ఫ్యాషన్‌ నగరి పారిస్‌లో నేటి నుంచే విశ్వ క్రీడోత్సవం

Date:

(Vadavalli Sridhar)

విజేతలు ఎవరైనా ప్రపంచ మేటి క్రీడాకారుల అత్యుత్తమ నైపుణ్యాలను చూసే అభిమానులది మాత్రం గొప్ప అదృష్టం!నాలుగేళ్లకోసారి ఆ అదృష్టాన్ని కల్పించే విశ్వ క్రీడాసంబరం మళ్లీ వచ్చేసింది. ఫ్యాషన్‌ నగరి పారిస్‌లో నేటి నుంచే పతకోత్సవం! జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు. అందరూ ఇక్కడే కలిసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే పారిస్ ఒలింపిక్స్ పోటీలను . 1900, 1924 సంవత్సరాలలో ఫ్రాన్స్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం వందేళ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. విశ్వ క్రీడలు కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ ఏర్పాట్లు చేస్తోంది .క్రీడాకారులని ఏకతాటిపైకి తెచ్చి వారికి ఆశను ఇచ్చే దాని కోసం వెలిగిస్తున్న ఒలింపిక్ జ్వాల ఈ ఆశకు ప్రతీక”ఆటలు విస్తృతంగా బహిర్గతమవ్వాలి అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహించనున్నారు

విశ్వ క్రీడల్లో ( ఒలింపిక్స్) భారత ప్రస్తానం
1900వ సంవత్స రంలో మొదలైంది. ఆ క్రీడల్లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్థ్లె తో పాల్గొం ది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్థ్లె (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల200 మీటర్ల రన్నిం గ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్ ర్డి లో పాల్గొని రెండు రజత పతకాలుసాధించాడుభారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లథ్లె తోట్ల ఒలింపిక్స్లో పాల్గొం ది. బెల్జియం ల్జి లో జరిగిన ఆ ఎడిషన్లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లుథ్లె ట్లురెండుక్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్లో కూడా భారత్కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్లో భారత్ 12 మంది అథ్టెట్లనుట్ల బరిలోకి దించినాప్రయోజనం లేకుండా పోయింద

భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్స్ట డామ్ ఒలింపిక్స్లో సాధించింది. ఆ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగాగోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టిం చింది. 1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్లో (1932, 1936,1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేనిమహారాజులా కొనసాగింది. 1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారి రెజ్లిం గ్లో పతకం సాధించింది. ఆ క్రీడల్లో పురుషుల ఫ్రీ స్టయిస్ట ల్ రెజ్లిం గ్లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్థ్లె గా చరిత్ర పుటల్లో కెక్కా డు.1960 రోమ్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్లో భారత్కు లభించిన ఏకైక పతకం ఇదే. 1964 టోక్యో ఒలింపిక్స్లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కిం చుకుంద1968 మెక్సికో, 1972 మ్యూ నిచ్ ఒలింపిక్స్ వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. 1976 మాంట్రియాల్ ఒలింపిక్స్ భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ క్రీడల్లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.

తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాం టా ఒలింపిక్స్లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వల్లే రి కాంస్య పతకం సాధించింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్లో రాజ్యవర్దన్ర్ద సింగ్ రాథోడ్ భారత్ ఆ క్రీడల్లో ఏకైక పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఆ క్రీడల్లో భారత్ ఓ గోల్డ్ మెడల్తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లిం గ్లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సిం గ్లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.
2012 లండన్ ఒలింపిక్స్లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సిం గ్లో మేరీ కోమ్, పురుషుల రెజ్లిం గ్లోయోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు. 2012 ఒలింపిక్స్లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్లో మళ్లీ మొదటికొచ్చిం ది. ఈ క్రీడల్లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు రజతం, మహిళలరెజ్లింగ్లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.

120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్లో సాధించింది. ఈ క్రీడల్లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్,ల్డ్ రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్
ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టిం గ్లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లిం గ్లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మిం టన్లో పీవీ సింధు, మహిళల బాక్సిం గ్లో లవ్లీనావ్లీ బోర్గోహెయిన్, పురుషుల రెజ్లిం గ్లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి. భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం.

జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొం టుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుం దో వేచి చూడాలి.

క్రమ సంఖ్య క్రీడ పురుషులు స్త్రీలు క్రీడాకారులు
1 అథ్లెటిక్స్ 18 12 30
2 షూటింగ్ 10 11 21
3 ఫీల్డ్ హాకీ 16 0 16
4 బ్యాడ్మింటన్ 4 3 7
5 విలువిద్య 3 3 6
6 రెజ్లింగ్ 1 5 6
7 బాక్సింగ్ 2 4 6
8 టేబుల్ టెన్నిస్ 3 3 6
9 గోల్ఫ్ 2 2 4
10 టెన్నిస్ 3 0 3
11 సెయిలింగ్ 1 1 2
12 స్విమ్మింగ్ 1 1 2
13 రోయింగ్ 1 0 1
14 వెయిట్ లిఫ్టింగ్‌లో 0 1 1
15 జూడో 0 1 1
16 గుర్రపుస్వారీ 1 0 1
మొత్తం 66 47 113

క్రమ సంఖ్య సంవత్సరం, వేదిక స్వర్ణ రజత కాంస్య మొత్తం
1 1900 పారిస్ 0 2 0 2
2 1904 సెయింట్ లూయీస్ పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు
3 1908 లండన్ పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు
4 1912 స్టాక్‌హోం పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు పాల్గొనలేదు
5 1920 ఆంట్‌వెర్ఫ్ 0 0 0 0
6 1924 పారిస్ 0 0 0 0
7 1928 ఆంస్టర్‌డాం 1 0 0 1
8 1932 లాస్ ఏంజిల్స్ 1 0 0 1
9 1936 బెర్లిన్ 1 0 0 1
10 1948 లండన్ 1 0 0 1
11 1952 హెల్సింకీ 1 0 1 2
12 1956 మెల్బోర్న్ 1 0 0 1
13 1960 రోం 0 1 0 1
14 1964 టోక్యో 1 0 0 1
15 1968 మెక్సికో సిటీ 0 0 1 1
16 1972 మ్యూనిచ్ 0 0 1 1
17 1976 మాంట్రియల్ 0 0 0 0
18 1980 మాస్కో 1 0 0 1
19 1984 లాస్ ఏంజిల్స్ 0 0 0 0
20 1988 సియోల్ 0 0 0 0
21 1992 బార్సిలోనా 0 0 0 0
22 1996 అట్లాంటా 0 0 1 1
23 2000 సిడ్నీ 0 0 1 1
24 2004 ఎథెన్స్ 0 1 0 1
25 2008 బీజింగ్ 1 0 2 3
26 2012 లండన్ 0 2 4 6
27 2016 రియో డి జెనీరో 0 1 1 2
28 2020 టోక్యో 1 2 4 7
మొత్తం 9 6 11 35

తొలిసారిగా స్టేడియం వెలుపల ప్రారంభవేడుకలు…
జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ 16రోజులపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ ను వినూత్నంగా నిర్వహించనున్నారు. స్టేడియాలలోనే నిర్వహించే ప్రారంభ వేడుకల సాంప్రదాయాన్ని తప్పించి వెలుపల నిర్వహించడానికి పారిస్ గేమ్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకలను స్టేడియంలో కాకుండా ఫ్రెంచ్ రాజధాని శివారులో ఉన్న సీన్ నది తీరంలో నిర్వహించడానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

సీన్ నదిలో 6 కిలోమీటర్ల దూరం పడవల పరేడ్ తో ప్రారంభవేడుకలు నిర్వహించనున్నారు. ప్రారంభవేడుకలకు కేవలం 3 లక్షల 25వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రారంభవేడుకల కవాతులో పాల్గొనే ఒక్కోజట్టుకు ఒక్కో బోటును కేటాయించారు. బోట్ల కవాతు సీన్ నదీ తీరంలోని ఆస్టర్ లిడ్ వంతెన వద్ద మొదలై..రెండు ద్వీపాలను చుట్టి వచ్చి..ట్రోకాడెరోలో ముగియనుంది. భద్రత కారణాల దృష్ట్యా ప్రారంభ వేడుకలను సెయింట్ డెన్నిస్ లోని స్టేడియం ఫ్రాన్స్ లో కాకుండా సీన్ నదీతీరంలో నిర్వహించాలని నిర్వాహకులు ఆతిధ్య దేశం నిర్ణయిం చారు.

సరికొత్త క్రీడ బ్రేక్ డాన్సింగ్…. పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారిగా బ్రేక్ డాన్సింగ్ క్రీడను పతకం అంశంగా ప్రవేశపెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో నిర్వహించిన కరాటే, సాఫ్ట్ బాల్, బేస్ బాల్ అంశాలకు పారిస్ ఒలింపిక్స్ క్రీడాంశాలలో చోటు దక్కలేదు. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లయింబింగ్, సర్ఫింగ్ క్రీడలకు పారిస్ ఒలింపిక్స్ ప్రధాన క్రీడల జాబితాలో చోటు దక్కింది. 2018 యూత్ ఒలింపిక్స్ లో తొలిసారిగా నిర్వహించిన డ్యాన్సింగ్ కమ్ బ్రేక్ డ్యాన్సింగ్ క్రీడను వేసవి ఒలింపిక్స్ లోనూ తొలిసారిగా పతకం అంశంగా నిర్వహిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లోని నాలుగు అంశాలను తొలగించి..కనోయింగ్ విభాగంలో రెండు అంశాలను అదనంగా చేర్చారు. 32 క్రీడల్లో 329 పతకాలకు పోటీ…. పారిస్ ఒలింపిక్స్ ను 16 రోజులపాటు..32 రకాల క్రీడల్లో 329 పతకాల కోసం 10వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.పారిస్ చుట్టు పక్కల ఉన్న మొత్తం 35 వేదికల్లో పోటీలు నిర్వహిస్తారు. పారిస్ లోని ఐఫిల్ టవర్ చెంతనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికలో బీచ్ బాలీబాల్ పోటీలను, పాలెస్ ఆఫ్ వెర్సెలో వేదికగా ఈక్వెష్టిరియన్, మోడర్న్ పెంటాథ్లాన్ పోటీలను, 124 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాండ్ పాలెస్ వేదికగా ఫెన్సింగ్ టైక్వాండో పోటీలను నిర్వహించనున్నారు.

1924 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకలకు వేదికగా నిలిచిన 117 సంవత్సరాల యిప్పుడు మాన్యోర్ స్టేడియం వేదికగా ఫీల్డ్ హాకీ పోటీలు నిర్వహిస్తారు. క్రీడల ప్రధాన స్టేడియం వేదికగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలతో పాటు ముగింపు వేడుకలు జరుగుతాయి. రోలాండ్ గారోస్ వేదికగా టెన్నిస్ తో పాటు బాక్సింగ్ పోటీలను, పార్క్ డెస్ ప్రిన్సెస్ వేదికగా ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహిస్తారు. ఫ్రెంచ్ పాలిత పోలినీసియన్ ద్వీపం తాహితీ వేదికగా సర్ఫింగ్ పోటీలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం చేసిన వేదికల్లో 95 శాతం ఇప్పటికే ఉన్నవి లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసినవే కావడం విశేషం.

ఒలింపిక్ బంగారు పతకం లో పూర్తిగా బంగారం కాదు ఈఫిల్ టవర్ నుండిఇనుప ముక్క కూడా పారిస్ ఒలిం పిక్స్ పతకాలలో పొందుపరచారు

