కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు
వివరించిన ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయకుమార్
అమరావతి, జనవరి 27: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. అసెంబ్లీ నియోజక వర్గాన్ని విడదీయకుండా జిల్లాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృతంగా ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సునిసిత అధ్యయనం చేశారు. ఒకే జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు.
రంపచోడవరం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అల్లూరి జిల్లాలో చేర్చినట్లు విజయకుమార్ వెల్లడించారు. ప్రజలకు మరింత సౌలభ్యం ఉండేలా సీఎం వైయస్ జగన్ ఆకాంక్ష మేరకు జిల్లాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాకూ రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సరిహద్దులపై విస్తృతంగా అధ్యయనం చేశారు. స్థానిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులను సైతం అధ్యయనం చేశారు. చారిత్రక నేపథ్యం, జనసాంద్రత వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. విస్తృత పరిథిలో గిరిజన ప్రాంతం ఉన్నందున. గిరిజనాభివృద్ధికే రెండు జిల్లాల ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా మార్పు చేశారు. జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరలో ఉండేలా చూశారు. కొత్త జిల్లాల రూపపకల్పనకు లోతైన అధ్యయనం చేశారు. ప్రజల సౌలభ్యతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్నారు.
ఇదే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాల విభజనను స్వాగతించారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు