ఆఫీసుల్లో ఆక‌లి చూపులు

Date:

వరూధిని దుర్యోధనుల ఆటలు చెల్లుతాయా?!
పతివ్రతలు…ప్రవరాఖ్యులు ఉన్నా ప్ర‌యోజ‌న‌మేమి!
(బండారు రాం ప్రసాద్ రావు)

చలి కాలం చల్లటి నీళ్ళు పడితే ప్రాణం జివ్వున ముడుచుకు పోతుంది….అలాంటిది ఆఫీస్ నుండి రాగానే పరిమళ చల్లటి నీళ్లతో వణుకుతూ స్నానం చేస్తున్నా కూడా ఆమె కన్నీటి నుండి వేడి కన్నీళ్లు ధారలుగా జలజల రాలుతున్నాయి…కారణం ఆఫీస్‌లో బాస్ చేసిన దురాగ‌తం…కళ్ళ ముందు కదులుతుంది…తన చెయ్యి పట్టుకుని “నా కోరిక తీరిస్తే నీ భర్త ఆరోగ్యంగా కోలుకునే డబ్బు మొత్తం ఇస్తా” అన్న బాస్ ను ఏమనలేక… ఏమైనా అంటే ఉద్యోగం పోతుందని ” సార్ నేను అలాంటి దానిని కాదు…మరొక్క సారి నా శరీరాన్ని తాకితే ఇక్కడే అగ్నికి ఆహుతి అవుతా” అంటూ భోరున విలపించి కూలబడి పోయిన పరిమళ ఆగ్రహ దుఖ భారం చూసి భయపడ్డ బాస్ ఏకాంబరం ఆమెను వదిలి…అక్కడి నుండి వడివడిగా వెళ్లిపోయాడు! బోలెడు దుఃఖ భారంతో ఇల్లు చేరిన పరిమళ… వాడు తాకిన చెయ్యి అపవిత్రం అయిందని చన్నీళ్లతో స్నానం ఆచరిస్తూ విలపిస్తుంది… అచేతనంగా బెడ్ మీద పడుకొని కన్నీళ్లు కారుస్తున్న భర్త కు కాఫీ కలిపి ఇస్తూ “ఎందుకండీ దుఖం మీ కాళ్ళు తిరిగి వస్తాయి ..ఇదిగో…కృతిమ కాళ్ళు పెట్టుకున్న వారు పరిగెత్తు తున్నారు చూడండి” అంటూ ఒక వీడియో చూపిస్తూ భర్తకు ధైర్యం చెబుతూ కూడా కుమిలి పోతుంది…పైకి మాత్రం నవ్వు పులుముకొని జీవిత పోరాటం చేస్తుంది…!!


