జలమండలి జి.ఎం.కు వంద కోట్ల ఆస్తులు

0
98

ఏ.సి.బి. దాడులలో బయటపడ్డ అక్రమాలు
హైదరాబాద్, మే 19:
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సెవెరజ్ బోర్డులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎస్.ఏ.ఎల్. కుమార్ పై తెలంగాణ ఏ.సి.బి. మంగళవారం దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించింది. ప్రాధమికంగా వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని అంచనా వేసింది. ఇంజనీరింగ్ విభాగంలోని ప్రాజెక్ట్ డివిజన్ 8 లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని పేర్కొంది. ఆయనకు సంబంధించిన తొమ్మిది ప్రదేశాలలో ఏ.సి.బి. దాడులు చేసింది. కుమార్ పై 13 ( 1 )(బి) , 13 ( 2) సెక్షన్ల కింద కేసులను నమోదు చేసింది. సగ్గం అనంత లక్ష్మణ కుమార్ ను ఎస్.ఏ.ఎల్. కుమార్ గా వ్యవహరిస్తారు. నిజామాబాదు, సంగారెడ్డిలలో 18 ఎకరాల పొలాలు, హైదరాబాద్ లో మూడు ఫ్లాట్స్ , ఓపెన్ ప్లాట్స్, ఐదు కోట్లకు పైగా విలువ చేసే కారు ఉన్నాయని ఏ.సి.బి. తెలిపింది. ఇంకా ఆయన బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here