ఆరు వికెట్లతో సౌత్ ఆఫ్రికాకు చుక్కలు
55 పరుగులకు ఆల్ అవుట్
కొత్త సంవత్సరంలో భారత్ రికార్డు
కేప్ టౌన్, జనవరి 3 : 2 , 4 , 2 , 3 , 12 , 15 , 0 , 3 , 5 , 4 … ఈ సంఖ్యలు ఏమిటి అనుకుంటున్నారా… దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ చేసిన స్కోర్లు. దక్షిణ ఆఫ్రికాతో బుధవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన ప్రతిభను కనబరిచారు. స్వింగ్ బౌలింగ్ తో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ ను క్రీజులో ఐదు నిముషాలు కూడా కుదురుకోనీయలేదు. వరసగా వారిని పవెలియనుకు పంపారు. డ్రింక్స్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి పదహారు పరుగులు చేసింది. లంచ్ సమయానికి చేసింది. సౌత్ ఆఫ్రికా 2015 లో ఇండియాపై తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. నాగపూర్ టెస్టులో 79 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. మొత్తం మీద అతి తక్కువ స్కోరు 30 . రెండు సార్లు ఇంగ్లాండ్ మీద ఈ స్కోరుకు ఆలవుటయింది. మొదటి సారి 1896 ఫిబ్రవరి 13 న, రెండో సారి 1924 జూన్ 24 న ఈ అత్యల్ప స్కోరును దక్షిణ ఆఫ్రికా నమోదు చేసింది. ఇండియా పై 2006 డిసెంబర్ 15 న 84 పరుగులకు, మూడోసారి 1996 నవంబర్ 20 న 105 పరుగులు చేసింది. ఆ తరవాత బుధవారం నాడు కేప్ టౌన్ లో పరుగులు నమోదు చేసింది.
బుధవారం నాటి మ్యాచ్ లో సిరాజ్ ఆరు వికెట్లు, బుమ్రా, ముఖేష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
మార్క్ రామ్ రెండు పరుగులు, ఎల్గార్ నాలుగు, జోరీ రెండు, స్టబ్స్ మూడు, బెండింగ్ హమ్ పన్నెండు, వెరైన్ పదిహేను, జాన్సన్ పదిహేను, కేశవ్ మహారాజ్ మూడు, బర్గర్ నాలుగు, రబడా ఐదు పరుగులకు అవుటయ్యారు. 23 .2 ఓవర్లకే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.