ఆర్జీవీ – నాని నడుమ వాగ్బాణాలు
పరస్పర విమర్శలతో పరిష్కారం సాధ్యమా!
(Rgv & Perni nani Tweets)
సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు, సినీ పెద్దలకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నడుమ కేంద్రీకృతమైంది. ఓ టీవీ చానెల్ డిబేట్‌లో నాని మాటల ధాటితో థ్యాంక్స్ చెప్పి తప్పుకున్న ఆర్జీవి ఇప్పుడు ట్విటర్ వేదికగా బాణాలను సంధిస్తున్నారు. ఒక్కవిషయం మాత్రం నిజం. ట్విటర్ వేదికలో ఎప్పుడూ ఆర్జీవీదే పైచేయి అవుతూ వస్తోంది. ఆర్జీవీ ప్రశ్నలలో లాజిక్ ఉంటుంది. ప్రభుత్వం తరపున మాట్లాడే నాని మాటల్లో వాస్తవం ఉంటుంది. వాస్తవానికీ-లాజిక్‌కీ ఎప్పుడూ పొంతన కుదరదు. లాజికల్‌గా చూస్తే నిజమనే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి దూరంగా కనిపిస్తుంది. ప్రేక్షకుడికీ నిర్మాతకీ మధ్య ప్రభుత్వం ఎందుకు అనేది ఆర్జీవీ ప్రశ్న. ప్రేక్షకుల్నించి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రభుత్వ వాదన.
.నిజంగా ఆలోచిస్తే ఆర్జీవీ వాదన వాస్తవమనిపిస్తుంది. ప్రేక్షకుడివైపు నుంచి ఆలోచిస్తే ప్రభుత్వ వాదన నిజమనిపిస్తుంది. ఇక్కడే ప్రభుత్వం లాజిక్ మిస్సయ్యిందేమోనని అనిపించక మానదు. కారణం… ప్రేక్షకుడికి లేని నొప్పి ప్రభుత్వానికి ఎందుకు అనిపించకమానదు. ఈ క్రమంలో ట్వీట్లతో ఒక మోస్తరు యుద్ధమే జరిగిపోయింది. ట్విటరైట్లు కూడా రెండుగా చీలిపోయారు. ఆర్జీవీ ఒక అడుగు ముందుకేసి, కొడాలి నాని అంటే ఎవరు నాకు తెలీదు అంటూ సెటైర్ కూడా వేశారు. తాజాగా శ్రీరెడ్డి కూడా రంగంలోకి దిగారు. వైసీపీ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఆర్జీవీకి వార్నింగ్ ఇచ్చారు.
ఆర్జీవీ మాట్లాడిన ప్రతి మాట తనకు ఆ అంశంపై అవగాహన ఉంటే తప్ప మాట్లాడరు. ఐస్ క్రీమ్ చిత్రానికీ, బాహుబలికి ఒకే రకమైన టికెట్లు ఎలా సాధ్యమన్న ఆర్జీవీ ఒక అడుగు ముందుకేసి,, పవన్ కల్యాణ్, సంపూర్ణేష్ బాబు చిత్రాలనూ వేదికపైకి తెచ్చారు. సోషల్‌మీడియాలో దీనిపై పెద్దపెద్ద సెటైర్లే పేలాయి. ఆర్జీవీ చిత్రాల కంటే సంపూ చిత్రాల కలెక్షన్లే ఎక్కువంటూ వ్యాఖ్యానాలూ చేశారు. నిత్యం వివాదాల్లో ఉండాలనుకునే ఆర్జీవీకి సినిమా టికెట్ల వ్యవహారం అందొచ్చింది. ఏకంగా ప్రభుత్వంతోనే కయ్యం పెట్టుకున్నారు. తనకు పేర్ని నాని అంటే అపారమైన గౌరవం ఉందంటూనే సంధించాల్సిన ప్రశ్నలను వదిలారు ఆర్జీవి. సినిమా హీరోలకు ఇచ్చే పారితోషికం నుంచి డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాల వరకూ అన్ని అంశాలూ వారి ట్వీట్ల మధ్య ప్రస్తావనకు వచ్చింది. తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే డిబేట్‌కు సిద్ధమన్న ఆర్జీవీ సవాలుకు పేర్ని నాని అంగీకరించారు. వీరిద్దరి మధ్య నడిచిన ట్వీట్ల యుద్ధానికి ఈ డిబేట్‌తో తెరపడుతుందా? ఆర్జీవీని పేర్ని లొంగదీసుకుంటారా? ఆర్జీవీ పేర్ని నానీని తన వాగ్ధాటితో సమాధాన పరుస్తారా తేలాల్సి ఉంది. నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ .. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.’ అని రాంగోపాల్ వర్మ మంత్రి పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు
టికెట్లపై ట్వీట్ల యుద్ధం
Date: