ఆయన పోలీసు జీవితంలో ఎన్నెన్నో సవాళ్లు

0
127

ఒక పోలీసు జీవిత సారం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఒక పోలీసు అధికారి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది? ఒత్తిళ్లు ఎలా ఉంటాయి? రావాల్సిన ప్రమోషన్ (పదోన్నతి) రాకపోతే ఆ అధికారి ఏమి కోల్పోతాడు? వాటిల్లే నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. బంటు రామారావు ‘ధీశాలి’ పేరిట రాసిన తన జీవిత చరిత్ర ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది. కారంచేడు కేసును ఈయన ఛేదించారు. ఈ విచారణ సందర్భంగా ఆయన దేనికీ లొంగలేదు. బెదిరింపులకు వెరవలేదు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగిన రాములుకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎస్పీ ప్రమోషన్ తప్పిపోయింది. అంతా సవ్యంగా జరిగిఉంటే ఐపీఎస్ కన్ఫర్ అయ్యి ఎస్పీ ప్రమోషన్ కూడా పొంది ఉండేవారు. దీని గురించి పుస్తకంలో ఆయన వివరించారు. ఎన్నో ప్రయోజనాలను అందుకోలేకపోయారు.

విధి నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లకు అంతు లేదు. కష్టాలకు లెక్క లేదు. విధి నిర్వహణ ప్రారంభం నుంచి రిటైర్ అయ్యే వరకూ ఆయన కేసుల దర్యాప్తులో చూపిన నిబద్ధత, బాధ్యత, అంకితభావం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తాయి. ఈ పుస్తకాన్ని చదివితే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, వాస్తవాన్ని వెలికితీసే దృఢ నిశ్చయం కలుగుతాయి. మన జీవితంలో కూడా రాములు గారి లాంటి ధైర్యం, నిజాయితీ ఉన్నాయా అనే ప్రశ్న ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ పుస్తకాన్ని the unbroken spirit పేరిట ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఇంగ్లీష్ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది. పోలీసు ఉద్యోగంలో ఉన్నవారే కాకుండా… పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలనుకున్నవారికి సైతం రాములు గారు రాసిన పుస్తకం మార్గదర్శకంగా నిలుస్తుంది. రాములు ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఆయన చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టాలను తట్టుకుని చదువు పూర్తిచేశారు. క్లిష్ట పరిస్థితులు ఎదురై తట్టుకోలేక స్కూల్ నుంచి మానేసినవారు (డ్రాపౌట్స్) ఎందరో ఉన్నారు. ఈ తరం వారు బంటు రాములును ఆదర్శంగా తీసుకోవాలి. కష్టాలు ఎదురయ్యాయని చదువు మానేయకుండా లక్ష్యాన్ని సాధించడానికి ఆయన రాసిన అనుభవాలు మార్గదర్శనం చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here