చిన్ని కాపురం…చింత‌లు లేని సంసారం
అందమైన భర్త…మంచి ఉద్యోగం ఈడు జోడు సరిగా ఉందని పెద్దవాళ్ళు పెళ్లి చేశారు…భర్త పెద్ద కంపెనీలో టీమ్ లీడర్…తనకు ఇన్ఫోసిస్ లో జాబ్…రెండేళ్ల తరువాత పాప పుట్టాక ఆ చిన్నారి బాగోగులు చూడడానికి “ఉద్యోగం వద్దు బంగారం” పొదుపు చేసుకొని సంసారం గట్టెక్కిద్దామని అంటూ, “అది నీ స్వేచ్చ కే వదిలి పెడుతున్న” అన్న ఒక్క మాట ఆయన పట్ల మరింత గౌరవం పెంచింది…ఉద్యోగం మానేసి చిన్నారి బాగోగులు చూస్తున్న… తనకి ఏ ఇబ్బంది లేకుండా ఆయన రాత్రింబ‌వళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు తో సొంత ఇల్లు, కారు కోని పొదుపుగా సంసారం వెళ్ళబుచ్చుతున్న వేళ… ఆయన అర్ధరాత్రి కంపెనీకి వెళుతున్న కారు గచ్చిబౌలి దగ్గర ప్రమాదానికి గురై ముందు కూర్చున్న ఆయన రెండు కాళ్ళు తెగి పోయి…అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ ప్రమాదం జరిగి రెండేళ్లు అయినా మంచం మీద ఉండిపోయారు…ఆయన రెండు కాళ్ళు తీసేసిన తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు…కంపెనీ ఇచ్చిన యాక్సిడెంట్ పాలసీ తో పాటు కారు అమ్మగా వచ్చిన డబ్బుతో ఆరోగ్యంగా స్థిమిత పడుతున్న ఆయన్ని బతికించుకోవడానికి భర్త స్థానంలో ఉద్యోగం ఇచ్చిన కంపెనీలో మళ్ళీ జీవన పోరాటం చేస్తుంది పరిమళ!…ఆఫీస్ లో అడ్వాంటేజ్ తీసుకునే మగ జాతి చూపులను…స్పర్శ లను తట్టుకొని కళ్ళ నీళ్ళు సుడులు తిరుగుతున్న కూడా తన భర్త తిరిగి ఆరోగ్యవంతుడు కావాలని…పూర్వ స్థితిలో ఇద్దరు కారులో తిరగాలని…కోటి దేవతలకు మొక్కుకున్నా కూడా ఆమెకు మగ రాక్షసుల కిరాతక చర్యలు ఎన్నోసార్లు తనువు చాలించాలని అనిపించింది… లిఫ్ట్ ఇస్తానని ఒకడు… నీ అంత గొప్ప అందగత్తె లేదని మరొకడు, డబ్బు సహాయం చేస్తాను నీకు సమస్యలు ఉండవనే వాళ్ళ పిచ్చి చూపులను తట్టుకొని లేని నవ్వును పులుముకొని అటు భర్త కోసం, ఇటు చిన్నారి కోసం…పరితపిస్తున్న హృదయ వేదన ఏ ఆడ పిల్లకు ఉందొద్దని మౌన రోదన ఆమెది!… సానుభూతి, మాత్రం చూపి… పక్కన వంద దీర్ఘాలు తీసే కిరాతక బంధు జనాల మాటలను తట్టుకుంటూ…ఇటు దుర్యోధన దుశ్శాసన వికటాట్టహసాలతో పోరాడుతూ …జీవనగమనం చేస్తున్న పరిమళలు వందల మంది ఉంటారు!! కానీ ఆడదాని శీలానికి విలువ కట్టే కిరాతక మగ సామ్రాజ్యం లో అసలైన పతివ్రత గా నిలవడానికి ఆడపిల్లలు పడే బాధలు వర్ణనతీతంగా ఉంటాయి!!