ఒలింపిక్ బంగారు పతకం లో పూర్తిగా బంగారం కాదు. అయితే, ఈ పతకం లో కొంత మొత్తం లో బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5% వెండిని కలిగి ఉండాలి. అలాగే 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం తో పూత పూయాలి. అదేవిధం గా తక్కువ ఖర్చు కారణం గా వెండి పతకాలు పూర్తిగా వెం డితో, కాంస్య పతకాలను స్వచ్ఛమైన కాంస్యం (రాగి)తో తయారు చేస్తారు. ఒలింపిక్ కమిటీ అన్ని పతకాల పరిమాణం , బరువును కూడా సెట్ చేసింది. దీని కింద పతకాల పరిమాణం 85 మి.మీ కాగా మందం 9.2 మి.మీ. గా ఉంటుంది. అదే విధం గా బంగారు పతకం మొత్తం బరువు 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు, కాంస్య పతకం బరువు 455 గ్రాములు. ఈసారి 19వ శతాబ్దపు చారిత్రక ప్రదేశం ఈఫిల్ టవర్ నుండిఇనుప ముక్క కూడా పారిస్ ఒలిం పిక్స్ పతకాలలో పొందుపరచారు. కొన్నేళ్ల కిందట ఐఫిల్ టవర్కు మార్పులు చేస్తూ.. దాన్నుంచి కొన్ని ఇనుప కడ్డీలను తొలగించారు. ఒలింపిక్స్ పతకాల తయారీలో ఆ ఇనుమును వాడారు. పతకం ముందు భాగం మధ్యలో కనిపించే షడ్భుజి దీంతో చేసిందే. మధ్య నుంచి అంచులకు కిరణాలు వచ్చేట్టుగా డిజైన్ ఉంటుంది. పారిస్ సిటీ ఆఫ్ లైట్’ అని పేరు. దాన్ని సూచించేలా వీటిని రూపొందించారు. వెనకవైపు గ్రీకుల విజయ దేవత నైకీ బొమ్మ కనిపిస్తుంది. దానికి ఒకవైపు ఒలింపిక్స్ పుట్టినిల్లు ఏథెన్స్ నగరంలోని పురాతన కట్టడం ఆక్రోపోలిస్, మరోవైపు ఐఫిల్ టవర్ కనిపిస్తాయి. పారాలింపిక్స్ పతకాల వెనకవైపు ఐఫిల్ టవర్ను పోలిన డిజైన్ ఉంటుంది. దానికి అంచుల్లో ‘పారిస్ 2024′ అని బ్రెయిలీలో ఉంటుంది పతకం ముందు భాగం మధ్యలో కనిపించే షడ్భుజి దీంతో చేసిందే. మధ్య నుంచి అంచులకు కిరణాలు వచ్చేట్టుగా డిజైన్ ఉంటుంది. పారిస్ సిటీ ఆఫ్ లైట్’ అని పేరు. దాన్ని సూచించేలా వీటిని రూపొందించారు. వెనకవైపు గ్రీకుల విజయ దేవత నైకీ బొమ్మ కనిపిస్తుంది. దానికి ఒకవైపు ఒలింపిక్స్ పుట్టినిల్లు ఏథెన్స్ నగరంలోని పురాతన కట్టడం ఆక్రోపోలిస్, మరోవైపు ఐఫిల్ టవర్ కనిపిస్తాయి. పారాలింపిక్స్ పతకాల వెనకవైపు ఐఫిల్ టవర్ను పోలిన డిజైన్ ఉంటుంది. దానికి అంచుల్లో ‘పారిస్ 2024’ అని బ్రెయిలీలో ఉంటుంది స్వర్ణం నెగ్గిన అథ్లెట్లకు 50 వేల డాలర్లు… ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోని మొత్తం 45 అంశాలలో బంగారు పతకాలు సాధించిన అథ్లెట్లకు 50వేల డాలర్లు చొప్పున మొత్తం 2.4 మిలియన్ డాలర్లు నజరానాగా ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం సీఈవో సెబాస్టియన్ కో ప్రకటించారు.. పతకాల వేటలో పోటీ ప్రధానంగా అమెరికా, చైనాల నడుమే జరుగనుంది.

