‘సర్కారు వారి పాట’ హైవోల్టేజ్ కథ

Date:

బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది
గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇంటర్వ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కి అద్భుతమైన సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అనంత శ్రీరామ్ పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలు…
1) పదిహేడేళ్ళ జర్నీ.. 1295 పాటలు రాశారు, ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది ?
నా ప్రయాణం సులువుగానే ప్రారంభమైయింది. పెద్ద సినిమా కష్టాలు పడలేదు. ప్రారంభంలోనే విజయాలు వచ్చేశాయి. ఐతే ఈ విజయాల నిలకడని కొనసాగించడానికి ప్రతి క్షణం శ్రమించాల్సిందే. ఎప్పటికప్పుడు విజయాలు సాధించాలి. పాటకు మించిన పాట ఇస్తేనే ఇక్కడ రచయితగా నిలబడగలం. దీనికి నిదర్శనమే గీత గోవిందం సినిమాలోఇంకేం ఇంకేం పాట. అప్పుడప్పుడే వ్యూస్ లెక్కపెడుతున్న సమయంలో వంద మిలియన్స్ దాటి రికార్డ్ సృష్టించింది. దాన్ని మించిన విజయం మూడేళ్ళ తర్వాత ‘సర్కారు వారి పాట’ కళావతి సాంగ్ తో వచ్చింది.
2) ‘సర్కారు వారి పాట’ కి రాసే అవకాశం రావడానికి కారణం గీత గోవిందం విజయం అనుకోవచ్చా ?
క‌చ్చితంగా అనుకోవచ్చు. గీత గోవిందం విజయం తర్వాత నాతో పాట రాయించాలని దర్శకుడు పరశురాం గారికి అనిపించింది. ఐతే సినిమాలో ప్రతీ పాట రాయాలనిపించడం మాత్రం దైవ సంకల్పం. ఒక పాట బావుందని మరో పాట.. ఇలా ఐదు పాటలూ రాయించారు.


3) ఐదు పాటలు డిఫరెంట్ జోనర్ లో వుంటాయా ?
ఐదూ విభిన్నమైన పాటలు. పెన్నీ సాంగ్ హీరో కారెక్టరైజేషన్ కి సంబధించి వుంటుంది. రూపాయి ఎవరిదైన దాన్ని గౌరవించే క్యారెక్టర్ హీరోది. దీన్నే మాస్ ధోరణిలో పెన్నీ సాంగ్ లో చెప్పాం. కళావతి ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఎంతటి పోగరబోతు కూడా అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ప్రాధేయపడి ఆమె ప్రేమని కోరుతాడనేది ఈ పాటలో అందంగా చెప్పాం. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ పూర్తి కమర్షియల్ గా వుంటుంది. ‘సర్కారు వారి పాట వెపన్స్ లేని వేట’. వేటాడాలంటే ఆయుధం కావాలి. కానీ హీరో ఆయుధం అతని తెలివి. ఇందులో సాహిత్యం పాత్రకి తగ్గట్టుగా కమర్షియల్ గా వుంటుంది. మరో రెండు పాటలు కూడా ఈ వారంలోనే విడుదలౌతాయి. ఆ రెండు పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. అభిమానులని అలరిస్తాయి.
4) పాట రాస్తున్నపుడు హీరోలు ఇన్పుట్స్ ఇస్తారా ? వారి ప్రభావం ఉంటుందా ?
దర్శకుడి ప్రభావమే వుంటుంది. వారి మార్గదర్శకత్వంలోనే వుంటుంది. ఒకవేళ హీరోలు ఏమైనా చెప్పాలనుకున్న దర్శకుల ద్వారానే చెప్తారు.
5) సర్కారు వారి పాటలో ఏ సాంగ్ రాయడనికి ఎక్కువ సమయం తీసుకున్నారు ?
అన్ని పాటలు సమయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 2020లో సినిమా పట్టాలెక్కింది. తర్వాత లాక్ డౌన్లు వచ్చాయి. ఐతే ఈ రెండేళ్ళ గ్యాప్ లో కొన్ని సందేహాలు రావడం, మళ్ళీ రాయడం, మార్చడం జరిగేది. ప్రతి పాట నెలలు తరబడే సమయం తీసుకుంది.
6) డబుల్ మీనింగ్ వుండే పాటలు రాయాల్సివస్తే ఎలాంటి కసరత్తు చేస్తారు ? ఇబ్బంది పడే సంధర్భాలు ఉన్నాయా ?
సందర్భాన్ని బట్టి అది శ్రంగారభరితమైన పాటే ఐతే .. దాన్ని రాయడానికి నేనేం ఇబ్బంది పడను. మడి కట్టను. కాకపొతే ఎలాంటి వేదికకి రాస్తున్నాం అనేది చూసుకోవాలి. కుటుంబం మొత్తం కలసి చూసే సీరియల్ కి రాసినప్పుడు మోతాదుకి మించి రాస్తే ఒకరిని ఒకరు చూసి ఇబ్బంది పడతారు. ఇక్కడ శ్రుతిమించికూడదు. సినిమాకి రాస్తున్నపుడు .. స్నేహితులు, కాస్త వయసుపెరిగిన వారు ప్రేక్షకులుగా వుంటారు కొంత కంఫర్ట్ జోన్ వుంటుంది కాబ్బట్టి ఇక్కడ కొంచెం మోతాదు పెంచవచ్చు. సోషల్ మీడియా, మిగతా ఓటీటీ వేదికలలో వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి మోతాదు పెరిగినా పర్వాలేదు. వేదికలు బట్టి మోతాదు చూసుకోవాలి.
7) సర్కారు వారి పాట కథ చెప్పినపుడు మీకు ఎలాంటి ఎక్సయిట్మెంట్ కలిగింది. ?
ఈ కథ వినగానే గత ఐదేళ్ళుగా ఇలాంటి కథ రాలేదు , మళ్ళీ ఐదేళ్ళ తర్వాత గానీ ఇలాంటి కథ మహేశ్ బాబు గారికి రాదనపించింది. విలువలుండి, వ్యాపార విలువలు జోడించిన కథ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కథ మహేష్ బాబు గారికి వచ్చింది, ఇలాంటి సినిమాలో భాగమైతే నా భవిష్యత్ కు మంచి పునాది పడుతుందనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.


