అంచనా కంటే తక్కువ ఖర్చు ఊహించగలమా?

Date:

శత వసంతాల హేవలాక్
పర్యాటక వినోదాల సన్నిధి
(వాడవల్లి శ్రీధర్)
అంచనా కంటే తక్కువ ఖర్చు కావడం ఈరోజుల్లో ఊహించగలమా? ఆ రోజుల్లో అది సాధ్యమయ్యేది. నూట ముపై ఏళ్ల క్రితం రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెన దీనికి సాక్ష్యం. అంచనా వ్యయం కంటే దాదాపు మూడు లక్షల రూపాయలు తక్కువ ఖర్చయ్యింది. ఆ వంతెనకు ఆ పేరు ఎలా వచ్చింది. మొదటి రైలు ఎప్పుడు ప్రయాణించింది.. చివరి రైలు ఏమిటి? వంటి విశేషాల సమాహారమే ఈ వ్యాసం.
వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరితగల సుందర నగరం గత వైభవ దీప్తికి చరిత్రకు సాక్షిగా నిలిచింది హేవలాక్ బ్రిడ్జి గోదావరిపై బ్రిటీషర్స్ కట్టిన తొలి బ్రిడ్జి 135 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.


అంతకు ముందు కేవలం పడవలే..
అప్పట్లో బ్రిటీష్ వారి ప్రధాన స్థావరాలైన మద్రాస్ – కలకత్తా మధ్య ఈ బ్రిడ్జి నిర్మించడం ద్వారా రవాణా అనేది సులువుగా మారింది. గోదావరిని సురక్షితంగా దాటడానికి ప్రజలకు కూడా ఒక రవాణా సాధనం లభించినట్లు అయింది. దీనికి ముందు పడవల ద్వారానే గోదావరిని దాటేవారు. గోదావరి ఉద్ధృతంగా ఉన్నప్ప్పుడు ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరిగేది. అలాంటి వాటికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చెక్ పెట్టింది.
శ‌తాబ్ద‌కాలం సేవ‌లందించి…
హేవ‌లాక్ వంతెన నిర్మాణ‌ ప‌నులు 1887లో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పర్యవేక్షణలో ప్రారంభించారు. అలా మూడేళ్లకు అంటే, 1890 ఆగస్టు 30 నాటికి 2.95 కిలోమీటర్ల పొడవుతో 56 స్తంభాలతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి ఇంజినీర్‌ ఎఫ్‌.టి.జి.వాల్టన్‌ పనులను పర్యవేక్షించగా బ్రిటిష్‌ మేజర్‌ హేవలాక్‌ వంతెనగా పేరు పెట్టారు. అప్పట్లో బ్రిడ్జి పై ట్రైన్ వెళుతుంటే అందులోని ప్రయాణికులు థ్రిల్ గా కూడా ఫీలయ్యేవారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధానంగా రాయి, స్టీలుని వాడారు. బ్రిడ్జి పొడవునా మొత్తం 56 స్తంభాలు ఉంటాయి. ఈ వంతెన పై మొట్టమొదట మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం చేసినట్లు రికార్డులో నమోదయింది. 100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెన పై సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది. చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించినట్లు రికార్డ్ నమోదయింది.


ఒక అపురూపమైన జ్ఞాపకం
సరిగ్గా ఈ రోజుకి 135 సంవత్సరాలు అయిన చరిత్రాత్మక కట్టడం. రాజమండ్రి..కొవ్వూరు కు మధ్య నిర్మించిన హేవలాక్ బ్రిడ్జి ఆ మహనీయుల కు వందనం! ఈ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులు
• శంకు స్థాపన: 11-11-1897 ప్రారంభం 30 ఆగస్టు 1900
• ప్రారంభించిన వారు : మద్రాసు గవర్నర్ హేవ్ లాక్
• తొలి రైలు ప్రయాణం: 6-8-1900 తొలి రైలు : హౌరా మెయిల్
• వర్క్ ఇంజనీర్: ఎఫ్.టి.జి. వాల్షన్
• విస్తీర్ణం : 23 వేల చ”అ”
• వెయ్యి చ”అ” రెండు సార్లు ఐన రంగు ఖర్చు: 11రూపాయల 5అణాల 9పైసలు
• బ్రిడ్జి నిర్మాణానికి అంచనా : రూ.50,40,457
• అయిన ఖర్చు: రూ.46,89,849
• మిగులు : రూ.3,56,698
• బ్రిడ్జి పొడవు : 9,096 అడుగులు స్థంభాలు : 56


