స్టార్ట్ అప్ కేంద్రంగా టీ-హబ్

0
116

అద్దె భవనాల్లో కార్యాలయాల తరలింపు
అమెరికా నుంచి సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, జనవరి 24 :
టీ హబ్‌ ను స్టార్టప్​ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్​కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్​ చేసి మాట్లాడారు.

అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్​ను ప్రత్యేక స్టార్టప్​ ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు.

ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్‌ క్యాటలిస్ట్‌గా స్టార్టప్​లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here