‘గెలుపు’ కు రక్తి కట్టించే ముగింపు

0
106

(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
గెలుపు రుచి మరిగితే ఎలా ఉంటుంది? గెలవడం అలవాటుగా మారుతుంది. అదే గెలిచేలా చేస్తే… అంటే మేనేజ్ చేస్తే అన్న మాట. తన కుమారుడు చెస్ లో విజేతగా నిలవాలనేది ఒక తల్లి ఆకాంక్ష. ఇలా గెలుస్తూ వస్తున్న బాలుడు ఒక ప్రొఫెషనల్ చేతిలో ఓడిపోతాడు.

అప్పుడు అతను విపరీతంగా ధోరణిని కనబరుస్తాడు. ఇది ఆ తల్లిని ఆందోళనకు గురిచేస్తుంది. పరిష్కారం వెతుకుంది. ఒక ట్రైనర్ ని పిలిపిస్తుంది. శిక్షణ ఇప్పిస్తుంది.


ఆ తరవాత ఒక టోర్నీలో పరిణామాలే ఈ ఎపిసోడ్ కి ట్విస్ట్. ఈటీవీ విన్ కథ సుధ తాజా ఎపిసోడి ‘గెలుపు’ ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలో కొంత సాగదీసినట్టు కనిపించినప్పటికీ, క్రమేపీ వేగం పుంజుకుంది.


ఆ బాలుడి తల్లి ఆమె ఫ్రెండ్ పాత్రధారులు అవసరమైన దానికంటే మోహంలో ఎక్కువ క్రూరత్వాన్ని కనిపించేలా చేశారు. డబ్బున్న ఆడవాళ్ళలో ఉండే అహంకారం అంతా వారి నటనలో కనిపించింది. తన కుమారుడికి ఒక పల్లెటూరి బాలిక నుంచి చెస్ ఆటలో ఎదురైన అనుభవం, ఓడిపోతాడేమోనన్న ఆదుర్దా బాగానే పండించారు.


నేనే గెలవాలి అనే మత్తు నుంచి ఆ బాలుడు బయటపడేలా చేసిన సన్నివేశం రక్తి కట్టింది. ఎపిసోడ్ ప్రారంభానికి, ముగింపు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ఇలా చేయగలగడం డైరెక్టర్ ప్రవీణ్ రామరాజు ప్రతిభకు అద్దంపట్టింది. టీం కృషి కనిపించింది. ప్రారంభంలో ఒక చోట ఆటలో తప్పు ఎత్తులు వేయించారు. ఇది నిశితంగా పరిశీలించిన వారికి తప్ప మిగిలిన వారికి తెలియవు. ముగింపు ఈ ఎపిసోడ్ కి హైలైట్.


కథా సుధలో ఇప్పటివరకూ ఇది విభిన్నమైన సబ్జెక్టు. క్రీడాంశాన్ని ముఖ్యంగా చెస్ ఆటను ఎంచుకుని ఎపిసోడ్ ఏదీ రాలేదు.
మంచి మైకులో చెప్పాలి… చెడు చెవిలో చెప్పాలనేది నానుడి. ఉన్న లోపాలను దర్శకుడి చెవిలో ఊదేశాను. మణిపూర్ రాష్ట్రంపై డాక్యుమెంటరీ తీసి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి పొందిన ప్రవీణ్ రామరాజు ప్రతిభ ఇందులో కనిపియించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here