8) ఇప్పుడు సినిమాల్లో పాటలు తగ్గిపోయాయి ? వున్న పాటలు కూడా ఇరికించినట్లనిపిస్తున్నాయి. సర్కారు వారి పాటలో సాంగ్స్ ప్లేస్ మెంట్ ఎలా ఉండబోతుంది?
ఇందులో పాటలుగా నాలుగే వుంటాయి. అవి కూడా అద్భుతమైన ప్లేస్ మెంట్స్ వస్తాయి. అవసరమైన చోటే పాట పెట్టడం జరిగింది. ఇక మిగతా సినిమాల్లో పాటలు తగ్గడానికి మారుతున్న ట్రెండ్ ఒక కారణం కావచ్చు. సినిమా నిడివి ఇప్పుడు తగ్గుతుంది. పాటలు లేకుండా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం పాట కోరుకుంటారు.
9) తమన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
తమన్ లయ మాంత్రికుడు. మనం మామూలు సాహిత్యం ఇచ్చినా అతని రిధమ్ తో కొత్తగా అనిపిస్తుంది. తమన్ సౌండ్ చాలా గ్రాండ్ గా వుంటుంది. అతని బీట్ తగ్గట్టు సాహిత్యం రాస్తే అద్భుతంగా వినిపిస్తుంది.
10) సింగర్ ఎంపికలో గీత రచయిత ప్రమేయం వుంటుందా ?
తమన్, నేను సమకాలికులం కాబట్టి ఈ పాటకు ఏ గాయకుడు, గాయిని అయితే బావుంటుందని అడుగుతారు. నిర్ణయం దర్శకుడికి హీరో కి ఎవరైతే పాడాక నచ్చారో వారిదే ఉంచుతారు.
11) కళావతి పాట రాసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా ?
పాట రాసినప్పుడు విజయం సాదిస్తుందని ఊహిస్తాం కానీ ఇంత స్థాయిలో విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేం. ఎలాంటి ట్యూన్ ప్రేక్షకులికి నచ్చుతుంది. ఎలాంటి సాహిత్యం కావాలి, సౌండ్స్ ఎలా వుండాలి.. ఇలా చర్చలు జరుగుతాయి. అలా బయటికి వచ్చిన పాట అందరికీ నచ్చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది.
12) రెండేళ్ళ గ్యాప్ లో పాటలపై ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే వున్నామని తమన్ చెప్పారు . సాహిత్యం పై కూడా పని చేశారా ?
సర్కారు వారి పాట కి చాలా వర్క్ జరిగింది. సాహిత్యం పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. సర్కారు వారి పాట రచనలో 190 పేజీల వైట్ నోట్ బుక్స్ నాలుగైపోయాయి.
13) సర్కారు వారి పాట నుంచి రాబోయే రెండు పాటలు కూడా కళావతి స్థాయిలో ఆకట్టుకుంటాయా ?
స్థాయి చెప్పలేను కానీ రాబోయే రెండు పాటలు మాత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాయి.


