హైదరాబాద్, జులై 29 :+ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం శనివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను కలిశారు. హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.
శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కుటుంబ సమేతంగా బ్రహ్మానందం కలిశారు. వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.