అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు

Date:

మార్చి 16 పొట్టి శ్రీరాములు జ‌యంతి
(డా వి.డి.రాజగోపాల్, 9505690690)

మనల్ని మదరాసీలు అనేరోజులవి
భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం
తేనెలూరే తెలుగు వారికి ఓ రాష్ట్రం
అందరూ ఆశించారు
కొందరు ఉద్యమంలో లీనమైనా
ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేబట్టి
పట్టు వదలక ప్రాణాలు లెక్కచేయక
తెలుగు రాష్ట్రం కోరి ప్రాణాలు పోగొట్టుకున్న
ఏకైక ధీరుడు మన అమరజీవి

మదరాసులో తొలి విద్య
బొంబాయిలో మలి విద్య
ఆ పై ఓ ప్లంబర్‌గా రైల్వేలో కొలువు
ఆ కొలువు ఏపాటిది సమాజం కంటే
అనుకున్నారు ఈ నిస్వార్థ జీవి
అందుకే ఆ కొలువు త్యజించి
ఆనాటి స్వతంత్ర సమరంలో
ఓ ప్రమిదగా వెలిగారు
గాంధీజీ చెంతచేరారు
సబరిమల ఆశ్రమవాసిగా మారారు
హరిజనులకు ఆలయ ప్రవేశం
అన్న అంశంపై ఆమరణదీక్షచేబట్టిన
సంఘసంస్కారి మన అమరజీవి
అప్పుడు గాంధీజీ చొరవచూపకపోయుంటే ఆనాడే అయ్యేవాడు అమరజీవి
తెలుగు రాష్ట్రంకోసం పోరాటంలో
ఆయనను కాపాడే వారే లేకపోవటం
ఓ భరతమాత ముద్దు బిడ్డను కోల్పోవటం
స్వతంత్ర భారతావనికే మచ్చ
ఈ విషయం మన్నించరాని తప్పు

వారి పేరిట వెలిసింది మన భాగ్యనగరంలో
ఓ తెలుగు విశ్వవిద్యాలయం
ఆ అమరవీరుని గుర్తుంచుకొన్న
మన తెలుగు వీరుడు యన్టీఆర్
నెల్లూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టడం
మరో ప్రజానాయకుడు వైయస్ఆర్ చొరవ
ఈ తెలుగు వీరులు చిరస్మరణీయులు
ఇలా ఆలస్యంగానైనా ఆ మహనీయుని
సముచితంగా స్మరించుకోవటం ఆనందం
గాంధీజీ అహింసా సిద్ధాంతం నమ్మి
ఆ బాటలో నడచిన మహనీయులు వారు
ఆ సిద్ధాంతం పరదేశీయుల పాలనలో
విజయం సాధించింది
స్వదేశీ పాలనలో ఓ నిండు ప్రాణం బలైంది
ఇది మాయని మచ్చ ఎలా తీరుతుంది
మనం ఘనంగా జరుపుకోవాలి వారి
జయంతులు వర్ధంతులు
ఈ దినం వారి జయంతి సందర్భంగా
ఈ అమరజీవికి జోహార్లు!
(క‌విత ర‌చ‌యిత రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాల‌జీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...