దుబాయ్: మెన్ ఇన్ బ్లూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు చేరింది. ఆస్ట్రేలియా జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. రేపటి మ్యాచ్ విజేతతో ఈనెల తొమ్మిదిన ఫైనల్లో తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఇంకా మూడు బంతులు మిగిలిఉండగానే 264 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత జట్టు 58 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడి ఆటను గాడిలో పెట్టారు. కోహ్లీ 87 పరుగులకు అవుటయ్యాడు. ఆ సమయానికి భారత్ విజయానికి 47 పరుగుల దూరంలో ఉంది. ఈ దశలో కె.ఎల్. రాహుల్ కు హార్దిక్ పాండ్య తోడయ్యాడు. ఇద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాహుల్ 40 runs నాటవుట్ గా నిలిచారు. హార్దిక్ 28 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ జట్టులో జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.
👌👌👌 టీం ఇండియా సమిష్టిగా రాణించి ఫైనల్స్ కు తీసుకు వచ్చారు.All the best team India.