(ప్రేమచంద్)
నరేంద్ర చౌదరి బ్యాంకాక్ పారిపోయారనే ప్రచారంలో నిజమెంత? అని చూస్తే ఆయన నిక్షేపంగా తన ఆఫీసులోనే ఉన్నట్టు సమాచారముంది.ఈ పండగ సందర్భంగా కొందరు వెళ్లి కలసి ఆయన్ను విష్ చేసి రావడం మాత్రమే కాకుండా ఫోటోలు దిగి వచ్చారు కూడా.
నిజానికి చౌదరి స్వభావం ఎలాంటిదని చూస్తే అవి మేము పని చేస్తున్న 2014- 19 రోజులు. ఆ రోజుల్లో నోటుకు ఓటు వ్యవహారంలో చానెల్ ని ఏపీలో బ్యాన్ చేశారు. ఈ సమయంలో ఆయన ఆదాయాలు భారీగా పడిపోయాయి. అయినా కూడా జీతాలు తగ్గిద్దామన్న ప్రస్తావన వచ్చినపుడు.. ఆయన నా ఆస్తులైనా అమ్ముతాను కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయిస్ కి ఇబ్బంది కలిగేలా చేయనని అన్నారట చౌదరి.
ఇక జీతం విషయంలో నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ని ntv లో ముప్పయ్యవ తేదీ నియమం ఎంత నికార్సుగా అమలవుతుందంటే.. ఆయన ఏ దేశ విదేశాల్లో ఉన్నా కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు ఆగడానికి వీల్లేదు. అలా జరిగినపుడు హెచ్ ఆర్ కి పనిష్మెంట్ పడాల్సిందే.
ఇక ఉద్యోగాలు తీయడం అనే విషయంలోనూ చాలా చాలా కూలంకుషమైన చర్చ చేస్తారు. ఆయనకు ఇష్టం లేని వారిని కూడా ఆయన నియమించుకోవల్సి వస్తే నియమిస్తారు. అంతటి ప్రజాస్వామిక విలువలు పాటిస్తారు.
అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న చానెల్ వ్యవస్త ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో రాయాల్సిన పేరు నరేంద్ర చౌదరి సారధ్యంలో నడుస్తున్న- ఎన్టీవీ. ఆయన స్వతహాగా జర్నలిస్టు కాక పోయినా.. ఏవీ స్వయం నిర్ణయాలు తీసుకోరు. నలుగురు జర్నలిస్టు పెద్ద మనుషులను పెట్టుకుని.. వారి అభిప్రాయ సేకరణ చేశాక మాత్రమే డెసిషన్ మేకింగ్ చేస్తుంటారు. అందుకే ఆయన ఇటు న్యూస్ చానెల్ నడపడం మాత్రమే కాకుండా, అటు మహిళల కోసం వనిత, భక్తి పేరిట ఆధ్యాత్మిక రంగంలోనూ తనదైన సేవలందిస్తున్నారు. ప్రస్తుతం భక్తి టీవీ దేశంలోనే అగ్రగామిగా ఉందంటే ఇదంతా ఆయన కృషి, పట్టుదల మాత్రమే.
నరేంద్ర చౌదరి ముందు ఏదైనా పని విషయంలో రెండో మాట సమాధానంగా రావడానికి వీల్లేదు. అంతగా ఆయన పట్టుదలతో వ్యవహరిస్తారు. ఇక ఇదంతా ఆయనకు తెలిసే జరిగిందా? అని చూస్తే వందకు వంద శాతం అలాంటి అవకాశమే లేదు. కారణం ఆయన అంతగా జర్నలిస్టులకు స్వేచ్ఛనిస్తారు. ఈ విషయంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఆయన మన చానెల్లో ఏదైనా సరే మొదట రావాలని అంటారు తప్పించి.. అందులో పెద్దగా ఎంపికలు ఏవీ ఉండవు. మీరంతా జర్నలిస్టులు కదా? నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలుస్తుందని అంటారే తప్ప.. ఆయనేమీ ఆంక్షలు విధించరు. ఇక్కడ గమనించాల్సిన మరో లాజిక్ ఏంటంటే.. ఏ యజమాని అయినా సరే మంత్రిగారి మీద ఒక నెగిటివ్ స్టోరీ వేస్తున్నామంటే చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఖండిస్తారు. నరేంద్ర చౌదరికి ఈ విషయంలో తగిన సమాచారం లేక పోవడం వల్ల.. ఈ వార్త వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక నరేంద్ర చౌదరికి ఇలాంటి వార్తలు వేయడం వల్ల లాభం లేక పోగా అధిక మొత్తంలో నష్టం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ టీడీపీ ప్రభుత్వం చౌదరిగారి మీద పీకలోతు ఆగ్రహం పెంచుకున్నట్టు కనిపిస్తోంది. అయినా సరే వార్తల ప్రవాహాన్ని ఆయనేమీ ఆపుతున్నట్టు కనిపించదు. ఆయా వార్తల గొంతు నేనెందుకు నొక్కాలి? అని అంటారు తప్పించి.. వాటిని ట్యాంపర్ చేయడాలనుకోవడం ఆయనకు ఇష్టం లేని పని.