ప్ర‌వ‌రాఖ్యులే ఎక్కువ‌
అడుగడుగున అందగత్తెలు… ఆఫీసు లో మంచి హోదా!! హెచ్ ఆర్ బోర్డు డైరక్టర్…అంటే మొత్తం ఉద్యోగం ఇంటర్వ్యూ అయ్యాకా ఆపాయింట్మెంట్ ఇచ్చే ముందు ఆ అభ్యర్థి నీ చూసి కంపెనీ నియమ నిబంధనలు వివరించి కంపెనీలో జాబ్ అలాట్ చేసే ఉన్నత ఉద్యోగం…సౌత్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ల కు ఈయన అంటే గౌరవం… ముప్ఫై ఐదేళ్ల కే గౌరవ ప్రదమైన పోస్ట్…ఆయన ఛాంబర్ పెద్ద హాల్ లాగా ఉంటుంది…ఆ హల్ ఎంత విశాలంగా ఉందో ఆయన హృదయం కూడా అంత విశాలం..ఎంప్లాయిస్ పనికి దగ్గ వేతనం తో పాటు బెనిఫిట్స్ ఇవ్వాలని తపన గలవాడు…ఆయన మృదుబాషి! ఆడపిల్ల తన ముందు కూర్చుంది అంటే ఆమె వైపు కళ్లెత్తి కూడా చూడడు…ఆయన గదిలోకి వచ్చే ముందు…బయట సిసి కెమెరాల్లో ఆమె హావభావాలు చూస్తాడు…ఆ విషయం అమ్మాయిలకు తెలియదు…వీడేం ప్రవరాఖ్యుడు ఎటో చూస్తూ మాట్లాడుతాడు” అనుకునే అమ్మాయిలే ఎక్కువ!! తీరా జాబ్ లోకి చేరాక ఆయన అంటే అమ్మాయిలకు హడల్…పిచ్చి పిచ్చి వేషాలు వేసే అమ్మాయిల ఉద్యోగంలో నుండి తొలగిస్తాడని అమ్మాయిలకు రెండు మూడు రోజులకే కొలీగ్స్ ద్వారా అర్థం అయ్యింది…అయినా కూడా ఆయన పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడాలని కోరుకునే ఆడవారే ఎక్కువ! సంసారం చేస్తున్న అమ్మాయిలు కూడా తన భర్త ఇంత రిజర్వు గా ఉండాలని అనుకుంటారు…కంపెనీ వీకెండ్స్ ప్రోగ్రాం లలో లేదా రివ్యూ మీటింగ్ లలో ఆయన సరదాగా మాట్లాడుతూనే, కంపెనీ డెవలప్ మెంట్ యాక్టివిటీస్ మీద పొకస్ చేస్తారు…ఆయన రివ్యూ మీటింగ్ లు అన్నింటికీ పొల్లుపోకుండా మంచిగా అలంకరించుకుని చాలా మంది అమ్మాయిలు హాజరవుతారు!! ఆయన చెబుతున్న మాటలు…ఇంప్రెసివ్ గా ఉంటాయి..విషయ పరిజ్ఞానం తో విడమరిచి చెబుతున్న తీరుకు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కళ్ళప్పగించి వింటుంటారు. శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాల గురించి ఆయన చెబుతూ కంపెనీ అభివృద్ధికి ఆయన ఇచ్చే కంక్లూజన్ అంటే అందరికీ ఇష్టం!! ఒక్క మాటలో చెప్పాలంటే…


కనుల పండుగ నీ సమ్మోహన రూపం,
అందనంత ఎత్తులో ఆలయ శిఖరం,
ఆ శిఖరమంత ఎత్తున మహామనిషి వ్యక్తిత్వం,
జనం కోసం కారణజన్ముడు కదిలి వస్తున్నట్లున్న
దివ్య మనోహర శిల్పం!!
ఆ శిల్పానికి పడిపోని వరూధిని లు ఉంటారా? కానీ ఆయన వ్యక్తిత్వం మన్మధ రూపంతో పాటు… ప్రవరాఖ్య వ్యక్తిత్వం!! ఆయనలాంటి వారి ముందు ఎక్కడ చులకన అయ్యి మాట పడితే తమ కొలీగ్స్ అమ్మాయిల ముందు తలవంచాల్సి వస్తుందని అమ్మాయిలు వింటారు తప్ప మాట్లాడరు…
ఆడ‌పిల్లలు ఎలా ఉండాలి?
అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలి? అనే దాని మీద ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ ఆయన భార్యను చూడాలి అని అనిపించేలా అమ్మాయిలకు తోచింది…”అమ్మాయిలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి అత్మ విశ్వాసం పెంచుకుంటే విజయం మీదే!!”చాలా మంది అమ్మాయిలూ
వరూధిని చాలా స్ట్రాంగ్ గా ఉంటారు.. కానీ పరిస్థితులను బట్టి కరిగిపోతూ ఉంటారు… నిజానికి ఆడవాళ్లు చేసే తప్పు అదే. తండ్రి దగ్గరో, అన్న దగ్గరో, భర్త దగ్గరో, కొడుకు దగ్గరో… ఎవరో ఒకరి దగ్గర ప్రేమ కోసమో, భద్రత కోసమో ఫిదా అవుతారు… ఆ తరువాత తమ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి వాళ్లకోసం తమను తరువాత తాము మార్చేసుకుంటారు. మనవాళ్లకు తగ్గట్టుగా మనల్ని మలచుకోవడంలో తప్పు లేదు కానీ మనం మనం కాకుండా పోవడాన్ని మాత్రం నేను ఇష్టపడను. మనం ఇష్టపడ్డ ఆ ఒక్క క్షణం మన జీవితాన్నే మార్చిపారేస్తుందని ఆడవాళ్లు మర్చిపోకూడదు!! అన్న మాట ఆ మీటింగ్ లో వింటున్న అమ్మాయిలు తమకు తాము అన్వయించు కుంటున్నారు.