14) కొంతమంది గాయకులు సాహిత్యాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు. గేయ రచయిత చెప్పేవరకూ ఆ
సాహిత్యం అర్ధం కావడం లేదు ? ఎవరి గురించి చెబుతున్నామో ఈ పాటకి మీకు తెలిసేవుంటుంది ?
మీరు సిద్ శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు అర్ధమైయింది. కళావతి పాట విషయానికి వస్తే అతని ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. నేను దగ్గర వుండి పాడించాను. ఐతే అతని గత పాటల్లో తెలుగు పరిచయం లేకపోవడంతొ కొన్ని తప్పులు జరిగుండోచ్చు. అదే మూడ్ లో వినేసరికి ఏదో తప్పుగా ఉచ్చరిస్తున్నారనే భావనే తప్పా .. కళావతి పాట ఉచ్చారణలో ఎలాంటి దోషాలు లేవు. దినితో పాటు ఐతే పాట మిక్స్ చేసినపుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని పదాలు వేరేగా వినిపించవచ్చు. పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా అభిప్రాయం.
15) ఒక పాటని ఇయా విధంగా వినాలని ప్రేక్షకుడికి చెప్పలేం కదా ?
చెప్పాలి. ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు. కానీ సినిమాలో దాన్ని స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా. ప్రతిదాంట్లో టెక్నాలజీ వస్తుంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి.
16) మహేష్ గారితో ఇది ఎన్నో సినిమా ?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి రాశాను. సర్కారు వారి పాట రెండోది. పరశురాం గారితో సారొచ్చారు,శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం,,. ఇప్పుడు సర్కారు వారి పాట.
17) దర్శకుడు పరశురాం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
దర్శకుడు పరశురాం గారి కథలు సాఫ్ట్ అండ్ క్లాస్ గా వుంటాయి. సర్కారు వారి పాట మాత్రం హైవోల్టేజ్ వున్న కథ. ప్రతి సీన్, డైలాగ్, పాట, సీక్వెన్స్ ఇలా అన్నిటితో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
18) గత నాలుగేళ్లతో పాట స్వరూపం, దాని పెట్టె బడ్జెట్ ఓ స్థాయికి వెళ్ళాయి . మరి గీత రచయితకు ప్రతిఫలం వస్తుందా ?
ప్రతిఫలం బాగానే వస్తుంది. రాయలిటీ చట్టాలు బలంగా వున్నాయి. వందల మిలియన్ల వ్యూస్ వచ్చే పాట రాయగలిగితే రేమ్యునిరేషనే కాకుండా కొన్నేళ్ళు పాటు కూరగాయలు ఖర్చుకి వాల్సిన డబ్బు ఇస్తుంది.
19) మహేష్ బాబు గారికి ఈ సినిమాలో ఇష్టమైన పాట ?
పెన్నీ సాంగ్ మహేష్ బాబుగారికి చాలా ఇష్టం. ఈ కథ ఆయన ఓకే చేయడానికి గల కారణం హీరో పాత్రలో వుండే కొత్తదనం. హీరో క్యారెక్టర్ ని పెన్నీ సాంగ్ లో అద్భుతంగా రావడం వలన ఆయనకి ఇంకా అద్భుతంగా నచ్చింది.
20) ఈ సినిమాకి మూడు పెద్ద బ్యానర్లు పనిచేశాయి.. ముగ్గురు నిర్మాతలతో పని చేయడం ఎలా అనిపించింది ?
ముగ్గురు నిర్మాతలనే భావనే రాలేదు. దర్శకుడి తరపున పరశురాం గారితో పని చేశాను. ప్రొడక్షన్ వైపు నుండి వాళ్ళు ఎంచుకున్న సంధానకర్తతో పని చేశాను. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్.. నిర్మాతలంతా సినిమాపై ప్రేమ వున్న వాళ్ళు. అలాంటి నిర్మాణ సంస్థలతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
కొత్తగా రాస్తున్న సినిమాలు చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ – శంకర్ గారి సినిమా, నాగ చైతన్య థ్యాంక్ యూ చిత్రాలకు రాస్తున్నాను. ఇవి కాకుండా నవదీప్ హీరోగా లవ్ మౌళి, సత్యదేవ్ కృష్ణమ్మ చిత్రాలకు సింగెల్ కార్డ్ రాస్తున్నాను. అలాగే ఎస్వీ కృష్ణా రెడ్డిగారి సినిమాకి రాస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...