గ్లోబల్ సమిట్లో సీఎంకు దువ్వూరి ప్రశంసలు
హైదరాబాద్, డిసెంబర్ 10: భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నఈ తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగస్వామిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు చెప్పారు. గ్లోబల్ సమిట్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను రాబోయే ఇరవై ఏళ్లలో దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా లక్ష్యాలను ఏర్పరచుకొని కృషి చేయాలను ఆశయం మహా ఉన్నతమైనదని ప్రశంసించారు. నేను తెలంగాణలో పనిచేశాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత ఆర్థిక కార్యదర్శిగా పని చేశాను. ఖమ్మం కలెక్టర్ గా పనిచేశాను. అప్పుడు బహూశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూల్లో ఉండొచ్చు. నేను ఇప్పుడు హైదరాబాద్ వాణ్ని నాది తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెబుతాను అన్నారు.
దువ్వూరి సుబ్బారావు ప్రసంగ పాఠం యథాతథంగా…
ఒకప్పుడు తెలంగాణ అభివృద్ది లేకుండా పేదరికం, వెనుకబాటుతనం తనం, అమాయకత్వంతో ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ది దిశలో పయనిస్తుంది.అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఎదుగుతుంది.
హైదరాబాద్ నగరం ఒ అద్బుతమైన ఆణిముత్యం. జాతీయ అంతర్జాతీయ నగరాలు తిరిగాం కానీ హైదరాబాద్ నగర ప్రత్యేకతే వేరు. ఈ నగరం భిన్న జాతులను ప్రజలను అక్కున చేర్చుకున్న నగరం. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతి ఉన్న గొప్ప నగరం. ఉత్తమ సంప్రదాయం, ఉన్నత విలువలు కలిగి ఉన్నది.
ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం దేశ వ్యాప్త ప్రజలు బెంగళూరుకు వెళ్లేవారు కానీ ఇప్పుడు అంతా కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న, ఐకానిక్ గా ఉన్న హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటూ ఇక్కడ ఇష్టంగా స్థిరపడుతున్నారంటే హైదరాబాద్ , తెలంగాణ గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఐఎస్ బీ, నీతి అయోగ్ ఇతర మేధావులచేత రూపొందించడం అభినందనీయం. కొద్ది సేపట్లో ఆవిష్కరించబబోయే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అంశాలు బహిర్గతమౌతాయి. విజన్ డాక్యుమెంట్ ను అమలు పరచడంలో నా వంతు కృషిచేస్తాను. నన్ను సలహామండలి సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రిగారికి కృతజ్ఙతలు.
ముఖ్యమంత్రి గారు రాబోయే పదేళ్లలో 1ట్రిలియన్ డాలర్ ఇరవై రెండేళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ల నాటికి 3ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 8 నుంచి 9 శాతం అభివృద్ది సాధించాలి అది కూడ ఎంతో వేగంగా చేయవలసి ఉంటుంది. అది ఒక చాలెంజ్ గోల్ అని చెప్పవచ్చు. కొంచెం కష్టమే అయినా సాధ్యమే అంటాను. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్న ముఖమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను.
ముఖ్యమంత్రి గారు చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి మాడల్ తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. అది మార్గదర్భకమైనది కాకున్న శీఘ్రగతిన అభివృద్ది సాధించిందే.
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అప్రతిహత అభివృద్దిని సాధిస్తూ ఎంతో ప్రఖ్యాతి చెందింది. అయితే తెలంగాణ తయారీ రంగం, వ్యవసాయ రంగం ఇతర ఉపాధి రంగాల వైపు దృష్టి సారించి ఉద్యోగాలు కల్పించాలి.
మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు ఏఐ రంగంలో తెలంగాణను దేశంలోనే గొప్ప ఇన్నోవేషన్ సెంటర్ చేయాలన్న తపన తమ ప్రభుత్వానికి ఉన్నదని అది చాలా అవసరం. అదే సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్. ప్రభుత్వం ప్రాథమిక విద్య, ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలని సూచించారు.
మా పోటీ దేశంలోని రాష్ట్రాలతో కాదు విదేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు నగరాలతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఆ పట్టుదలకు అభినందిస్తున్నాను.
నైపుణ్యతలు చాలా అవసరం . ఆనంద్ మహేంద్ర లాంటి పారిశ్రామిక వేత్తలకు ఆ అంశం చాలా ముఖ్యం.అది ప్రైవేటు వాల్లు చేసేది కాదు. ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ప్రైవేటు వాళ్లు కలిసి చేస్తే ఫలితాలుంటాయి.
సమాజంలో రెండు వేలకు చొక్కా కొన్న వ్యక్తి మరునాడు రెండు వందలు ఎక్కువైనా లెక్కచేయడు. అదే మధ్యతరగతి వ్యకి నాలుగు రూపాయలు బస్ టికెట్ పెరిగితే తమ వర్గాల్లో ధరలు పెరిగిన ధ్యాస అదే ఉంటుంది. ప్రభుత్వాలు అది గుర్తెరిగి పాలన సాగించ వలసి ఉంటుంది.
ముఖ్యమంత్రి అన్నట్టు చైనాలోని గ్వాంగ్ డాంగ్ మాడల్ కాకుండా రాబోయే పదేళ్లలో ప్రపంచంలో తెలంగాణ మాడల్ గా కావాలని ఉదహరిస్తారు. ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ అన్ స్టాపబుల్ అని నేనంటాను తెలంగాణ అన్ బీటబుల్ అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు దువ్వూరి సుబ్బారావు.

