డి.డి. న్యూస్ రీడర్ గా చిరపరిచితం
న్యూ ఢిల్లీ, జూన్ 07 : నాటి తరం న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూశారు. ఆమె వయసు 71 . బుధవారం ఆమె తుది శ్వాస విడిచారు. దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ రీడర్ గా ఆమె వార్తలు చదవడంలో ప్రత్యేకతను చూపారు. 1971 లో ఆమె దూరదర్శన్ లో చేరారు. 1989 లో ఇందిరా ప్రియదర్శిని అవుట్ స్టాండింగ్ వుమన్ అవార్డును గెలుచుకున్నారు. తన కెరీర్లో ఆమె నాలుగు సార్లు ఉత్తమ్ యాంకర్ అవార్డును పొందారు.
కోల్కతాలోని లార్టిగో కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. మూడు దశాబ్దాల పాటు ఆమె దూరదర్శన్ లో పనిచేశారు. తరవాత ప్రభుత్వ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, లయజెన్ అండ్ మార్కెటింగ్ విభాగంలో చేరారు. ఆమె మృతి పట్ల ప్రఖ్యాత జర్నలిస్ట్ షీలా దత్ సంతాపం తెలిపారు. అయ్యర్ ప్రభావవంతమైన మహిళగా కీర్తించారు. ఆకాశవాణి ఢిల్లీ బి కేంద్రం నుంచి పాటలు కార్యక్రమాన్ని కూడా ఆమె నిర్వహించారు.