లోప‌ల మ‌మ‌త‌-పైన క‌ల‌త‌
“మీరంటే ఇంత క్రేజ్ ఉందని…ఎవరో అనగా విన్నాను…ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇంటికి వస్తారు…నేను ఒక్క సారి మీ రివ్యూ మీటింగ్ లకు రావాలని ఉందండి… అన్న భార్య వంక చూసి…”బంగారం ఆడవారు తమ అనురాగంలో ఎక్కువగా అనుమాన పడుతుంటారు…
లోపల మమత – పైన కలతతో సతమతమవుతూ ఉంటారు
అందుకే…నిన్ను బోర్డు మీటింగ్ లకు వద్దంటాను…అది ఆఫీసు లైఫ్ ఇది ఇంటి లైఫ్ అన్నాడు…”ఒక్కటి అండి..”తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయనీ అంటారు.
వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయనీ కూడా అంటారు” ఇంత ప్రేమ గా చూసుకునే నన్ను ఒక సారి బోర్డు మీటింగ్ కు తీసుకు వెళితే తప్పేమిటి అన్న సీత మాటలు కాదనలేక… ఇప్పుడు జరిగిన బోర్డు మీటింగ్ లో ఒక ఎంప్లాయ్ గా హాజరైంది సీత! వందల మంది అమ్మాయిల్లో ఆమె ఒకరు…”సార్ చెప్పిన హితోక్తులు విని ఆయన తో షేక్ హ్యాండ్ ఇవ్వాలని బయట నిలబడ్డ అమ్మాయిలు పాతిక మంది వరకు ఉన్నారు…
దూరంగా సీత ఆఫీస్ కారిడార్ లోని అశోక వృక్షం క్రింద నిలబడి చూస్తుంది! పొడుగైన జడ, బ్లాక్ సారీలో మెరూన్ బ్లూ జాకెట్ తో నిగనిగ మెరిసి పోతున్న సీత ఈయన భార్య అని ఎవరికి తెలియదు…ఆయన బయటకు రాగానే అమ్మాయిలు ఆయన వైపు తిరిగాను…ఆజానుభావుడు… అరవింద దళక్షుడు
నడిచి వెళుతూ, అమ్మాయిల వైపు ముకుళిత హస్తాలు జోడించి మరో మాటకు తావివ్వకుండా బయటకు వచ్చాడో లేడో…డ్రైవర్ బ్లాక్ కలర్ కారు ను తీసుకొచ్చి ఆయన ముందు నిలిపాడు. కళ్ళతో ఎప్పుడూ సైగ చేశాడో తెలియదు…విలాసంగా సీత కారు దగ్గరికి వచ్చి కుడి వైపు డోర్ తెరిచి భర్త వైపు కూర్చుంది…అప్పుడు చూశారు అమ్మాయిలు…ఇంత సేపు మనతో కూర్చున్న అమ్మాయి ఈయన భార్య నా అని…వెనక కారు అద్దంలో నుండి అమ్మాయిలు చూస్తుండగా భర్త పై చెయ్యి వేసి అటు వైపు చూస్తుండగా ఇది పబ్లిక్ ప్లేస్ బంగారం అనగానే సుతారంగా చెయ్యి తీసి నా మొగుడు బంగారం అని. మనసులో అనుకుంటుండగా కారు వేగం పెరిగింది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...