చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ
కాలనీని పరిశీలించిన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్
శిల్ప కాలనీ, అమీన్ పూర్: చేతన ఫౌండేషన్, శిల్ప రెసిడెంట్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నాడు 78 వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాలనీలోని అపార్ట్మెంట్స్ వాచ్ మెన్లకు దోమతెరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఎం. శేషగిరిరావు, చేతన సంస్థ సభ్యులు శ్రీమతి మాధవి, శ్రీమతి రమణి, ప్రశాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు. డాక్టర్ వైజయంతి పురాణపండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవసరం ఉన్నచోట తాము ఉంటామని, చేతనైన మేరకు సాయం అందిస్తామని వెనిగళ్ల రవికుమార్ చెప్పారు. ఐకమత్యంగా ఉంటే, సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయన్నారు. కాలనీ సమస్యల పరిష్కారానికి తమవంతు చేయూతను ఇస్తామని వెల్లడించారు. ప్రస్తుత కాలంలో ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాల్సిన స్థితి నెలకొందన్నారు.



ప్లాట్ ఓనర్ సంఘం సభ్యులు శేషగిరిరావు మాట్లాడుతూ, కాలనీ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందనీ, తమ సంఘం తరపున తమ వంతు సాయం చేస్తామని చెప్పారు. శ్రీమతి రమణి మాట్లాడుతూ, ఈ కాలనీ చూస్తుంటే కొన్నేళ్ల క్రితం నాటి తమ గ్రామం గుర్తుకు వచ్చిందని చెప్పారు. కాలనీ సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెడతామని చెప్పారు.

శిల్ప రెసిడెంట్స్ సొసైటీ వాసులు వెనిగళ్ల రవికుమార్ ను సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. కాలనీ వాసులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిన్నారులు సందడి చేశారు.
PHOTO COURTESY: T. NIRANJAN. MOB: 7386566966










