భారత్ – ఆసీస్ మధ్యే ఫైనల్ పోరు
ఉత్కంఠగా సాగిన రెండో సెమి ఫైనల్
కోల్కతా, నవంబర్ 16 : ఆసక్తిగా సాగిన రెండో సెమి ఫైనల్లో విజయం కోసం ఆసీస్ జట్టు, నానా అగచాట్లు పడింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా 49 . 4 ఓవర్లలో 212 పరుగులకు అలావుటయ్యింది. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సౌత్ ఆఫ్రికాను మిల్లర్ ఆదుకున్నాడు. 101 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరును జట్టు అందుకోగలిగింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు ఆరంభంలో ధాటిగా ఆడినప్పటికే.. సౌత్ ఆఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి, ఆసీస్ జట్టును కంగారు పెట్టారు. లక్ష్యం చిన్నది కావడంతో బాట్స్మన్ నెమ్మదిగా ఆడుతూ, విజయానికి చేరువ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగుతో సౌత్ ఆఫ్రికన్ బౌలర్లు ఆసీస్ ను కట్టడి చేశారు. నలభై ఓవర్లో ఇంగ్లిస్ ను కోటీజీ బౌల్డ్ చేయడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. మరుసటి బంతికే కమిన్స్ LBW తప్పించుకున్నాడు. అప్పటికి స్కోర్ 193 . 44 వ ఓవర్లో కమిన్స్ క్యాచ్ ను వికెట్ కీపర్ వదిలేసాడు. అదృష్టం ఆస్ట్రేలియా వైపు నిలిచి సౌత్ ఆఫ్రికాను వెక్కిరించింది. కమిన్స్, స్టాక్ మెల్లిగా ఆసీస్ జట్టును విజయం వైపు నడిపించారు.
ఈడెన్ లో ఆసీస్ ను కంగారెత్తించిన సౌత్ ఆఫ్రికా
Date: