మంటాడా నుంచి మన్ హటన్ దాకా
విజయవాడ: ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్ హటన్ పుస్తకాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత ధూపాటి విజయకుమార్, సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, మండలి వైస్ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, కొణతాల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేసారు కాన్సర్ పరిశోధనలో ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఆయన న్యూయార్క్ లోని ప్రేబెటెరియన్ హాస్పిటలు రేడియేషన్ ఆంకాలజీ విభాగానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

అలాగే, న్యూ యార్క్ హాస్పిటల్ ఆంకాలజీ యూనిట్ కు చైర్మన్ కూడా. డాక్టర్ నోరి తన జీవన యానం నేపథ్యంలో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా వ్యూస్ సమర్పిస్తున్న దృశ్య మాలిక ఇది..











(Photos Courtesy: T. Srinivasa Reddy, Photo India, Vijayawada)