న్యూఢిల్లీ, జనవరి 31: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్
కొవిడ్‌పై పోరులో ప్రపంచానికే ఆదర్శం
ఫార్మా రంగం అద్వితీయ కృషి
ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150కోట్ల టీకాలు
90శాతంమందికి పైగా మొదటి డోసు
ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు అభినందనలు
భారత్ కరోనా పోరు స్ఫూర్తిదాయకం
భారత వ్యాక్సిన్లు కోట్లాది ప్రాణాలను కాపాడాయి
సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు
ఆయుష్మాన్ భారత్ కార్డులకు పేదలకు చికిత్సలో సాయపడ్డాయి
డిజిటల్ ఇండియాకు యుపిఐ విజయవంతమైన ఉదాహరణ
వీర జవాన్లకు వందనం
దేశ సురక్షిత భవిష్యత్తు కోసం పాటుపడిన వారికి కృతజ్ఙతలు
యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యాలకు పెరుగుతున్న ఆదరణ
జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు అందుబాటులో మందులు
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సూత్రంతో పనిచేస్తున్నాం
గత స్మృతుల నుంచి పాఠం నేర్చుకోవడం ప్రధానం
వచ్చే 25 ఏళ్ళ పాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి
ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులకు భారీగా ఉద్యోగావకాశాలు
వీధి వ్యాపారులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర అద్వితీయం
ఎమ్ఎస్ఎమ్ఈల చేయూతకు 3 లక్షల కోట్ల రుణాలు