రాంగోపాలాయణం … ఇది రామాయణం కాదు

1
258

రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం. అవరోధాలను అధిగమించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి సమస్య ఎదురైనా ఆయన తొణకరు బెణకరు. కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెడతారు. తన వల్ల ఒకరికి మంచి జరుగుతుందీ అంటే ముందుంటారు. ఆయన ట్వీట్లు చూసిన వారు, ఆశ్చర్యపోయేవారు సైతం ఒక్కసారి కలిస్తే, ఆర్జీవీ పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. తనకోసం మాత్రమే జీవిస్తానని గర్వంగా చెబుతారు. అలాంటి వర్మ గారిపై ఇంతవరకూ నాలుగు పుస్తకాలు వచ్చాయి. ఆర్జీవీ స్వయంగా నా ఇష్టం శీర్షికతో ఒక పుస్తకాన్ని రాశారు. ఆర్జీవీ ట్వీట్లు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు ఒక చోట చేర్చి బ్లూ బుక్ పేరిట కాంత్ రిసా మరొక పుస్తకాన్ని రచించారు. రేఖ పర్వతాల వర్మ… మాకేంటి ఖర్మ పేరుతో ఇంకొక పుస్తకాన్ని రాశారు. మరొక ఔత్సాహికుడు ప్రవీణ్ ఇంటెలిజెంట్ ఇడియట్ పేరుతో వర్మపై విశ్లేషణాత్మక రచన చేశారు. ఇప్పుడు యనమల ప్రకాష్ అనే యువకుడు రాంగోపాలయాణం … ఇది రామాయణం కాదు శీర్హిక పెట్టి మరొక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం హైద్రాబాదులో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాలన్నీ వర్మ ఆంతర్యాన్నీ, ఆయన ఆలోచన శైలిని ఆవిష్కరించేవే. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు చిలిపిగా ట్వీట్లు చేస్తుంటారు. శివ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమకు కొత్త దిశను నిర్దేశించారు. జి.ఎస్.టి.లాంటి సినిమా తీసినా… క్షణక్షణం లాంటి సినిమా తీసినా… రక్తచరిత వంటి ఫ్యాక్షన్ మూవీస్ అయినా ఆయనకే చెల్లు. ఎందుకండీ చెత్త సినిమాలు తీస్తారు అని ఎవరైనా ప్రశ్నిస్తే, నా ఇష్టం అంటారు… ఇంకా మాట్లాడితే నేను మిమ్మల్ని సినిమా చూడమని అడిగానా అని ప్రశ్నిస్తారు. ఎవరి ఊహకూ అందని వర్మ మనస్తత్వాన్ని ఇప్పుడు ప్రకాష్ తన రచనలో ఎలా ఆవిష్కరించాడో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here