(డా విడి రాజగోపాల్, 9505690690)
అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు
అందు ప్రాణికోటితో కళ కళలాడేది
మన భూగోళం
ఇది మనం ఊహించనంత పెద్ద బంతి
దీని వ్యాసం సుమారు ఎనిమిదివేల మైళ్ళు
దీని బరువు సుమారు 600 మిలియన్ ట్రిలియన్ టన్నులు
ఒక్క ట్రిలియన్ అంటే లక్ష కోట్లు
మన కంటే సూర్య గోళం వంద రెట్లు ఎక్కువ, చంద్రుడు మనలో నాలుగింట
ఒక వంతుమాత్రమే
భూమి పైభాగాన్ని క్రష్ట్ అని
మధ్య భాగాన్ని మ్యాంటిల్ అని
మధ్య భాగాన్ని కోర్ అని అంటారు
లోపల ఘన రూపంలో ఉన్న
ఇనుము నికెల్ లోహాలతో ఓ గట్టి చెండులాంటిది
దానిపై సల సలకాగే ఇనుము నికెల్ మిశ్రమం ఉంటుంది
దాన్నే మాగ్మా అంటారు
ఇది అప్పుడప్పుడూ భూమి ఉపరితలానికి చొచ్చుకొని వస్తుంది
వాటినే అగ్ని పర్వతాలు అంటారు
ఆ పైన రాతి పొరలు
ఉపరితలం పై కొండలు కోనలు
చదునైన పీఠభూమి
నదులు సరస్సులు సముద్రాలు ఉన్నాయి
ఈ సంపద అంతా భూమాతదే
అందులో లక్షలకోట్లు చేసే
ఖనిఖ సంపద ఉంది
మన మనుగడకు ఖనిజాలే ఆధారం
ఈ సంపదంతా నా పిల్లలందరికి సమంగా పంచమని భూమాత కోర్టులో దావావేస్తే
తలసరి ఒక్కొక్కరికి సుమారు పదిహేడు వందల ఎకరాలు వస్తుంది సుమా!
ఇందులో ముప్పది శాతం భూమి తక్కింది సముద్రం
అంటే ఎవరూ పేదలుండరు
అందరూ బిర్లాలే అందరూ అంబానీలే
కరోనా మహమ్మారి విజృంభించిన వేళ
ప్రాణవాయువును గాలినుంచి వేరుచేసి
కోట్లరూపాయలు దండుకున్పారు సంపన్నులు
భూమాత గర్భం నుండి వచ్చేనీరు
వృక్షసంపద ఖరీదు కట్టితే ఎన్ని లక్షల కోట్లో
అయితే ఇలానే అదుపు లేకుండా విచ్చలవిడిగా కర్బన వాయువులు వాతావరణంలో వెదజల్లితే
భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి
నివాసయోగ్యం కోల్పోతే భూమాత ఇతర గ్రహాలవలె నిర్జీవమై పోతుంది
వాతావరణ సమతుల్యం పాటిద్దాం
ధరిత్రిని కాపాడు కుందాం
ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలతో
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)