భారత్ కు 98 పరుగుల ఆధిక్యం
కేప్ టౌన్, జనవరి 3 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో అద్భుతం చోటుచేసుకుంది. అది భారత్ పాలిట్ అశనిపాతంగా మారింది. ఐదుగురు బాట్స్మెన్ సున్నాకే అవుట్. ఫలితం ఒకే స్కోరు దగ్గర ఆరు వికెట్ల పతనం. భారత్ బ్యాటింగ్ తీరు ఇది. శ్రేయాస్ అయ్యర్ నుంచి రవీంద్ర జడేజా, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ సున్నా పరుగులకే ఔటయ్యారు. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టు మొదటి రోజున 47 ఓవర్లలో ఇరవై వికెట్లు పతనమయ్యాయి.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదుగురు సున్నా స్కోరుకు ఔటవ్వడం ఇదే ప్రధమం. కెప్టెన్ రోహిత్ శర్మ 39 , గిల్ 36 , కోహ్లీ 46 పరుగులు చేయడంతో భారత్ కు 98 పరుగుల ఆధిక్యం లభించింది. రబడా, ఎంగిడి, బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.