జీవన అనుభవాల కథా సంకలనం

Date:

“మనసున ఉన్నది “

రచయిత శ్రీపాద శ్రీనివాస్ తన కథల్నీ,
కథానికల్నీ “ మనసున ఉన్నది ” పేరుతో ఇటీవల ఓ సంకలనంగా వెలువరించారు. ఇందులో ఏడు కథానికలు, కథలు,
ఓ మూడు తీపి జ్ఞాపకాల సంగతులు ఉన్నాయి ‌.
కథానిక లు చాలా వరకు శ్రీ పాద శ్రీనివాస్
సొంత గొంతుతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైనాయి.

తొలి కథానిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో
తన స్వీయ అనుభవాన్ని ఉటంకించారు. అప్పుడే కొత్తగా ఈ రైలు పట్టాలెక్కినపుడు
తను అందులో ప్రయాణానికి సమాయత్తమైనపుడు,
ఆశ్చర్యంతో రైలు ను
చూస్తున్న వారి ఉత్కంఠతను స్వగతంగా చెప్పినప్పుడు
ఇవి అందరి అనుభవాలనిపిస్తుంది.
ఆ రైలులో తన తొలి ప్రయాణంలో అటెండెంట్ వాటర్ బాటిల్, స్నాక్స్ తెచ్చి ఇచ్చినప్పుడు వాటికి బిల్లు ఎంత వేస్తారో అని సందేహించిన సంఘటన చమత్కార పూరితంగా సరదాగా నవ్విస్తుంది. ఒక మధ్య తరగతి మనిషి తాలూకు లో బడ్జెట్ వెతలను ఈ కథానిక
అలవోకగా బయట పెడుతుంది.

అలాగే అమ్మ పుట్టింటి చీర కొంగు జార విడిచిన ఆత్మీయ జ్ఞాపకాలను అమ్మ బీరువా కథానిక వెలువరించింది. దీనిలోని కవితా ధోరణి స్వగతం ( ఫస్ట్ పర్సన్) రూపంలో ఉండడం వల్ల అక్షరాల్లో స్వీయ భావోద్వేగం కనిపిస్తుంది.
“ అమ్మ ఒడి ”కథానిక సైతం అమ్మ
జ్ఞాపకాలను విశదీకరిస్తుంది.
ఇక అమ్మ లేదు అనే వాస్తవంలో ఆ పాత్ర
ఆసాంతం కరిగి పోయిన తీరు మనసును అర్థ్రం చేస్తుంది. అమ్మ ఎవరికైనా అమ్మే అనిపిస్తుంది.ఇక
వాస్తవికతకు దర్పణాలు వాట్సాప్ గ్రూపులు, ప్రజాస్వామ్య నీ జాడ ఎక్కడా?, కథానికలు
జీవన సంఘటనలకు, తొలి నుంచి పెన వేసుకొన్న జీవన బంధాల మాధుర్యానికి
ప్రతీకగా నడుస్తాయి‌‌.
“పాపం మగాడు “లోని
కవితా పంక్తులు ఉత్కంఠ తో ఔరా అనిపిస్తాయి.ఎంతో త్యాగం తో , మంచితనంతో కుటుంబ భారాన్ని మోసే
మగవాళ్ళకు చరిత్ర లో
గుర్తింపు దొరకని తీరును రచయిత శ్రీ పాద శ్రీనివాస్ ఉదాహరణలతో ప్రశ్నించటం ఆలోచింపజేస్తుంది.
మిగిలిన కథానిక
కామన్ మెన్, కథలు
ఆత్మ బంధం , అంతరాత్మ – పరమాత్మ, పండుటాకు, నిరీక్షణ,
గోదావరి అలలలో అమ్మ పిలుపు, బలి పశువు, ఆత్మ వేదన,
కూడా వేటికవే భిన్నమైన భావాలతో
మనసును హత్తుకుంటాయి.

రచయిత శ్రీపాద శ్రీనివాస్ రచించిన “మనసున ఉన్నది ”
92 పేజీల ఈ కథా సంకలనం వెల: రూ 75/.

ప్రతులకు.. హరిచందన పబ్లికేషన్స్…
పబ్లిషర్ గజరావు వెంకటేశ్వరరావు సెల్ ఫోన్:9949883477 లో సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...