పెండింగ్ నిధులు చెల్లించాలని తెలంగాణకు ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడెమీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పెండింగ్ నిధులు 33 కోట్ల రూపాయలను 6శాతం వడ్డీతో ఏపీకి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు అకాడెమీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ 92.94 కోట్ల రూపాయలను చెల్లించింది. బకాయిలను ఎప్పటికీ చెల్లించకపోవడంతో ఏపీ ప్రభుత్వ పదేపదే విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. సుప్రీం తాజా ఆదేశాలతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ సుప్రీం అనుమతి కోరింది. తెలంగాణ వినతిని సుప్రీం మన్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఏపీ తెలుగు అకాడెమీకి పెద్ద ఊరట. నిధుల లేమితో సతమతమవుతున్న ఆ సంస్థకు కాస్త నిధులు చేతిలో ఆడతాయి. వ్యూస్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అకాడెమీ నిధుల అంశంలో తెలంగాణతో పోరాడుతున్నామనీ, ఆదేశాలు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామనీ ఏపీ తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.
ఏపీ తెలుగు అకాడెమీకి సుప్రీంలో ఊరట
Date: