ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీ
అమరావతి, జనవరి 23: పీఆర్సీ అంశంపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల నాయకులను సంప్రదింపులకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీపర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్ ఉన్నందున మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు.
సంప్రదింపులకు రండి
Date: