ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి సీఎం సందేశం
హైదరాబాద్, ఏప్రిల్ 06 : ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో నేడు తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ గా అవతరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పచ్చని పంటలు చక్కని వాతావరణంతో ప్రకృతి రమణీయతతో అలరారుతున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని “ప్రపంచ ఆరోగ్య దినోత్సవం” (ఏప్రిల్ 07) సందర్భంగా సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని, అమలు చేస్తున్న పలు పథకాలను తద్వారా ప్రజలకు అందుతున్న వైద్యం, మెరుగుపడుతున్న ప్రజల ఆరోగ్యం గురించి సిఎం కేసీఆర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన నాటి ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో జిల్లాకో వైద్య విద్యా, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్యరంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని సీఎం అన్నారు.
ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం : కె.సి.ఆర్.
Date: