రాజకీయ ఋషి మహాభినిష్క్రమణం

Date:

(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
తెలుగింటి తెల్లని పంచెకట్టు రాజకీయకోవిదునిగా ఆయనకు ఆయనే సాటి, అనర్గళమైన వాగ్దాటి ఛలోక్తులతో ,చతురతతో చర్చలో పాల్గోటం సమాధానాలు ఇవ్వడం ఆయ‌నకి పరిపాటి. బడ్జెట్ ను కంఠతాపట్టి శాసనసభలో పలుమార్లు ప్రవేశపెట్టిన ఘనాపాఠి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విధేయతలో మిగ‌తావారు ఆయన ముందు ఏపాటి. అజాత శత్రువు రోశయ్య కొణిజేటి.


వేమూరులో జ‌న‌నం
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. రోశయ్య 2004లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. కొణిజేటి రోశయ్యకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అందుకే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రోశయ్య 1989లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1990లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్దిక శాఖ మంత్రి అయ్యారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను 16 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఒక అరుదైన రికార్డ్. ఆయన 1995-97 మధ్యలో ఏపీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.


కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా క్రియా శీలకంగా వ్యవహరించడం వల్ల రోశయ్య గారి సూచనలు సలహాలను అధిష్టానం గౌవించేది పాటించేది తనప్రాంత ప్రజలకు కావలసిన ప్రజాప్రయోజకరమైన పనులను పథకాలను ప్రజలకు చేరువచేయటంలో బేషజాన్ని వదిలి అయా ప్రభుత్వాలతోనూ , అధికారులతోను అ పనులు చేయించుకునేవారు. నిబద్దతతో నిజాయితీగా కళంకంలేని వ్యక్తిగా జననేత గా ప్రజల హృదయాలను చురగొన్న కొణజేటి రోశయ్య గారు నేటి తరం రాజకీయ నాయకులకు మాన. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి..


రాజకీయ ఋషి ప్రస్దానం
1968-85: శాసనమండలి సభ్యుడు
❀1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత
❀1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
❀1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
❀1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు.12 వ లోక్ సభ సభ్యుడు – వివిధ పార్ల మెంటరీ సభా సంఘాలలో సభ్యుడు. పార్ల మెంటరీ లేబ్రరీ సంఘ సభ్యునిగా క్రియాశీలకంగా వ్యవహరించి పలువురి రాజకీయ దిద్గంతులప్రశంసలను పొందారు
❀2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
❀2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
❀2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు
❀2009: సెప్టెంబరు – 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
❀2011: ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...