ఇప్పుడు పప్పు, అన్నం పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ అందుబాటులో ఉంటాయి

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఒలింపిక్స్‌ అంటే క్రీడాకారుల సన్నద్ధత మామూలుగా ఉండదు. దీనితో పాటు ఆ సమయంలో దొరికే ఆహారంపైనా వారి ఆటతీరు ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వంటకాలూ అక్కడ ఉంటాయిగాని భారతీయ వంటకాలు మాత్రం ఉండవు అందుకనే ఈ ఏడాది జులై, ఆగస్టుల్లో పారిస్‌లో జరగబోయే ఒలంపిక్స్‌కు భారత ఆటగాళ్ల కోసం మెనూ సిద్ధమైంది. విదేశీ ఆహారాలతో వారు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా భారతీయ మెనూ ఉండనుంది. క్రీడా గ్రామంలో భారతీయ ఆటగాళ్ల కోసం పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, చికెన్ లాంటి కొన్ని రకాల వంటకాలను తయారు చేసి వడ్డించనున్నారు ఇప్పుడు పప్పు, అన్నం పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది ఘనత బ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి.

పారిస్ వేదిక మీద మన లేసు
పారిస్ అంటే ఫ్యాషన్ పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత. ఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ పొందింది పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్ పతాకధారిగా వ్యవహరించనుంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు (రియోలో రజతం, టోక్యోలో కాంస్యం) సాధించిన ఈ తెలుగమ్మాయి.. పారిస్ ఒలింపిక్స్ లో ల్ త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. పురుషుల తరఫున టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశ్యంతో తొ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి నిబంధనలు మార్చింది. ఒకప్పుడు జట్టు మొత్తానికి ఒకరే పతాకధారి ఉండేవారు. 2020లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక మహిళ, ఒక పురుషుడు పతాకధారులుగా వ్యవహరించేలా నిబంధనలు మార్చింది. రూపొందించింది . సింధు కంటే ముందు రెజ్లర్జ్ల సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్ లో రెండు వ్యక్తిగతక్తి పతకాలుసాధించాడు. భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో బేరర్స్ గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తిం పు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి,ర్జి మేరీకోమ్లకు మాత్రమే దక్కింది. అథ్లెట్థ్లె షైనీ విల్సన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో లాంగ్జంపర్ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో… బాక్సర్ మేరీకోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్ ఫ్లాగ్ బేరర్స్ గా ఉన్నారు.

చెఫ్ డి మిషన్ గా గగన్ నారంగ్
మరోవైపు పారిస్ ఒలింపిక్స్ పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్గా తెలం గాణ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరిస్తాడు. ముందుగా మేరికోం చెఫ్ డి మిషన్ గా ప్రకటించినా వ్యక్తిగతక్తి కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. చెఫ్ డి మిషన్ హోదాలో గగన్ ఒలింపిక్స్లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్య వేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్ నారంగ్ 2012 లండన్ఒలింపిక్స్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యపతకం సాధించాడు.

ఎన్నో ఆశలు

కలలా ఉన్న ఆ లక్ష్యం.. ఈసారి నిజమవుతుందని ఓ ఆశ! మరి పారిస్‌లో మన క్రీడాకారులు అదరగొడతారా? రెండంకెల సంబరాన్ని సాక్షాత్కరింపజేస్తారా?

పివి సింధు- బ్యాడ్మింటన్ : తెలుగమ్మాయి, ఏస్ ఇండియన్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు పారిస్‌లో మెడల్ గెలిచే అవకాశం ఉంది. 29 ఏళ్ల సింధు 2016 రియో డి జెనీరో గేమ్స్‌లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి.. వరుగా రెండు ఒలింపిక్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా గుర్తింపు పొందింది. అయితే కొన్నాళ్లుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ షట్లర్, ఒలింపిక్స్ గెలవడమే లక్ష్యంగా జూన్ నుంచి జర్మనీలో ట్రైనింగ్ తీసుకుంటోంది

నీరజ్ చోప్రా- జావెలిన్ త్రో : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచాడు. అథ్లెటిక్స్‌లో భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో 85.97 మీటర్ల త్రో విసిరి గోల్డ్ మెడల్ గెలుచుకున్న చోప్రాపై పారిస్‌ ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