పర్యాటక కేంద్రంగా అభివృద్ది :
1085.59 చదరపు గజాల స్థలాన్ని 2583.33 చదరపు గజాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వం ఏకంగా రైల్వే శాఖకు 18 కోట్ల రూపాయలు చెల్లించి మరీ స్వాధీనం చేసుకుంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జిని తొలగించవద్దని.. పర్యాటక స్దలంగా ఆభివృద్ది చెయ్యాలని ఆ ప్రాంత వాసులు ప్రభుత్వాన్ని కోరారు ఈ బ్రిడ్జి పైన రోడ్డు వేసినట్లయితే.. అది సైకిల్ పై రాజమండ్రి వచ్చే చిరు వ్యాపారులకు, రైతులకు లాభిస్తుందని వివరించారు. వాకింగ్ చేసేవారికి కూడా అందుబాటులోకి వస్తుందని, బ్రిడ్జి పైన చిన్నచిన్న దుకాణాలను ఏర్పాటు చేసి మార్కెట్ ను ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. దీని వల్ల రాజమండ్రికి పెద్ద టూరిజం ఆకర్షణగా హేవ్ లాక్ బ్రిడ్జి మారుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా స్తబ్దత నెలకొంది. ఈ అడ్డంకులన్నీ తొలగి త్వరలోనే హేవలాక్ బ్రిడ్జి ని పాదచారులకు అందుబాటులోకి తెస్తారని గోదావరి జిల్లాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చిరకాల కోరిక తీర్చాలని వేడుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ ప్రోగ్రామ్ కింద,
గోదావరి నదిపై నిర్మించిన హేవ్‌లాక్ బ్రిడ్జి, గతంలో గోదావరి పాత వంతెనగా పేరుగాంచింది, ఇది మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. గోదావరి పాత వంతెనను పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రతిపాదన నెమ్మదిగా ఊపందుకుంటోంది. దాని వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) కూడా రూపొందింపబడినది, త్వరలో ఒక బృందం ఈ ప్రదేశాన్ని,ప్రాంతాన్ని సందర్శించనుంది. అఖండ గోదావరి ప్రాజెక్టు పథకం కింద దీనిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. ఈ ప్రాజెక్ట్ రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఒడ్డున, ద్వీపంలోని గ్రామాలతో పాటు ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలను కూడా పరివర్తన చేస్తుంది. అలాగే, రిసార్ట్స్, రివర్ క్రూయిజ్ వంటి ఇతర పర్యాటక సౌకర్యాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ దిశగా చర్యలు తీసుకునేందుక్య్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఉభయ గోదావరి జిల్లాల ప్ర‌జ‌ల‌తోపాటు ప‌ర్యాట‌క ప్రేమికులు సైతం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అప్పట్లోనే హేవలాక్‌ వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.110 కోట్లతో ప్ర‌ణాళిక‌లు వేశారు. పాదచారులతో పాటు యోగ, వ్యాయామం చేసుకునేలా, వంతెనపై సాయంత్రం నుంచి రాత్రి వరకు మార్కెట్‌, అఖండ గోదావరి ప్రాజెక్టులో లంకలను అనుసంధానం చేసి అతిథి భవనాలు నిర్మించాలని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చేది ఈ రెండు ప్రాంతాలేన‌ని అంద‌రికీ తెలుసు. పశ్చిమ, తూర్పు జిల్లాల సాంస్కృతిక, వ్యాపారాభివృద్ధి తోపాటు ప‌ర్యాట‌క రంగానికి కూడా ఇక్కడ మంచి ఆద‌ర‌ణ ఉంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాలో ఉన్న బ్రిటీష్ కాలంనాటి వంతెన‌పై నేడు ప‌ర్యాట‌క శోభ సంత‌రించుకోనుంది. శ‌తాబ్ద కాలంగా కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరి నదిపై నిర్విరామంగా త‌న సేవలను అందించిన హేవలాక్‌ వంతెన ఇప్పుడు ప‌ర్యాట‌క‌ సంద‌ర్శ‌నీయ ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది.పురాణ ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక శోభ‌ కొవ్వూరు, రాజమహేంద్రవరం సొంత‌మ‌నే చెప్పాలి. అలాగే, వంతెన పర్యాటకంగా అభివృద్ధి చెందితే ప‌ర్యాట‌క ప్రేమికులు ఆనందానికి అవ‌దులు ఉండ‌వు. రాష్ట్రంలో కొలువుదీరిన నూత‌న ప్ర‌భుత్వం ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ ఆలోచ‌న‌లు కార్య‌రూపం దాల్చితే మాత్రం రాష్ట్రానికే హేవ‌లాక్ వంతెన‌ ప‌ర్యాట‌క మ‌ణిహారంగా మారుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...