తొలి రోజుల నుంచీ అంతే.. ఇది మీడియా. ఇందులో పూలకన్నా రాళ్లే ఎక్కువ పడతాయ్. కాబట్టి ఆ రాళ్ల దెబ్బలకు నేను సదా సిద్ధం అన్నది ఆయన మాట. ఈ విషయంలో ఎన్నో సాక్ష్యాలు మనకు కనిపిస్తుంటాయి.
ఇక్కడ మనమంతా గుర్తించాల్సిన విషయమేంటంటే ఒక పార్టీకి ప్రో, మరో పార్టీకి యాంటీ అన్నది కూడా మీడియా వ్యవస్థలో నడవదు. తెలీసీ తెలీక.. కొన్ని కొన్ని వార్తలు విధిగా ఇచ్చి తీరాల్సిందే. అలా ఇచ్చినపుడు ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ చానెల్ ని ఆడిపోసుకుంటారు. ఈ చానెల్ మనకు వ్యతిరేకంగా రాస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఈ విషయంలో యాజమాన్యాల తప్పు పెద్దగా ఉండదు. కారణం వారికసలు ఆ వార్తలు వచ్చాయని గానీ, వేశారని గానీ తెలీదు. ఎవరో ఒకరు కంప్లయింట్ చేస్తే తప్ప.. ఈ విషయం వారి వరకూ రాదు.
మీడియా వ్యవస్థ అన్నది అంతటి కఠినతరమైనది. కాబట్టి మీడియాను ఈ పార్టీకి అనుకూలం, ఆ పార్టీకి వ్యతిరేకం అంటూ నడపటం కూడా ఏమంత సాధ్యం కాదు. అందునా నరేంద్ర చౌదరి లాంటి వారి విషయంలో అస్సలు సాధ్యం కాదు. ఆయన మనస్తత్వం అలాంటిది.
ఆయనకు అలాగని వార్తలన్నా, రాజకీయాలన్నా ఆసక్తి లేకేం కాదు. రాత్రి పదకొండు గంటల బులిటెన్ సైతం వదిలి పెట్టకుండా చూస్తుంటారనే పేరుంది. అలాగని ఏ వార్తనూ ఎంపిక చేసి మరీ వేయడం ఆయన వ్యవహార శైలి కాదు.
మేము పని చేస్తున్న రోజుల్లో ఆయన ఒక కుక్క స్టోరీ విషయంలో ఆ వార్త తీసెయ్యండని ఆయన అంటే ఆ తర్వాతి రోజుల్లో డెస్క్ సిబ్బంది కుక్క స్టోరీలే వేసేవారు కారు. ఆ తర్వాతి రోజుల్లో ఆయనే ఈ విషయం పసిగట్టి.. మేడ మీద నుంచి కుక్కను వదులుతుంటే నేను భరించలేక ఆ వార్త వద్దన్నాను. అలాగని నాకు కుక్కలంటే ఇష్టమే లేదన్నట్టు మీరు ఇలా ఆ వార్తలే వేయక పోవడమేంటని నిలదీశారు. ఆయన విషయంలో ఇతరులు ఎలాంటి అపార్ధాలు చేసుకుంటారో చెప్పడానికిదో నిదర్శనం.
తనకు ఇష్టం ఉన్నా లేకున్నా.. ఆయన వార్తల ప్రవాహాన్ని అడ్డుకునే సాహసం చేయనుగాక చేయరు. ఒక వేళ తనకలాంటిది ఏదైనా అనిపిస్తే తన చుట్టూ ఉన్న జర్నలిస్టు నిపుణుల అభిప్రాయం తీస్కున్నాకే ఏ నిర్ణయమైనా ప్రకటిస్తుంటారు.
ఎవరైనా సిబ్బందిని తీసేయ్యాలని ఆయన ముందుకు ప్రతిపాదన వచ్చినా.. వారిలో ఏదో ఒక టాలెంట్ ఉండబట్టే కదా తీస్కున్నారు. ఆ విభాగంలో కాకుంటే మరో చోట వారిని బదిలీ చేసి పని చేయించమనే అంటారు తప్ప వెంటనే తీసేయమనే మాట ఆయన నోటి వెంట వినిపించదు.
ఇలా చెప్పుకుంటూ పోతే, నరేంద్ర చౌదరి గురించి ఇలాంటి ఎన్నోసోదాహరణగా వివరించవచ్చు. చాలా మంది సోషల్ మీడియాలో ఆయన గురించి తీవ్ర వ్యతిరేకంగా రాస్తూ ఉండటం చూసి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు ఆయన గురించి ప్రస్తావిస్తున్నా. అలాగని ఆయన నేను కష్టకాలంలో ఉన్నపుడు పిలిచి ఉద్యోగం ఇచ్చింది కూడా లేదు. ఇందాకే చెప్పాగా ఆయన దాకా చాలా విషయాలు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతుంటాయని. అలాగని నాకు ఆయన మీద, ఆయన వ్యవస్థ మీద ఎలాంటి వ్యతిరేకతా లేదు. కాబట్టి గమనించాల్సిందిగా మనవి.

