రాఘవరావు వెలికితీసిన రాజానగరం చరిత్ర
రాజమండ్రి, మార్చి 24: ‘రాజానగరం @ 320’ పుస్తకాన్ని రాజానగరం పూర్వపు సమితి ఉపాధ్యక్షులు ఉల్లి వెంకటరత్నం (బాబూరావు) ఈ నెల 20న ఆవిష్కరించారు. రాజానగరం 320ఏళ్ళ చరిత్రకు సంబంధించి కొన్ని అంశాలు, వివిధ రంగాల ప్రముఖులను ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ భమిడిపల్లి వీర రాఘవరావు ఈ పుస్తకాన్ని రచించారు. రాజానగరం మండలం తూర్పు గొనగూడెం పరిధిలోని శ్రీరామనగర్లోని ఉల్లి బాబూరావు ఇంటివద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి చిలకమర్తి ఫౌండేషన్ కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాధ్ అధ్యక్షత వహించారు. భమిడిపాటి నాగేశ్వర శర్మ, ఆదిన సత్యనారాయణ మూర్తి, కాకి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, కంకటాల ముత్తయ్య (రాజు) మోది సత్తిబాబు తదితరులు పుస్తకం ప్రచురణను అభినందించారు. అంకం సాయి, భమిడిపల్లి కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకం ఆవిష్కరించిన బాబూరావునూ, రచయిత రాఘవరావునూ చిలకమర్తి ఫౌండేషన్ తరపున శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ సత్కరించారు.
‘రాజానగరం @ 320’ పుస్తకావిష్కరణ
Date: