గాంధీ గురించి నీచ ప్రేలాప‌న‌లా!

Date:

కుల‌మ‌తాల పేరిట మ‌న‌సులు క‌లుషితం
కోటిమంది సామూహిక జాతీయ గీతాలాప‌న‌
జాతీయ చైత‌న్యాన్ని ర‌గిల్చిన కేసీఆర్ ప్ర‌సంగం
గంగా యమునా తెహ‌జీబ్ పున‌రుద్ఘాట‌న‌
హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 22:
75 ఏండ్ల స్వాతంత్ర్య ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ… నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్‌.బీ. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియం వద్దకు సీఎం కేసీఆర్‌కు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్టేడియంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతానికి లయబద్దంగా పోలీసు బ్యాండ్ వాయిద్యం, అందుకనుగుణంగా స్వర నీరాజనం కొనసాగింది. ఈ సందర్భంగా స్టేడియం అంతటా జాతీయ స్ఫూర్తి ప్రజ్వరిల్లింది.


ఈ ముగింపు వేడుకల్లో శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు, వేలాదిగా ఆహుతులు హాజరయ్యారు.


ఈ వేడుకలు మొదట సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి ప్రదర్శించిన ‘‘వజ్రోత్సవ భారతి‘‘ నృత్య రూపకంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా “ఝాన్సీ లక్ష్మిబాయి” ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వేలాదిమంది ఆహుతుల చప్పట్లతో ఎల్బీ స్టేడియం మారుమోగింది. అనంతరం.. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా వార్షీ బ్రదర్స్ ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘లెహరా రహాహై తిరంగా’’ అంటూ వారు జాతీయ జెండా ఔన్నత్యాన్ని చాటుతూ పాడిన ఖవ్వాలీ ఆహుతుల్లో జాతీయ స్ఫూర్తిని నింపింది. సారే జహాసే అచ్ఛా.. అంటూ వారు ఆలపించిన గీతం ప్రేక్షకులను గొంతు కలిపేలా చేసింది.

ఆద్యంతం వారి ఖవ్వాలీ కార్యక్రమం ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులతో ఆస్వాదించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో ప్రారంభమైన శంకర్ మహదేవన్ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యదీక్షా పరుడికి సంబంధించి లక్ష్య సిద్ధిని ప్రేరేపించే దేశభక్తి గీతాన్ని తెలంగాణ రాష్ట్ర సాధకుడైన సీఎం కేసీఆర్ గారికి అంకితం చేస్తున్నానని శంకర్ మహదేవన్ ప్రకటించారు. ఆ క్షణంలో ప్రజలందరి హర్షద్వానాలు మిన్నంటాయి. శంకర్ మహదేవన్ రాగయుక్తంగా ఆలపించిన పలు పాటలకు ప్రేక్షకులంతా లయాత్మకంగా స్పందించారు.


గాంధేయ‌వాదంతోనే తెలంగాణ సాధ‌న‌
అనంతరం సాగిన సీఎం కేసీఆర్ గారి ప్రసంగం ఆద్యంతం తెలంగాణ స్ఫూర్తితో జాతీయ చైతన్యాన్ని రగిలిస్తూ, భిన్నత్వంలో ఏకత్వ గంగా జమునా తెహజీబ్ ను పునరుద్ఘాటించింది. గాంధేయ వాదమే తెలంగాణను సాధించిందని, గాంధీ అనుసరించిన శాంతి, అహింస, సౌభ్రాతృత్వ భావనల కొనసాగింపే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సహా, భాగస్వాములైన జిల్లా కలెక్టర్లను, అన్నిశాఖల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు
• స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉన్నది.
• పదిహేను రోజులపాటు తెలంగాణ నిర్వహించిన తీరు యావత్ దేశాన్ని ఆకర్షించింది.
• చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నాం.
• స్వతంత్రం వచ్చి 75 ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదు.
• విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయి.
• ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం కరెక్టు కాదు.


• మేధావి వర్గం అర్ధమైనా, అర్ధంకానట్లు వ్యవహరించడం సరికాదు
• అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులున్నయి
• పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి.
• గాంధీ గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడారు.
• గాంధీ గురించి ప్రపంచమే గొప్పగా చెబుతుంది. ఈ అల్పుల మాటలు ఎంత?
• గాంధీ సినిమాను 22 లక్షలమందికి పైగా పిల్లలు చూశారు. నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉన్నది.
• ఇందులో 10శాతం పిల్లలు గాంధీని ఆదర్శంగా తీసుకున్నా దేశం ఎంతో పురోగమిస్తుంది.


• స్వాతంత్య్ర‌ మూర్తి గురించి ఈ తరం పిల్లలకు తెలియాలనే ఈ సినిమాను చూపిస్తున్నం.
• సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కోటి మందికి పైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారు.


• ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ చైర్మన్,రాజ్యసభ సభ్యులు కేశవరావు, మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్లకు అభినందనలు.
• గాంధీ బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినం. రాష్ట్రాన్ని సాధించుకున్నం.


జాతి గర్వించే ప్రముఖులకు, ప్రముఖుల వారసులకు సన్మానాలు
స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సురవరం ప్రతాపరెడ్డి గారి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ గారి వారసుడు, అంబేద్కరిస్టు అజయ్ గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్ సంతోష్ బాబు గారి తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, వెయ్యి ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్ రాంచంద్రారెడ్డి గారి తనయుడు అరవింద్ రెడ్డి, హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య, రావెల్ల వెంకట్రామారావు గారి తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్ హుసాముద్దీన్, సంగీత దర్శకులు శంకర్ మహదేవన్, కె.ఎం.రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్ తదితరులను ఘనంగా సన్మానించారు.


స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ముగింపు వేడుకల వివరాలు
సాయంత్రం 4:09 గంటలకు —- మహత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి, జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన
4:16 —- సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి బృందంచే ‘‘వజ్రోత్సవ భారతి’’ నృత్యరూపకం
4:32 —- వార్షీ సోదరులచే ఖవ్వాలీ
5:06 —- శంకర్ మహదేవన్ సంగీత విభావరి
5:50 —- వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు గారి ప్రసంగం
5:56 —- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారి ప్రసంగం
6:02 —- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం
6:09 —- ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రముఖులకు సన్మానాలు
6:19 —- ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారిచే వందన సమర్పణ
6:21 —- శంకర్ మహదేవన్ సహా, సభికులందరి ముక్త కంఠంతో జాతీయ గీతాలాపన సాగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...