జాంనగర్, ఏప్రిల్ 2 : ప్రముఖ క్రికెటర్ సలీమ్ దూరాన్ని కన్నుమూశారు. ఆయన వారు 88 . 1961 -1962 లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు దూరాని. గుజరాత్ లోని జాంనగర్లో తన సోదరుడు జహంగీర్ దురాని వద్ద ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దురాని కాబూల్లో జన్మించారు. ఆల్ రౌండర్ గా భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. 29 టెస్ట్ మ్యాచులలో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
1961 -1962 లో ఇంగ్లాండ్ జట్టు మన దేశంలో సిరీస్ ఆడినప్పుడు దురాని బౌలింగ్ విభాగంలో రాణించాడు. ఆ సిరీస్లో భారత్ ఇంగ్లాండ్ జట్టును 2 – 0 తేడాతో ఓడించింది. భారత్ గెలిచిన రెండు టెస్టులలోనూ (కోల్కతా, మద్రాస్) దురాని మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు. పదేళ్ల తరవాత పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ మ్యాచ్లో క్లివ్ లాయిడ్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ వికెట్లను పడగొట్టి విజయంలో ప్రధాన పాత్ర వహించాడు. తన కెరీలో ఒకే సెంచరీ సాధించాడు. ఏడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. మొత్తం యాభై ఇన్నింగ్స్లో పన్నెండు వందల రెండు పరుగులు చేసాడు. డ్రెస్సింగ్ స్టైల్ కు అతను పెట్టింది పేరు. 1973 లో నిర్మించిన బాలీవుడ్ చిత్రం చరిత్రలో నటించాడు. పర్వీన్ బాబీ కూడా ఆ చిత్రంలో నటించారు.
ప్రముఖ క్రికెటర్ దురాని కన్నుమూత
Date: