వెంకీమామ – సినీ వినీలాకాశంలో మెరిసిన ధ్రువనక్షత్రం

Date:

(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
వారసుడొచ్చాడు…రామానాయుడు గారి వారసుడు . 1986 కలియుగ పాండవుల సినిమా ద్వారా తెరంగ్రేటం చేసి సినీభారతంలో అర్జునుడై , ఒంటరి పోరాటం చేసి అజేయుడై నిలచి విక్టరీ వెంకటేష్ గా అభిమానుల మనస్సు గెలిచిన విజేతవిక్రం.


బాలనటుడిగా తెరంగేట్రం
1971లోనే ‘ప్రేమ్ నగర్’ చిత్రంలో బాలనటుడిగా నటించారు వెంకటేష్. 1986లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూకు దక్షిణ సినిమా పరిశ్రమలో ఇది మొదటి చిత్రం. ప్రకాశం జిల్లా కారంచేడులో డిసెంబర్ 13 వ తేది 1960 సంవత్సరంలో జన్మించినాడు దగ్గుబాటి వెంకటేష్. తల్లిపేరు రాజ్యలక్ష్మి తండ్రి రామానాయుడు.ప్రాధమిక మాధ్యమిక విద్యాభ్యాసం చెనై లోని డాన్ బాస్కో స్కూల్ లో పూర్తిచేసి కాలేజి విద్యను లయోలా కళాశాలలో చదివారు. ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళి మాంటరీ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ స్డడీస్ నుంచి ఎం బి ఏ పట్టాని పొందారు. 1985 నీరజతతో ముడివడిన వివాహబంధం పవిత్రబంధమైంది.

1986 లో తెరంగ్రేట్రం చేసి తనని తాను నటుడిగా మలచుకున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు అనే చిత్రంలో నటించి ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నారు. వెంకటేష్. నటించిన పలు చిత్రాలద్వారా అనేక మంది నూతన కధానాయకులను వెండి తెరకు పరిచయం చేశారు. అద్దం అతని ఫిలింస్కూల్. సినిమాలు విజయవంతంకాని కాలాన్ని వరంగా దొరికిన విరామమని భావించి మరింత ఉత్సాహంతో సినిమాలను చేశారు. శ్రీనివాసకల్యాణం, ప్రేమ, అన్ని విజయాలే వేంకటేష్ ని హిరోగా నిలదొక్కుకునేటట్లు చేశాయి.


విశ్వ నాధుని కళాశాలలో : కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ‘స్వర్ణకమలం’ సినిమాలో నటించారు. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నటించే అవకాశం వెంకటేష్‌కు చాలా తొందరగా వచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని 1989 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. 1988లో విజయవంతమైన మ్యూజికల్ రొమాంటిక్ మూవీ ‘ప్రేమ’ చిత్రంలో నటించారు. ఆ తరువాత ‘బ్రహ్మ పుత్రుడు’, ‘బొబ్బిలి రాజా’ వంటి సినిమాలలో ప్రేక్షకులను అలరించారు. కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో వేంకటేష్ నటన పరిణితికి నిదర్శనం. చంటి సినిమాలో అమాయకుడిగా నటించి మెప్పించారు. బొబ్బిలిరాజా కమర్షియల్ సినిమాగా నిలిచింది. సుదరాకాండ, పవిత్రబంధం సినిమాలద్వార మహిళా ప్రేక్షకుల మన్నలను పోందాడు ధర్మచక్రం, గణేష్ చిత్రాలలో సమాజంలో జరిగే అన్యాయాలను వ్యతిరేకించి వాటిని ఎలా రూపుమాపాలో తన నటన ద్వారా తెలియజెప్పాడు. రాజా, కలిసుందాంరా లాంటి కుటుంబకధా చిత్రాలలో నటించి కుటుంబకధానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఘర్షణ సినిమా సంచలనాన్ని సృస్టించింది. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల ప్రశంశలు పొందాడు. స్నేహ‌ బంధం ఎంత విలువైనదో తెలియజేస్తూ ఏ స్దానంలో ఉన్నా నేస్తానికి మదిలో స్దానం ఎప్పటికి ఉంటుందనే విషయాన్ని కొండపల్లి రాజా చిత్రం ద్వారా తెలియజేసాడు సుమన్. వెంకటేష్ నటకౌశ‌లానికి దర్పణం ఆ చిత్రం .అమ్మ గొప్పతనం తెలియజెప్పిన చిత్రం అబ్బాయిగారు . సొషియో ఫ్యాంటసీగా సాహసవీరుదు సాగర కన్య . సుందరకాండలో తన నటనతో సందడిని పంచిన సరదాల గురువు చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా కాకుండా స్వయంప్రతిపత్తితో శ్రమించి విజయాలు సాధించవచ్చనే సందే శాత్మక చిత్రం సూర్య వంశం. గ్రామీణ నేపధ్యంలో నిర్మితమైన చిన్నరాయుడు అలనాటి గ్రామ పడికట్టుకు సాంప్రదాయాలకు అద్దం పట్టింది. ఇతర నటులతో కలిసి నటించిన చిత్ర్రాలలో తనదైన శైలిని అనుసరిస్తూ సినిమాల విజయానికి చేయుతనివ్వడంలో అయన పాత్ర ప్రశంసనీయం. శ్రమతో పరిశ్రమలో ఉన్నతస్దానాన్ని అందుకొన్న కూలీ నెంబర్ వన్ .


