ఎమ్.బీ. శ్రీనివాసన్ పాట

0
238

“నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే…”
(రోచిష్మాన్, 9444012279)

1964లో వచ్చిన వివాహబంధం సినిమాలోని పాట “నీటిలోనా… నింగిలోనా నీవే ఉన్నావులే…”

ఎమ్.బీ. శ్రీనివాసన్ చిత్తూరులో తమిళ్ష్ కుటుంబంలో పుట్టారు.
1960లో తమిళ్ష్‌లో వచ్చిన పాదై తెరియుదు పార్ సినిమాతో సంగీత దర్శకుడయ్యారు.

కమ్యునిస్ట్ ఉద్యమకారులై ఉండీ కూడా సౌష్టమైన సంగీతాన్ని , విద్వత్ సంగీతాన్ని, మధురమైన సంగీతాన్ని, మేలైన సంగీతాన్ని, ప్రతిభావంతమైన సంగీతాన్ని
సృజించి సమర్పించిన మన దేశ సంగీత దర్శకుల్లో ఒకరు సలిల్ చౌధరీ మరొకరు ఎమ్.బీ. శ్రీనివాసన్. కమ్యునిస్ట్ ఉద్యమకారుల్లో సరైన సంగీత స్పృహ, musical aesthetic sense ఉన్నవాళ్లు కూడా ఈ ఇద్దరేనేమో?

తమిళ్ష్ (10), మలయాళం (40) తెలుగు (2 ,3) సినిమాల్లో విశేషమైన పాటలు చేశారు ఎమ్. బీ. శ్రీనివాసన్. 1960ల కాలానికి దక్షిణాదిలో ఎమ్. బీ. శ్రీనివాసన్ పాటలు ప్రత్యేకమైన tone, texture, feelతో రూపొందాయి. 60వ దశాబ్ది దక్షిణాది పాటల పోకడకు, పరిధికి, అభిరుచికి అతీతంగా గొప్ప పాటలు చేశారు ఎమ్. బీ. శ్రీనివాసన్.

సినిమాల్లోనే కాదు ఆకాశవాణి కోసం తెలుగు, తమిళ్ష్, కన్నడం భాషల్లో గొప్ప బృంద (choral group)గానాలు చేశారు. వాటిల్లో దాశరథి రాసిన “పిల్లల్లారా, పాపల్లారా…” అన్న బృందగానం చాల ప్రశస్తమైంది.

ఎమ్. బీ. శ్రీనివాసన్ చేసిన పలు ప్రత్యేకమైన పాటల్లో “నీటిలోనా… నింగిలోనా నీవే ఉన్నావులే…” పాట ఒకటి. 1964 నాటి తెలుగు సినిమా పాట తీరుకు అతీతంగా వచ్చిన పాట ఇది. పెండ్యాల, చలపతి రావు, వేణు, ఘంటసాల వంటి వాళ్ల తెలుగు మూసకు భిన్నమైన flavorతో, ప్రజ్ఞతో వచ్చిన పాట ఇది.

భరణి పిక్చర్స్ నిర్మాణం వివాహబంధం సినిమా. భానుమతి ఎమ్.బీ. శ్రీనివాసన్‌ను సంగీత దర్శకుడుగా తీసుకోవడం ఆశ్చర్యకరమైనదే. ఎన్. టీ. రామారావు చాల గొప్పగా, అంతర్జాతీయ స్థాయిలో నటించారు ఈ సినిమాలో. ఎన్.టీ.ఆర్. అత్యున్నతంగా అభినయించిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

“నీటిలోనా… నింగిలోనా నీవే ఉన్నావులే…” పాటను major scaleలో (శంకరాభరణం అందామా?) చేశారు. Western flavor preludeతో పాట చాల ఉదాత్తంగా మొదలౌతుంది. చాల గొప్ప బాణి, బాణి progression, reliefs, bridge passages, western flavor interludes,
back up strings వీటితో పాట నిర్మాణం ప్రజ్ఞతోనూ, మనోజ్ఞంగానూ ఉంటుంది. పాట ప్రారంభం, ముగింపుల్లోని సంగీతం విశేషంగా ఉంటుంది.

