హైదరాబాద్, జూన్ 11 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఫిలిం సిటీకి వెళ్లారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు సీఎం వెంట ఉన్నారు.