. ప్రతిపక్ష లేబర్ పార్టీకి పట్టం కట్టారు.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 2024
కన్జర్వేటివ్ : 120
లేబర్ పార్టీ : 412
లిబ్ డెమ్ : 71
ఇతరులు : 44
647 / 650 సీట్లు
ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది.
ఓటమికి బాధ్యత తనదేనన్న సౌనక్
ప్రజల తీర్పును గౌరవిస్తామని ఋషి ప్రకటించారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు తన మద్దతుదారులను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.‘‘ఈ రోజు ఎంతో శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్దంగా అన్ని వైపులా సద్భావనతో అధికార మార్పిడి జరుగుతుంది… అది మన దేశ స్థిరత్వం.. భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం కలిగించే విషయం. ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ ఓటమి నన్ను కుంగదీసింది. ఇందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని తెలియజేస్తున్నాను’’ అన్నారు. ఇకపై లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మేర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మార్పు ఇక్కడే మొదలువుతుంది
ఫలితాలపై కైర్ స్టార్మేర్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు.. మార్పు ఇక్కడే మొదలువుతుంది’’ అని అన్నారు. బ్రెగ్జిట్, దశాబ్దకాలంగా కొనసాగుతోన్న జీవన వ్యయ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు.
ప్రజలు మార్పు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఋషి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎన్నికలకు ముందు కొంత కాలం నుంచి ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. అది కాస్త ఫలితాలపై ప్రభావం చూపింది. సంప్రదాయవాదులు స్వయంగా సృష్టించిన సమస్యలు దీనికి తోడయ్యాయి. మార్గరెట్ థాచర్, జాన్ మేజర్ మరియు టోనీ బ్లెయిర్ అనే ముగ్గురు ప్రధాన మంత్రులను మాత్రమే చూసిన మునుపటి 28 సంవత్సరాలతో ఈ వేగవంతమైన టర్నోవర్ చాలా భిన్నంగా ఉంది. బ్రెగ్జిట్ పై బ్రిటన్‌లో రెఫరెండం జరిగింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా లేదా విడిపోవాలా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కాకుండా 27 దేశాల ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఆర్థిక సహకారం లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ ఏర్పాటైంది. కలిసి వ్యాపారం చేసే దేశాలు ఒకదానిపై ఇంకొకటి యుద్ధానికి దిగకూడదు అనేదే దీని వెనుక ఆలోచన. ఈ సంఘంలోని దేశాల్లోకి సరకుల రవాణాతో పాటు మనుషులు కూడా ఏ అడ్డంకులూ లేకుండా ఒకే దేశంలా ప్రయాణిస్తారు. బ్రెగ్జిట్ ప్రక్రియ 2019లో మొదలై 2020 డిసెంబర్ దాకా కొనసాగింది. పార్టీలో కన్జర్వేటివ్‌లకు మద్దతు గణనీయంగా తగ్గింది. బ్రెగ్జిట్ తర్వాత డేవిడ్ కామెరూన్ రాజీనామా చేసినప్పటి నుండి, UKలో ప్రధానమంత్రి పదవి అనేకసార్లు చేతులు మారింది, థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, ఋషి కేవలం 45 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేసిన లిజ్ ట్రస్ పార్టీకి గణనీయమైన నష్టాన్ని కలిగించారని, రిషి సునక్ దానిని సరిచేయడానికి పెద్దగా చేయలేదని రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ప్రజలు ఆయనపై వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు. కేవలం 28 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఋషి ప్రజాదరణ కోల్పోవడానికి చాలా అంశాలు కారణమై ఉండొచ్చు. ఆయనతో పాటు అక్షతా మూర్తి సంపదపై అందరి దృష్టి నిలిచింది.
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)