అతిలోక సుందరితో :
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్గా రూపుదిద్దుకున్న ‘క్షణ క్షణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్. సెకండ్ రన్లో బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొన్న ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. క్షణక్షణం తన నటనతో అభిమానులకు అనందానుభూతిని పంచి కలయా నిజమా అనిపించేటట్లు నటించడం అయన సొంతం.


ప్రేమ సినిమాల హీరో
‘ప్రేమించుకుందాం రా’ ‘ప్రేమతో రా’వంటి ఎన్నో విజయవంతమైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలలో నటించారు, అలరించారు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు
జయం మనదేరా ఆంటూ వెంకటేష్ ఖాతాలో, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి రొమాంటిక్ సినిమాలు కూడా ఉన్నాయి. 2005లో ‘ఘర్షణ’ అనే యాక్షన్ ఫిల్మ్లో నటించారు వెంకీ. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతి’, ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’, ‘చింతకాయల రవి’ సినిమాలు మంచి ఫ్యామిలీ డ్రామాలుగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. విజయవంతం అయ్యాయి కూడా. ‘ఎఫ్2’ సినిమాలో వరుణ్ తేజ్తో కలిసి నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు వెంకీ. మేనల్లుడు నాగచైతన్యతో వెంకటేష్ నటించిన ‘వెంకీ మామ’ చిత్రం మహేష్ బాబు తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి చిత్రాలు వెంకటేష్ ను బేషజం లేని బెస్ట్ యాక్టర్ గా నిలబెట్టాయి. ద్రృశ్యం ద్రృశ్యం 2 పరిణితి చెందిన నటకౌశలానికి తార్కాణాలు
నంది పురస్కారాలు
వెంకటేష్ని నంది పురస్కారాలు ఏకంగా ఏడు సార్లు వరించాయి. ‘కలియుగ పాండవులు’కు బెస్ట్ మేల్ డెబ్యూగా ఒక నంది పురస్కారాన్ని, ‘స్వర్ణ కమలం’ సినిమాకి బెస్ట్ యాక్టర్ స్పెషల్ జ్యూరీగా మరొక నంది పురస్కారాన్ని, ‘ప్రేమ’, ‘ధర్మ చక్రం’, ‘గణేష్’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలని అందుకొన్నారు వెంకీ. ఇక, ఫిలింఫేర్ పురస్కారాలకు వెంకీ అంటే ఎంత ఇష్టమో చెప్పడం కష్టం. ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మ చక్రం’, ‘గణేష్’, ‘జయం మనదే రా’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలను అందుకోగలిగారు. ‘కలిసుందాం రా’ చిత్రానికి ఫిలింఫేర్ స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘గురు’ చిత్రానికి ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు.వెంకటేష్ నటనాభినయానికి మెచ్చి అనేక సాంసృతిక సంఘాలు ఎన్నో అవార్డులను బహుకరించాయి. . ఫిలింఫేర్, వంశీబర్కిలీ అవార్డులు నటకౌసలానికి మెచ్చుతునకలు 77 సినిమాలలో నటించిన అజాత శత్రువు చిర యశస్సుడై శతవసంతాలు వర్దిలాలి సూర్యా ఐ.పి.యస్ కి వ్యూస్ అందిస్తోంది జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...