ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి

0
65

జర్నలిస్టులకు జస్టిస్ గోపాల గౌడ సూచన
(పి వి రమణా రావు)
ప్రభుత్వం సరైన మార్గంలో నడిచేందుకు జర్నలిస్టులు సలహాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ గోపాల గౌడ సూచించారు. దేశం బలోపేతం కావడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైందన్నారు. ఎం.వి.ఆర్. శాస్త్రి గ్రేట్ జర్నలిస్ట్, ఫిలాసఫర్, రిఫార్మిస్ట్, క్రిటిక్, స్టేట్స్మన్ అని గోపాల గౌడ పేర్కొన్నారు.
అంబేడ్కర్ తరహాలో ప్రజలకు న్యాయం చేసేందుకు శాస్త్రి కృషి చేశారన్నారు.


ఎం.వి.ఆర్. శాస్త్రి నికార్సయిన పాత్రికేయుడని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు శాస్త్రి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నవారికి శాస్త్రి గట్టి సమాధానం చెబుతున్నారన్నారు.
సత్యాన్వేషి, జాతీయవాది అయిన శాస్త్రి సన్మాన కార్యక్రమం లో పాల్గొనడం తన సౌభాగ్యమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
ఈ కార్యక్రమం లో ఐఏఎస్ మాజీ అధికారులు ఐ వై ఆర్ కృష్ణా రావు, బి పి ఆచార్య, అజయ్ మిశ్రా, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, అమృతోత్సవ కమిటీ చైర్మన్ జి. వల్లీశ్వర్, వైస్ – చైర్మన్ రాణా ప్రతాప్, మెట్రో ఇండియా చైర్మన్ సి ఎల్ రాజం, పర్యావరణవేత్త బి. సత్యనారాయణ, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ రావు, పాత్రికేయులు రజినీకాంత్, ఎస్. భరత్ కుమార్ , శంకర నారాయణ, టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్, వైజయంతి తదితరులు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here