భార్యా, భర్తలు పడవపై సాగుతూ హాయిగా పాడుకునే వలపు పాట ఇది. భానుమతి, పీ.బీ. శ్రీనివాస్ పాడారు. భానుమతి ఆమె సహజధోరణికి భిన్నంగా ‘అదుపు’తో పాడారు. భానుమతి ఆమెలా కాకుండా ఒక గాయనిలా పాడారు.

ఈ పాటలో పీ.బీ. శ్రీనివాస్ గాత్రాన్నీ, గానాన్నీ విన్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ “పురుష గాత్రం అంటే ఇదే; గాత్రమూ, గానమూ నాభి లోంచి వస్తున్నాయి” అని అన్నారు. ‘విశ్వనాథ వారి శాస్త్ర జ్ఞానం, వివేకం, విద్వత్, ఆలోచనా సరళి అత్యంత ఉన్నతమైనవి’. ఆ విశ్వనాథ వారు ఈ మాటలనడం విశేషం. వారి మాటలు మనకు తెలివిడిని, విద్యను ఇచ్చేవి.

దక్షిణాది సినిమాలో నమోదైన తొలి సహజమైన పురుష గాత్రం (Rounded even warm baritone with ring and verve) పీ. బీ. శ్రీనివాస్ గాత్రం. ఏది ‘పురుష గాత్రం’ అన్న తెలివిడి దక్షిణాదిలో ఇంకా సరిగ్గా రాలేదు.

పెండ్యాల “ఘంటసాల గాత్రం పురుష గాత్రం” అని అనుంటే అది పూర్తిగా అశాస్త్రీయం; తప్పు. ఆ మాటలను నమ్మెవాళ్లు విశ్వనాథ వారు ఇచ్చిన ఎరుకతో తమను తాము సరిచేసుకోవాలి.

ఘంటసాల గాత్రం metalic timbre. Metalic timbre సహజమైన గాత్రం అవదు అన్నది చదువు; తెలివిడి. ఘంటసాల గాత్రం baritone కాదు అది tenor. ఘంటసాల గాత్రం rounded even warm voice కాదు. శాస్త్రీయంగానూ, తెలివిడి పరంగానూ ఘంటసాల గాత్రం పురుష గాత్రం అవదు. విశ్వనాథ వారు తన విద్వత్‌తో చెప్పినది మనకు విద్య అవాలి. ఎవరి అభిరుచులు, అభిమానాలు, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు వారివే. కానీ ‘తెలివిడి’ సార్వత్రికం; నిజం.

1950ల Jim Reeves, Pat Boone, Nat king Cole వంటి గాయకుల గాత్రాలు మొదలుగా ఇప్పటి Ed Sheeran, Justin Bieber వంటి అంతర్జాతీయ గాయకుల గాత్రాలు పురుష గాత్రాలుగా మనం తెలుసుకోవచ్చు. మన తెలుగువారైన పీ. బీ. శ్రీనివాస్ తన గాత్రంతో, గానంతో ఆ కోవలోని వారు. ఆ విషయాన్ని ఈ పాట సరిగ్గా తెలియజేస్తోంది.

Rounded even warm baritone with ringతోనూ, modulation excellenceతోనూ, profound mood and subtle singingగానూ, balanceతోనూ ఈ పాటను పాడారు పీ.బీ. శ్రీనివాస్.

అన్ని రకాలుగానూ తెలుగులో వచ్చిన ఒక శ్రేష్ఠమైన పాట ఇది.

వినండి…

https://youtu.be/j3w36MREybw?si=LPMTtAw5Z-mBsBBU

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here