కడెం నుంచి భద్రాచలం వరకూ సర్వే
వైద్యులు, ఉన్నతాధికారులతో హరీష్ సమీక్ష
హైదరాబాద్, జూలై 16: భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతం లో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారు.
సిఎం ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి ఆకాశమార్గాన్ని ఖరారు చేయనున్నది. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రేపటి సిఎం పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.