టూరిజం అభివృద్ధిలో ఫొటోగ్రఫీది కీలక పాత్ర

0
134

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని
గిరిజన జీవన విధానంపై ఛాయాచిత్ర పోటీ
విజేతలకు బహుమతుల ప్రదానం
విజయవాడ, ఆగస్టు 18 :
టూరిజం అభివృద్ధికి ఫోటోగ్రఫీ బాసటగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు.
సోమవారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్‌లో జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఎక్కడైనా ప్రజల స్థితిగతులు, వారి జీవన విధానం తెలియజేసేది ఫొటోగ్రఫీ అని అన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఫొటోగ్రఫీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. టూరిజం అభివృద్ధి కావాలంటే ఫొటోగ్రఫీ ఎంతో అవసరం దీనికి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగవ్యవస్థ అభివృద్ధి జరుగుతుందన్నారు. టూరిజం అభివృద్ధి జరగాలంటే ఫొటోగ్రఫీ ద్వారా అక్కడ పరిస్థితులు, ఆ ప్రాంత గొప్పతనాన్ని ఆకర్షించినపుడే జరుగుతుందన్నారు. దీనిద్వారా టూరిజంలో ఫొటోగ్రఫీకి ప్రాతినిధ్యం ఎలా కల్పించాలో మిగతావారితో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ తెలుపుతామన్నారు. ఎన్ని సెల్‌ఫోన్‌ ఫొటోలు వచ్చినా కూడా కెమెరాతో వచ్చే ఫొటోలు వున్న స్పష్టత వుండదన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులు జీవన విధానాలు కళ్ళకు కట్టినట్లు తెలిపిన నిర్వాహకులను అభినందించారు.


నిర్వాహకులు టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహనీయులు 1839 జాన్‌డాగురే ఫ్రెంచ్‌ ప్రభుత్వం ముందు ఆగస్టు 18 న కెమెరాను కనిపెట్టి ఇప్పటి 185 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సం జరుపుకోవడానికి ఒక భారతీయుడు డా. ఓ.పి.శర్మ ప్రభుత్వం అధినేతలతో పోరాడిన సాధించారు. మొట్టమొదటిసారిగా భారతదేశం వేదిక ఫొటోగ్రఫీలో ఇన్ని సంవత్సరాలలో గిరిజనులపై కాంటెస్ట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. 16 రాష్ట్రాలలో నుండి 487 ఎంట్రీలు వస్తే కేవలం 40 ఫొటోలు మాత్రమే ఎంపికయ్యాయి. సావనీర్‌ విడుదల చేశామన్నారు. 3 అంశాలపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 60 వేల నగదు బహుమతి మొదటి బహుమతి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్‌తోపాటు గోల్డ్‌మెడల్‌ ఇస్తున్నట్లు తెలిపారు.


శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ జాతీయ నుండి అంతర్జాతీయ స్థాయికి ఫొటోగ్రఫీని తీసుకువచ్చిన టి.శ్రీనివాసరెడ్డిని అభినందించారు. గిరిజన సంస్కృతిని మా కళ్ళకు కట్టినట్లు తెలిపారన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందిన వాటితోపాటు ఫొటోగ్రఫీద్వారా చిత్రీకరించి జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. వివిధ రంగాలలో విశేషకృషి చేసిన గోకరాజు గంగరాజును కొనియాడారు.
మాజీ పార్లమెంట్‌ సభ్యులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఈస్థాయిలో ఫొటోగ్రఫీ రంగంలో వుండటానికి పలువురు మహనీయులు ఎందరో సేవలు అందజేశారన్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోగ్రఫీ రంగంనుండి ఇప్పటి కలర్‌ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ దానితోపాటు చిన్నపాటి కెమెరా నుండి ఇప్పటి అత్యాధునిక కెమెరాలను వాడుకునే స్థాయికి ఎదిగిన ఫొటోగ్రఫీ రంగం ద్వారా తనవంతు సేవలందిస్తూ మొట్టమొదటిసారిగా గిరిజన సంస్కృతిని వారికి వెలుగులోకి తెచ్చిన నిర్వాహకులను అభినందించారు. ఎప్పుడూ తనవంతు సహకారం వుంటుందని తెలిపారు.

జిఆర్‌కె-పోలవరపు సాంస్కృతిక సమితి గోళ్ళనారాయణరావు మాట్లాడుతూ సెల్‌ఫోన్‌లున్న వారితో సహా అందరూ ఫొటోగ్రాఫర్లు అయిపోతున్నాము, అయిపోయారనుకుంటున్నారు. కానీ ఒక ఒరిజినల్‌ కెమెరాకి, సెల్‌ఫోన్‌కి ఎటువంటి తేడా వుంటుందంటే ఒక యాగానికి, జాతరకి వున్న తేడా వుందన్నారు. ఈ వేదికను అలంకరించిన ఈ ముగ్గురూ కూడా చిన్ననాడు ఫొటోఫ్రేమ్‌ టెక్నాలజీ నుండి నేటి అత్యాధునిక టెక్నాలజీ వరకు అన్ని తెలిసిన వారేనని అన్నారు. వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న గోకరాజు గంగరాజును కొనియాడారు. అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ప్రోత్సహించే కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులను అభినందించి సర్టిఫికెట్‌, జ్ఞాపికను అందజేశారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షులు సుందర్‌, ఎపి సృజనాత్మకత సంస్కృతీ సమితి డైరెక్టర్‌ & సీఈవో ఆర్‌ మల్లికార్జునరావు, భారీ సంఖ్యలో ఫొటోగ్రాఫర్లు, ఫొటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here