స్వాతంత్య్ర‌మా, విలీనమా, విమోచనా ??

Date:

సెప్టెంబ‌ర్ 17ను ఏమ‌ని పిల‌వాలి?
ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌లో సందిగ్ధ‌తే..
రాజ‌కీయానికి పావుగా మిగిలిన రోజిది
(నందిరాజు రాధాకృష్ణ, 98481 28215)
సెప్టెంబర్17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న స్వాతంత్య్రం దినం. ఈ రోజును.. విలీన దినంగా జరుపుకోవాల్నా, విమోచన దినమనాలా, స్వాతంత్య్ర దినంగా పరిగణించాలా అనే అంశంపై భిన్న వాదనలు, విభిన్న అభిప్రాయాలున్నా అందరూ ఉత్సాహంగా ఉత్సవం జరుపుకోవలసిన శుభ దినం.. రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారు. సెప్టెంబర్ 17ను కొందరు విమోచన దినమంటే, కొందరు విలీనమంటున్నారు. మరి కొందరు స్వాతంత్య్రమంటున్నారు.
అంద‌రి ఏకాభిప్రాయం ఇదీ
ఏది ఏమైనా నిరంకుశ పాలన నుంచి ప్రజలకు స్వాతంత్య్రం, విముక్తి దొరికిన రోజుగా చూడాలన్నది అందరి ఏకాభిప్రాయం. 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే, నిజాం సంస్థానంలోని 16 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం విముక్తి లభించలేదు. వీటిలో ఎనిమిది జిల్లాలు తెలుగు ప్రాంతంలో, 5 జిల్లాలు మరాఠ్వాడాలో, మరో మూడు కర్ణాటక ప్రాంతంలో ఉండేవి. ఎందరో త్యాగధనుల సుధీర్ఘ పోరాటం, బలిదానాల ప్రతిఫలంగా సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానమనే రాష్ట్రం భారతదేశంలో కలిసిపోయి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుని స్వాతంత్య్రం పొందింది.
ఆర్థిక భేదాలు లేని హైద‌రాబాద్ సంస్థానం
వాస్తవానికి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అత్యధిక అత్యల్ప వర్గాల మధ్య సాంఘిక, ఆర్థికపరంగా భేదం ఉండేది కాదు. ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తులు కొందరు ఈ రెండు వర్గాలలో ఉండేవారు. అయితే పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందిన వారు అదొక సదుపాయంగా భావించుకునేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమానంగా వెనుకబడే ఉన్నారు.. మైనారిటీ వర్గాల వారు కూడా నిజాం పాలనలో అణచివేతకు గురైనవారే. భూస్వామ్య వర్గాలకు చెందిన వారు నవాబుకు అండదండలుగా ఉండేవారు.
స్వాతంత్య్రానంత‌రం 13 నెల‌ల‌కు
దేశానికి స్వాతంత్య్రం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమయ్యింది. అయితే హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్‌లో కలవనంటూ మొండికేసి హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపడంతో తాము లొంగిపోతున్నట్లు అసఫ్‌జాహీ వంశస్థుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించలేదు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమయ్యింది. అయితే హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్‌లో కలవనంటూ మొండికేసి హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపడంతో తాము లొంగిపోతున్నట్లు అసఫ్‌జాహీ వంశస్థుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది.
ఎంద‌రో యోధుల పోరాట ఫ‌లం
జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, షోయబ్ ఉల్లాఖాన్, మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి పోరాటాలు చేశారు. మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితర పోరాటయోధులు, దాశరథి, కాళోజీల కవితల స్ఫూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరువాడ నిజాంపై తిరగబడ్డారు. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించలేదు.
ఎలా చూడాలి ఈ దినాన్ని…
నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ఒక ఒక వర్గం హిందూ, ముస్లీంల పోరాటంగా పేర్కొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శలున్నాయి. నిజాం నిరంకుశ పాలకు, రజాకార్ల ఆగడాలకు అణచివేయబడినవారు అన్ని మతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం అనే అంశం గుర్తించి విలీనం దినంగా చూడాలంటున్నారు మరి కొందరు. భూస్వామ్య దోపిడీ ఇంకా గ్రామాల్లో కొనసాగుతునే ఉందనీ, ఇప్పటికీ వారి నుంచి ప్రజలకు విమోచనం లభించలేదు కాబట్టి 17వ తేదీని విలీన దినంగానే చూడాలని అంటున్నారు. ఏదేమైనా నిజాం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన రోజుగా చూడాలికాని, విమోచనమో, స్వాతంత్రమో, విద్రోహమో అనకూడదంటున్నారు మరి కొందరు. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ పాత్రికేయుడు)

Nandiraju Radhakrishna

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...