లోవ్లినా బోర్గోహైన్- బాక్సింగ్ : ఇండియన్ బాక్సర్, వరల్డ్ ఫోర్త్ ర్యాంకర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ ఈసారి కూడా ఒలింపిక్స్ మెడల్ గెలవాలనే లక్ష్యంతో పారిస్ వెళ్తోంది. 2018, 2019 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు, 2022 ఆసియా క్రీడలలో సిల్వర్ మెడల్, 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన లోవ్లినా మంచి ఫామ్‌లో ఉంది

సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి- బ్యాడ్మింటన్ : బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ, సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ జంట ముందుగానే నిష్క్రమించినప్పటికీ, ఆ తర్వాత వీరిద్దరి ప్రభావం పెరిగింది. గత కొన్నేళ్లలో ఎన్నో ఇంటర్నేషల్ గేమ్స్‌లో మెడల్స్ గెలిచి, పారిస్ ఒలింపిక్స్ మెడల్ రేసులోకి దూసుకొచ్చారు

మీరాబాయి చాను- వెయిట్ లిఫ్టింగ్ : టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విన్నర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతోంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌కు స్ట్రాంగ్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ గెలిచిన మీరాబాయి చాను,

నిఖత్ జరీన్- బాక్సింగ్ : మరో తెలుగమ్మాయి, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిసారి ఒలింపిక్స్‌లో పోడీ పడనుంది. ఆమె 2019లో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్, 2024 ఫిబ్రవరిలో జరిగిన 75వ ఎడిషన్‌లో సిల్వర్ మెడల్, ఇతర విభాగాల్లో విజయాలు సాధించింది. 51 కిలోల విభాగంలో పోటీపడుతున్న నిఖత్ విన్నింగ్ రేట్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఇతర ఇండియన్ బాక్సర్లతో కలిసి జర్మనీలో ట్రైనింగ్ తీసుకుంటున్న 28 ఏళ్ల నిఖత్, పారిస్ ఒలింపిక్స్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది

అంతిమ్ పంఘల్- రెజ్లింగ్ : వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న అంతిమ్ పంఘల్, గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 53 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె 2022, 2023లో రెండుసార్లు అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్, 2023 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం, 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించి మంచి ఫామ్‌లో ఉంది. 19 ఏళ్ల ఈ రెజ్లర్ కొన్నాళ్లుగా ఒలింపిక్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టింdi

మను భాకర్- షూటింగ్ : మను భాకర్ కెరీర్‌లో రెండోసారి ఒలింపిక్స్‌కు వెళుతోంది. 22 ఏళ్ల యంగ్ షూటర్, టోక్యో ఒలింపిక్స్ తర్వాత చాలా పతకాలు గెలిచింది. ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 5వ స్థానంలో నిలిచి భారత్ నుంచి ఒలింపిక్ కోటా దక్కించుకుంది. ఒకటి కంటే ఎక్కువ ఇండివిడ్యువల్ ఈవెంట్స్‌లో (మహిళల 10m ఎయిర్ పిస్టల్, మహిళల 25m పిస్టల్‌) పోటీపడుతున్న ఏకైక అథ్లెట్‌ మను. ఏదో ఒక ఈవెంట్‌లో ఆమె మెడల్ గెలిచే అవకాశం ఉంది.

పురుషుల హాకీ జట్టు : భారత పురుషుల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలిచింది. ఈ సంవత్సరం హర్మన్‌ప్రీత్ సింగ్, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న గోల్‌కీపర్ PR శ్రీజేష్ ఉన్న ఈ జట్టు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడానికి రెడీ అయింది. 2022 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు, ఈసారి పారిస్‌లో గోల్డ్ మెడల్‌ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్- షూటింగ్ : 23 ఏళ్ల షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 2022 ఆసియా క్రీడలలో నాలుగు మెడల్స్ గెలిచి సత్తా చాటాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడుతున్నాడు

’ఐక్యత మరియు స్థితిస్థాపకత’. ఆనే నినాదం తో పారిస్‌ వేదికగా జులై 26 నుండి జరగబోయే ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులు, నిపుణుల అంచనాలకు అనుగుణంగా మన క్రీడాకారులు భారత్‌ పతాకాన్ని పారిస్‌ వినువీధుల్లో గర్వంగా ఎగురవేస్తారని, పతకాల పంట పండిస్తారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...