ముందుకొచ్చిన జర్మన్ కంపెనీ
నివేదిక అందించాలి కోరిన సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 05 : తెలంగాణ రాష్ట్రంలో వైద్య పరికరాల ఉత్పత్తి విభాగాన్ని ప్రారంభించేందుకు జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ ముందుకొచ్చింది. శుక్రవారం ఉదయం ఆ కంపెనీ సిఎండి జార్జ్ చాన్, ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా చాన్ తెలంగాణలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.

ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. దీనికి అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను సీఎం కోరారు.

