(డా విడి రాజగోపాల్, 9505690690)
ఎన్ని కవితలు రాసినా
అవి పగటి పూట చుక్కల్లా కనబడవు
కానీ సినిమా సాహిత్యం
రాత్రి వేళల్లో చుక్కల్లా మెరుస్తాయి
ఆ రోజుల్లో అందరికి వినోదం సినిమా
సినిమా పాటలు అందరి మదిలో పదిలం
సినీ రచయితల్లో శ్రీ శ్రీ అంటే క్రేజ్
అటు విప్లవ గీతాలు
జావళీలు, వీణ పాటలు, యువళగీతాలు,
అన్నీ అద్భుతంగా రాశారు,
అలనాటి ఆణిముత్యాల
జ్ఞాపకాల పుటల్లో కాసేపు విహరిద్దాం
ఆకాశవీధిలో అందాలజాబిలిని చూపించారు
పాడవోయి భారతీయుడా అంటూ కర్తవ్యాన్ని యువతకు గుర్తు చేస్తాడు
స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడకు…
అవినీతి లంచగొండితనాన్ని రూపు మాపమని సమాజాన్ని హెచ్చరిస్తాడు
జయంబు నిశ్చయంబురా అంటూ ..
ఓ రిక్షావాలా చేత గాఢాంధకారం అలముకున్నదని భీతిచెందక ముందుకు సాగమని కష్టాలకు క్రుంగకంటూ పేదలను ప్రోత్సహిస్తారు
తెలుగు వీర లేవరా అంటు దేశభక్తి నరనరాలు ఎక్కేలా చేస్తాడు
కలసి పాడుదాం తెలుగు పాట..కలసి సాగుదాం వెలుగు బాట …
అంటూ తెలుగు భాషపై చక్కని గీతం
దేవుడు చేసిన మనుషుల్లారా….మనుషులు చేసిన దేవుళ్ళారా…అంటూ దేవుని పేరుతో మోసాలపై ఎలుగెత్తుతాడు…
నినుచేర మనసాయరా అంటూ ఓ జావళీ
నా హృదయంలో నిదురించే చెలి అంటూ..
జోరుగా హుషారుగా షికారు పోదమా అంటూ….
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన ఆదే భాగ్యము…..
అంటూ చక్కని యగళగీతాలు
కలకానిదీ విలువైనది బ్రతుకూ కన్నీటి ధారలలోనా బలిచేయకు….అంటూ నిరాశావాదులను హెచ్చరిస్తాడు….
ఇలా ఎన్నో ఆణిముత్యాలు
సినీజగత్తకు అందించిన ఘనాపాటి
శ్రీరంగం శ్రీనివాసరావు గారు
“శ్రీశ్రీ పుట్టుకతో మనిషి,
వృద్దాప్యంలో మహర్షి,
మధ్యలో మాత్రమే కవి,
ఎప్పటికీ ప్రవక్త”
అంటారు వేటూరి గారు ఒక సందర్భంలో
ఇది వీరి మహాప్రస్థానం
శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఓ మారు స్మరించుకొంటూ…
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)